- సునీల్ యాదవ్ వాంగ్మూలంపై జగన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదు?
- నాడు లోటస్ పాండ్‌లో బటన్ నొక్కితేనే.. పులివెందులలో ప్రాణాలు గాల్లో కలిశాయి
- నిందితుల వాంగ్మూలాలపై పాటిస్తున్న మౌనం ముమ్మాటికీ నేరాన్ని అంగీకరించడమే
- ఆయప అవినీతి, నేర మనస్తత్వం ముందు అంతర్జాతీయ మాఫియా డాన్లు దిగదుడుపే
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
మంగళగిరి(చైతన్యరథం): బాబాయ్ హత్యతో అబ్బాయి మాత్రమే లాభం పొందాడని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాల యంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి అవినీతి,నేరపూరిత మనస్తత్వం ముందు అంతర్జాతీయ మాఫి యా డాన్లు సైతం దిగదుడుపేనని, తాను చేసిన ఘోర నేరాలు, హత్యలను ఇతరులపైకి నెట్టేసి తప్పించుకోవడంలో జగన్ నేర సామ్రాజ్యానికే సరికొత్త పాఠాలు నేర్పుతున్నారని మండిపడ్డారు. కేవలం ఆర్థిక ఉగ్రవాదిగానే కాకుండా నేరాల సూత్రధారిగా అవతరించిన జగన్, తాత రాజారెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చు కుని రాష్ట్రంలో తన అనుచరులకు ‘రప్పా రప్పా’ హింసా సంస్కృ తిని నూరిపోస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయ్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ స్వయంగా వాస్తవాలు వెల్లడిస్తుంటే జగన్‌రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.
వివేకా హత్యతో అంతిమ లబ్ధిపొందింది జగన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, అవినాష్‌రెడ్డి మాత్రమేనని సునీల్ యాదవ్ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ప్రజలకు జగన్ సమాధా నం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. తమను విచారిస్తే న్యాయం జరగదని, అంతిమ లబ్ధిదారులైన జగన్, అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులను విచారిస్తేనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని సునీల్ యాదవ్ కోర్టు సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్, అవినాష్‌రెడ్డిల నుంచే తనకు ప్రాణహాని ఉందని, జైలు నుంచి బయటకు వచ్చాక తనపై ఇప్పటికే మూడుసార్లు హత్యా యత్నం జరిగిందని కూడా సునీల్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా తాడేపల్లి ప్యాలెస్ ఎందుకు నిశ్శబ్దంగా ఉందని ప్రశ్నించారు. కీలక సాక్షుల
మరణాల వెనుక నిజాలేమిటి?
వివేకా హత్య కేసుతో సంబంధమున్న కీలక సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతుండటం వెనుక ఉన్న అసలు నిజాలేమిటని ప్రశ్నించారు. హత్య సమాచారం ముందుగా తెలిసిన కసనూరు శ్రీనివాస్ రెడ్డి, మృతదేహానికి కుట్లు వేసిన ఆసుపత్రి యజమాని ఈసీ గంగిరెడ్డి, హత్యను తనపై వేసుకుంటే శివశంకర్ రెడ్డి రూ.10 కోట్లు ఇస్తానన్నట్లు వాంగ్మూలం ఇచ్చిన కువైట్ గంగాధర్‌రెడ్డి, హైదరాబాద్ నుంచి పులివెందులకు జగన్ దంపతులను తీసుకొచ్చిన డ్రైవర్ నారాయణ, రక్తపు మరకలు తుడిచి కుట్లు వేసిన పరిస్థితులపై సాక్ష్యమిచ్చిన వైఎస్ అభిషేక్ రెడ్డి, నిందితులు గోడ దూకి పారిపోయిన తీరును వివరించిన వాచ్మెన్ రంగయ్య.. ఇలా కీలక వ్యక్తులంతా అనుమానాస్పదం గా మరణించడం జగన్ మార్క్ నేర రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు.
సుపారీ ఇచ్చే స్థోమత జగన్‌రెడ్డికే ఉంది
వివేకా హత్య కోసం చేతులు మారిన రూ.40 కోట్ల భారీ సుపారీ ఇచ్చే ఆర్థిక స్థోమత ఎర్ర గంగిరెడ్డికో, శివశంకర్ రెడ్డికో లేదని, హత్య ద్వారా రాజకీయంగా లబ్ధిపొందిన జగన్ కుటుంబా నికి మాత్రమే ఆ స్థోమత ఉందని స్పష్టం చేశారు. సుపారీలో అడ్వాన్స్డ్ ఇచ్చిన కోటి రూపాయల్లో సునీల్ యాదవ్ లాకర్ లోని రూ.40 లక్షలను ఈడీ అటాచ్ చేసిందని, ఈ నగదు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే చేతులు మారిందని ఆధారాలు ఉన్నాయన్నారు. హత్య జరిగిన రోజు వేకువజామున నాలుగున్నర గంటల ప్రాంతంలోనే జగన్‌రెడ్డి తన వద్దకు వచ్చి ‘వివేకానందరెడ్డి నో మోర్’ అని చెప్పినట్లు నాటి ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారని గుర్తుచేశారు. వేకువ జామునే బాబాయ్ చనిపోయిన విషయం తెలిసినా. సాయంత్రం 5 గంటల వరకు పులివెందుల వెళ్లకుండా హైదరాబాద్‌లోనే ఎందుకు ఉండిపోయారో జగన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించా రు. ఘటనా స్థలంలో నాలుగు లీటర్ల రక్తాన్ని తుడిచేసి గుండె పోటు అంటూ సాక్షి పత్రిక ద్వారా తప్పుడు కథనాలు ప్రసారం చేసి సాక్ష్యాలను తారుమారు చేసేందుకే ఆ సమయాన్ని వాడుకు న్నారని ఆరోపించారు.
విచారణను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు.
గతంలో అధికారం లేనప్పుడు సీబీఐ దర్యాప్తు కోరిన జగ నడ్డి.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కర్నూలు ఆసుపత్రి వద్ద సీబీఐ అధికారులపైనే దాడులు చేయించి విచారణను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. దస్తగిరి నిజాలు, సునీల్ యాదవ్ వాస్తవాలు, దర్యాప్తు సంస్థల నివేదికలు, గూగుల్ టేక్ అవుట్ సాంకేతిక ఆధారాలు, ఈడీ అటాచ్మెంట్లు అన్నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయని తెలిపారు. వారం వారం ప్రెస్మీట్లు పెట్టి గంటల తరబడి ఉపన్యాసాలు దంచే జగన్‌రెడ్డి, సొంత బాబాయ్ హత్యపై నిందితులు నేరుగా తనపైనే వేలెత్తి చూపుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. నిందితుల వాంగ్మూలాలపై జగన్ పాటిస్తున్న నేరపూరిత మౌనం ముమ్మాటికీ హత్యను, ఆ కుట్రను అంగీకరించడమేనని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అంతఃపుర నెత్తుటి రహస్యా న్ని స్వయంగా ప్రజల ముందు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.














