చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

తనను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించమని సీఎంను కోరిన అనంత్ అంబానీ

by చైతన్యరధం
Oct 3, 2026 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఉద్యానరంగ అభివృద్ధితో ఆర్థికాభివృద్ధి
  • అగ్రికల్చర్ స్కూల్ ద్వారా వ్యవసాయ రంగంలో నైపుణ్యాలు పెంచుతాం
  • కేంద్ర సాయంతో రాష్ట్రాభివృద్ధి
  • ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సహకారాన్ని మరువలేం
  • గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సభలో సీఎం చంద్రబాబు
  • రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం
  • రిలయెన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన
  • మదనపల్లెలో రెండు బృహత్తర ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
  • గోదావరి-కావేరి నదుల అనుసంధానికి అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు
  • తనను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించమని సీఎంను కోరిన అనంత్ అంబానీ
  • అనంత్ అంబానీ ఏపీ ముద్దుబిడ్డ అంటూ ముఖ్యమంత్రి ఆలింగనం

మదనపల్లె (చైతన్యరథం): కరవు సీమగా పేరున్న రాయలసీమను సిరుల సీమగా మారుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో కూటమిని గెలిపించిన మరుక్షణం నుంచే ప్రజలకు మేలు చేయాలనే తలంపుతో ఉన్నామని… దాంట్లో భాగంగానే రాయలసీమలోని ఎనిమిది జిల్లాలు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఉద్యాన రైతులకు మేలుచేసేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టామని చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం గ్లోబల్ హార్టికల్చర్ హబ్-GHH, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్-ISAకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, మంత్రి నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర సహకారంతో రూ.40వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడులతో మరో రూ.60వేల కోట్లను సమీకరించేలా ప్రణాళికలు రూపొందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్మాగాంధీ ఆశయాన్ని సాకారం చేసే దిశగా రాయలసీమలో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో కరవుసీమను రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఉద్యాన రంగం ప్రాథమిక రంగం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రస్తుతం సుమారు రూ.1.50 లక్షల కోట్ల జీవీఏ అందిస్తున్న ఈ రంగం ద్వారా మరో రూ.లక్ష కోట్ల జీవీఏ సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 6లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగును విస్తరించేలా కార్యాచరణ చేపడతామన్నారు. రైతులకు ఉత్పత్తి నుంచి మార్కెటింగ్, ప్రాసెసింగ్, ఎగుమతుల వరకు సమగ్ర మద్దతు అందించడమే హార్టికల్చర్ హబ్ ప్రధాన ఉద్దేశమని సీఎం చంద్రబాబు చెప్పారు. పంటల స్థిరీకరణతో పాటు ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. యాపిల్, స్ట్రాబెరీ నుంచి అరటి, ఆవకాడో, కివీ, ఖర్జూరం వరకు వివిధ రకాల ఉద్యాన పంటలకు ప్రోత్సహం అందిస్తామని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్, లాజిస్టిక్స్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలను అభివృద్ధి చేసి రైతులకు మేలు చేసే వ్యవస్థలను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సీడ్ టు షిప్‌మెంట్ వ్యవస్థల ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేలా కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-10-2026

