- ఘటన తర్వాత స్పందించడం కంటే
- ముందే అప్రమత్తంగా ఉండాలి
- మత్స్యకారుల గల్లంతు ఘటనపై
- అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు
- గాలింపు చర్యలలు విస్తృతం చేయాలని ఆదేశం
అమరావతి(చైతన్యరథం): సముద్రంలో మత్స్యకారులు గల్లం తైన ఘటనలో తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు జాగ్ర త్తలతో ప్రమాదాలను నివారించేలా ఎసఓపీ అమలు చేయా లని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, వేటకు వెళ్లే వారి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటేనే అత్య వసర సమయాల్లో సత్వర సాయం అందించగలమని స్పష్టం చేశారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఏడు గురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఘటనపై గురువారం కూడా క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గల్లంతైన మత్స్యకా రుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలు, వివిధ విభాగాల మధ్య సమన్వయం, చేపట్టాల్సిన చర్యలపై అధికారుల ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు
ఈ నెల 3వ తేదీన ఏడుగురు మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లారని, 10 రోజుల తర్వాత తిరిగి వస్తామని కుటుంబసభ్యుల కు చెప్పినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ నెల 16న మత్స్యకారుల ఆచూకీ లభించడం లేదని కుటుంబసభ్యులు అధికా రులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసుల సహకారంతో గాలింపు చర్య లు ప్రారంభించినట్లు చెప్పారు. బోటులో ట్రాన్స్‌పాండర్ ఏర్పాటు, బోటు ఒంటరిగా ఎందుకు సముద్రంలోకి వెళ్లింది? బోటు గల్లంతైన విషయం అధికారులకు ఎప్పుడు తెలిసింది? తెలిసిన వెంటనే గాలింపు చర్యలు ఎప్పుడు ప్రారంభించారు? అనే అంశా లపై సీఎం అధికారులను ప్రశ్నించారు. గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఇప్పటికే చెన్నైలోని కోస్ట్‌గార్డ్ హెడ్‌క్వార్టర్స్‌తో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు మాట్లా& ినట్లు అధికారులు తెలిపారు.
ఏపీకి చెందిన బోటు గల్లంతైన విషయాన్ని అండమాన్ సహా బంగ్లాదేశ్‌కు కూడా చెన్నైలోని కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారుల ద్వారా తెలియజేసినట్లు చెప్పారు. నేవీ డార్నియర్ విమానాల ద్వారా 216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు నిర్వహించినట్లు వివరించారు. వేటకు వెళ్లే మత్స్యకారు లకు అందుతున్న సాంకేతిక సహాయం, రోజువారీ సమన్వయ వ్యవస్థలపైనా చంద్రబాబు సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేసి మత్స్యకారులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, వారి కుటుంబసభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందిం చాలని అధికారులను సీఎం ఆదేశించారు.












