- రిజర్వేషన్ నిబంధనలు పటిష్ఠంగా అమలుకు మార్గం
- 1,523 పోస్టులకు మార్గం సుగమం చేసేలా సవరణలు
- అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంతో పాటు, రిజర్వేషన్ నిబంధనలను చట్టపరంగా పటిష్టంగా అమలు చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్ బిల్-2026ను మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక ఖాళీలు భారీ గా ఉన్నాయని తెలిపారు. చివరిసారిగా 2012లో నియామకాలు జరిగాయని, ప్రస్తుతం రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో సుమారు 77 శాతం టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో తొలి విడతగా 1,523 అధ్యాపక పోస్టులను భర్తీ చేసే లక్ష్యాన్ని నిర్దేశిం చినట్లు వివరించారు. అయితే విశ్వవిద్యాలయ నియామకాల్లో రిజర్వేషన్, యÖజీసీ మార్గదర్శకాలు, గత నియామకాలకు సంబంధించిన న్యాయపరమైన వివాదాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సవరణలు అవసరమయ్యాయని తెలిపారు.
సవరణల్లో భాగంగా విశ్వవిద్యాలయాన్ని యూనిట్‌గా పరిగణిస్తూ నియామ కాల నిర్వహణ, అవసరమైనప్పుడు ఉన్న ఫ్యాకల్టీని అడ్జస్ట్ చేసేం దుకు ప్రత్యేక విధానం, అడ్జస్ట్మెంట్ సాధ్యం కానప్పుడు సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించే అవకాశం, డిపార్ట్మెంట్ స్థాయిలో రిజర్వేషన్ ప్రాతినిధ్యం కల్పించడం, సీనియారిటీ, ప్రమోషన్లకు డిపార్ట్మెంట్ను యూనిట్‌గా పరిగణించడం వంటి అంశాలను సవరణ బిల్లులో పొందుపరిచినట్లు చెప్పారు. వర్టికల్, హారిజాం టల్ విధానాలు రెండింటినీ సమన్వయంతో అమలు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టపరమైన స్పష్టత తీసుకొస్తు న్నట్లు చెప్పారు. గత నియామకాల్లో ఎదురైన న్యాయపరమైన సమస్యలు మళ్లీ తలెత్తకుండా.. కొత్త నియామక ప్రక్రియ లీగల్ స్క్రూటినీని తట్టుకునేలా సవరణలను రూపొందించినట్లు తెలి పారు. అధ్యాపక ఖాళీల భర్తీ, రిజర్వేషన్‌కు న్యాయం, నాణ్యమైన ఉన్నత విద్య, ఈ మూడు లక్ష్యాలను కలిపేలా కొత్త నియామక వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
నాలుగు కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం
మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో బుధవారం నాలుగు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. వాటిని సభ హర్షధ్వానాల నడుమ ఏకగ్రీవంగా ఆమోదించింది. ది ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ అమెండ్మెంట్ బిల్లు- 2026, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యా లయాల స్థాపన, క్రమబ ద్ధీకరణ సవరణ బిల్లు 2026, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ బిల్-2026లకు శాసనసభ పచ్చజెండా ఊపింది.