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

సాగునీరందిస్తాం… బంగారం పండించండి
సాగునీరు అందిస్తే రాయలసీమ ప్రజలు బంగారం పండిస్తారని, మార్కెటింగ్ ద్వారా సంపద సృష్టిస్తారని సీఎం పేర్కొన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, రూ.3,500 కోట్లతో హంద్రీ-నీవా కాలువను పూర్తి చేసి కుప్పం వరకు నీటిని తీసుకెళ్లామని చెప్పారు. వెలిగొండ మొదటి దశను పూర్తి చేసి మార్కాపురానికి, పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటిని అందించామని వివరించారు. మరో రూ.35వేల కోట్లతో 36 ప్రాధాన్య ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం తెలిపారు. రాయలసీమలో హంద్రీ-నీవా, మడకశిర బ్రాంచ్ కెనాల్, మల్లెమడుగు, బాలాజీసాగర్, అప్పర్ పేరూరు తదితర ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. వాతావరణ మార్పులు, ఎల్`నినో వంటి పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో సవాళ్లు పెరుగుతున్నాయని సీఎం అన్నారు. గోదావరిలో ఈ ఏడాది కూడా సుమారు 1,600 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని, పట్టిసీమ ద్వారా పదేళ్లలో సుమారు 500 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని తెలిపారు. కృష్ణా డెల్టాలో పొదుపు చేసిన నీటిని రాయలసీమకు తరలించడం నదుల అనుసంధానం వల్లే సాధ్యమైందన్నారు. వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని సీఎం తెలిపారు. పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, డిజిటల్ కనెక్టివిటీ మాదిరిగా వాటర్ గ్రిడ్ అవసరమని చెప్పారు. గోదావరి నుంచి కావేరి వరకు నీటిని అనుసంధానం చేసే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. గోదావరి-కావేరి అనుసంధానంతో రాయలసీమ కరవు తీరడంతోపాటు… దక్షిణాదిలోని 4 రాష్ట్రాల మధ్య నెలకొనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. రిలయన్స్ సంస్థ సహకారంతో మదనపల్లెలో ఏర్పాటు కానున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా వ్యవసాయం, ఉద్యానవనం, ఆధునిక సాంకేతికత, పరిశోధన, కృత్రిమ మేధ వంటి రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించేలా ఈ సంస్థను తీర్చిదిద్దనున్నట్టు వెల్లడించారు. ఐఐఎంలో మేనేజ్‌మెంట్ నిపుణులు, ఐఐటీలో సాంకేతిక నిపుణులు, ఐఎస్‌బీలో పారిశ్రామిక నైపుణ్యాలు అభివృద్ధి చెందినట్లే… ఐఎసఏ ద్వారా వ్యవసాయ రంగంలో నాయకత్వ నైపుణ్యాలు కలిగిన నిపుణులను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఉక్కు మహిళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి, దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అందిస్తున్న సహకారాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమరావతి, విశాఖ ఉక్కు, పోలవరం తదితర ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో నిర్మలా సీతారామన్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ నెక్స్ట్‌జెన్ సంస్కరణలు, డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల్లో పారదర్శకత, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల ద్వారా దేశాన్ని బలోపేతం చేస్తున్న ఉక్కు మహిళ నిర్మలా సీతారామన్ అని సీఎం అన్నారు. ఇంటిని చక్కగా తీర్చిదిద్దే సత్తా మహిళకు మాత్రమే ఉంటుందని.. అదే విధంగా దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మలా సీతారామన్ తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆమెకున్న నాయకత్వ పటిమను గుర్తించే ప్రధాని మోదీ ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు నిధులు కేటాయించే విషయంలో నిర్మలా సీతారామన్ చూపిన చొరవను.. ఇచ్చిన సహకారాన్ని మరువలేమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో అభివృద్ధి-సంక్షేమం చేయగలుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పెద్ద మనసు చాటుకున్నారన్నారు. వ్యవసాయం, ఉద్యాన రంగాల్లో పరిశోధన, ఆధునిక సాంకేతికత, ఏఐ వినియోగంతో పాటు రైతులకు అవసరమైన మద్దతు వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో రిలయన్స్ సంస్థ సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. సీడ్ టు షిప్‌మెంట్, అగ్రిటెక్, లాజిస్టిక్స్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మరింతగా భాగస్వామ్యం కావాలని సూచించారు. తిరుమల శ్రీవారిపై భక్తితో ఈవీ బస్సులను సమకూర్చిన అనంత్ అంబానీ సేవలను సీఎం ప్రస్తావించారు. వంతారా వంటి వ్యవస్థను ఏర్పాటు చేసి జంతువులకు సైతం సేవలు అందిస్తున్న గొప్ప పర్యావరణ ప్రేమికుడు అనంత్ అంబానీ అని కొనియాడారు. అనంత్ అంబానీ తన తాత, తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వారి బాటలో నడుస్తున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.

ప్రత్యేక ఆకర్షణగా అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌తో తన అనుబంధాన్ని చాటుకుంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. తనను ఆంధ్ర బిడ్డగా భావించాలని, రాష్ట్రానికి తాను ఏం చేయగలనో మార్గనిర్దేశం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ఆకట్టుకుంది. అనంత్ అంబానీ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆయన్ను అభినందించారు. అనంతరం సీఎం చంద్రబాబు అనంత్ అంబానీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రసంగించిన ముఖ్యమంత్రి… అనంత్ అంబానీ మాటలకT స్పందించారు. అనంత్ అంబానీని ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డగా భావిస్తున్నామని సీఎం వేదికపై ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో రిలయన్స్ సంస్థ మరింతగా భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.

సభలో వక్తల ప్రసంగాలకు ముందు ప్రత్యేక వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. రాయలసీమలో ఉద్యానరంగం అభివృద్ధి, రైతుల ఆదాయ పెంపు, నీటి వనరుల వినియోగం, ఆధునిక సాగు విధానాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల అవకాశాలను ఈ వీడియోలో వివరించారు. కార్యక్రమం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మొక్కలు నాటారు. ఉద్యాన రంగానికి సంబంధించి ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమం లో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Previous Post

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

Next Post

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-10-2026

కార్యకర్త
@ October 3, 2026
దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా
ఆంధ్రప్రదేశ్

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్
ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం
ఆంధ్రప్రదేశ్

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

కార్యకర్త
@ October 2, 2026
వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి
ఆంధ్రప్రదేశ్

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

చైతన్యరధం
@ October 2, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే
ఆంధ్రప్రదేశ్

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
Load More

ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist