చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి లోకేష్

by చైతన్యరధం
Aug 6, 2026 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏపీ స్పోర్ట్స్ విజన్ సాకారంలో సింధు సహకారం కావాలి
  • క్రీడాకారులకు అవసరమైన సంపూర్ణ మద్దతు అందిస్తాం
  • పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి
  • విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి లోకేష్

విశాఖపట్నం (చైతన్యరథం): వేలాది మంది భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ నిలుస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణ పనులకు భూమి పూజ అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల క్రితం భారత జట్టు జెర్సీ ధరించాలని కలలు కన్న ఒక చిన్నారి ఉండేది. ప్రతి ఉదయం హైదరాబాద్ నగరం ఇంకా నిద్రలోనే ఉండగా… ఆమె అప్పటికే కోర్టులో సాధన ప్రారంభించేది. సాధన చేసేది. పాఠశాలకు వెళ్లేది. తిరిగొచ్చి మళ్లీ సాధన చేసేది. అప్పుడు కెమెరాలు లేవు, వార్తల్లో ఆమె పేరు లేదు, పతకాలు కూడా లేవు. ఉన్నది ఒక్కటే… క్రమశిక్షణ, త్యాగం. నిన్నటి కంటే ఈరోజు మరింత మెరుగ్గా మారాలనే అచంచల సంకల్పం. ఈరోజు ప్రపంచమంతా ఆమెను ఒలింపిక్ పతక విజేతగా, ప్రపంచ ఛాంపియన్‌గా, భారతదేశపు అత్యంత గొప్ప క్రీడా దిగ్గజాల్లో ఒకరిగా గుర్తిస్తోంది. మనం గర్వంగా ఆమెను మన సోదరి పీవీ సింధు అని పిలుస్తున్నాం.

పీవీ తల్లిదండ్రుల త్యాగం ఎనలేనిది
ప్రజలు పతకాన్ని చూస్తారు. కానీ ఆ పతకం వెనుక ఉన్న ప్రయాణాన్ని ఎప్పుడూ చూడరు. ప్రతి ఛాంపియన్ వెనుక ఎదురు చూసిన ఒక తల్లి ఉంటుంది. నమ్మకం కోల్పోని ఒక తండ్రి ఉంటారు. ఎప్పుడూ వెనుకంజ వేయని ఒక కోచ్ ఉంటారు. ఈ రోజు పీవీ రమణకి, పి.విజయకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఒలింపిక్ పతకాలు గెలవలేదు. కానీ భారతదేశానికి ఒక ఒలింపిక్ ఛాంపియన్‌ను అందించారు. అలాగే ప్రతి కోచ్‌కు కూడా నా వందనం. ఎందుకంటే ఛాంపియన్లు ఒక్క రాత్రిలో తయారుకారు. వారిని సహనం, క్రమశిక్షణ, అచంచల విశ్వాసంతో తీర్చిదిద్దుతారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026

వైఫల్యాలను చూసి భయపడొద్దు

ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

వేలాది మంది భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదిక పీవీ సింధు అకాడమీ
కొన్ని వారాల క్రితం వివిధ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారులందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. ఆ సాయంత్రం సింధు కూడా ఎంతో ఆప్యాయంగా మాతో కలిసి విందులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె చెప్పిన ఒక మాట నా మనసులో బలంగా నిలిచిపోయింది. తాను ఇప్పుడు 19 ఏళ్ల యువ క్రీడాకారిణిని కాదన్నారు. ఆ మాట నన్ను ఎంతో ఆలోచింపజేసింది. ఎందుకంటే.. ఆమె లక్ష్యం ఇప్పుడు కేవలం పతకాలు గెలవడమే కాదు. తాను చేసిన ఈ ప్రయాణాన్ని, తాను పొందిన అనుభవాన్ని ఎలా ఒక వ్యవస్థగా రూపుదిద్దాలి, వాటిని తర్వాతి తరాలకు ఎలా అందించాలన్నదే ఆమె ఆలోచన. తన లెగసీని ఎలా కొనసాగించాలి, తన నుంచి ప్రేరణ పొందిన తరతరాల క్రీడాకారులు ఎదగాలంటే ఏం చేయాలనే దిశగా ఆమె ఆలోచిస్తున్నారు. ఆ స్ఫూర్తితోనే విశాఖపట్నాన్ని క్రీడా రంగంలో ఒక గొప్ప కేంద్రంగా మార్చగలమనే విశ్వాసం ఆమెకు ఉంది. అందుకే ఈ రోజు వారందరూ మీ అందరి ముందుకు వచ్చి నిలబడ్డారు. ఈరోజు మనం కేవలం ఒక భవనానికి శంకుస్థాపన చేయడం లేదు. వేలాది మంది భవిష్యత్ ఛాంపియన్ల జీవిత ప్రయాణానికి తొలి అధ్యాయాన్ని లిఖిస్తున్నాం. బహుశా తదుపరి ఒలింపిక్ ఛాంపియన్ ఇక్కడే మన మధ్య కూర్చుని ఉండవచ్చు. తాను ఒక రోజు ప్రపంచ వేదికపై నిలుస్తానని ఆ చిన్నారికే ఇంకా తెలియకపోవచ్చు. ఆ సామర్థ్యాన్ని గుర్తించే అవకాశం ఆ చిన్నారికి కల్పించడం మనందరి బాధ్యత.

పీవీ సింధు వ్యక్తిగత కల అందరి కలగా మారింది
ప్రపంచంలోని అగ్ర శ్రేణి క్రీడా దేశాలన్నింటిలో ఒక విషయం మాత్రం కామన్‌గా కనిపిస్తుంది. వారు ఛాంపియన్లు జన్మించాలని ఎదురుచూడరు. ఛాంపియన్లు తయారయ్యే వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్‌ను నిర్మించింది. ఖతార్ ప్రపంచ ప్రఖ్యాత అస్పైర్ జోన్‌ను అభివృద్ధి చేసింది. ఇండియా ఇన్‌స్పైర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలు తమ దేశాలకు గర్వకారణమైన అనేక మంది క్రీడాకారులను తీర్చిదిద్దాయి. ఎందుకంటే గొప్ప దేశాలకు ఒక సత్యం తెలుసు. ఒలింపిక్ పతకాలను క్రీడాకారులు గెలుస్తారు… కానీ ఒలింపిక్ కలలకు పునాది వేసేది సంస్థలే. ఈ అకాడమీ కూడా ఒక కలతోనే ప్రారంభమైంది. అది సింధు హృదయానికి ఎంతో దగ్గరైన ఒక కల. కానీ ఆ కలను ఆమె మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పంచుకున్నప్పుడు, ఆయన ఆమెను కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే ఎందుకని ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు. ప్రతి క్రీడలోని పిల్లలు నేర్చుకునేలా, శిక్షణ పొందేలా, అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా ఒక కేంద్రాన్ని ఎందుకు నిర్మించకూడదని ప్రశ్నించారు. ఆ ఒక్క ప్రశ్న అన్నింటినీ మార్చేసింది. ఒక వ్యక్తిగత కల అందరి కలగా మారింది. ఒక భాగస్వామ్య దార్శనికతగా రూపుదిద్దుకుంది.

అన్ని రకాల క్రీడలకు నిలయంగా పీవీ సింధు అకాడమీ
ఒక భవనాన్ని నిర్మించడం, ఒక శాశ్వత వారసత్వాన్ని నిర్మించడం మధ్య ఉన్న తేడా అదే. ఈ రోజు ఇది కేవలం ఒక బ్యాడ్మింటన్ అకాడమీ మాత్రమే కాదు. ఇది బ్యాడ్మింటన్‌కు, స్విమ్మింగ్‌కు, జిమ్నాస్టిక్స్‌కు, షూటింగ్‌కు, వెయిట్‌లిఫ్టింగ్‌కు, బాస్కెట్‌బాల్‌కు, ఫుట్‌బాల్‌కు వేదికగా నిలవనుంది. అంకితభావంతో ఈ గడప దాటి లోపలికి అడుగుపెట్టి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యంతో బయటకు వచ్చే ప్రతి యువ క్రీడాకారుడికి ఒక నిలయంగా నిలుస్తుంది. క్రీడలపై మక్కువతో ఈ ప్రాంగణంలో అడుగుపెట్టే ప్రతి యువ క్రీడాకారుడు స్పష్టమైన లక్ష్యం, ఆత్మవిశ్వాసంతో బయటకు వెళ్లేలా తీర్చిదిద్దడమే మా సంకల్పం. ఈ దార్శనికతకు ప్రతిరూపంగానే ఈ క్యాంపస్‌లో ప్రతిపాదించిన మల్టీ-స్పోర్ట్స్ సెంటర్ రూపుదిద్దుకుంటోంది.

భవిష్యత్ ఛాంపియన్ల గమ్యస్థానంగా ఏపీ నిలుస్తుంది
ఇన్నేళ్లుగా భారతదేశ యువ క్రీడాకారులు ప్రపంచంలోని గొప్ప క్రీడా సంస్థల్లో శిక్షణ పొందేందుకు విదేశాల వైపు చూశారు. భారతదేశం నలుమూలల నుంచి యువ క్రీడాకారులు.. తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందమైన విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న పీవీ సింధు సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందాలని కోరుకుంటున్నామని చెప్పే రోజు కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఆ రోజు వచ్చినప్పుడు నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ కేవలం ఛాంపియన్లను తయారుచేసే రాష్ట్రంగా మాత్రమే కాకుండా భవిష్యత్ ఛాంపియన్లు తమ కలలను సాకారం చేసుకోవడానికి దేశం మొత్తం నుంచి వచ్చే గమ్యస్థానంగా కూడా గుర్తింపు పొందుతుంది.

భవిష్యత్ తరాలకు పీవీ సింధు బాసటగా నిలుస్తున్నారు
భారతదేశానికి ఎన్నో పతకాలు అందించినందుకు మాత్రమే కాకుండా భవిష్యత్ తరానికి తిరిగి అందించాలనే గొప్ప సంకల్పాన్ని ఎంచుకున్నందుకు పీవీ సింధుకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర దార్శనికతను సాకారం చేయడానికి అంకితభావంతో కృషి చేస్తున్న దత్తాని కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈ అకాడమీ ఒకే క్రీడకు పరిమితం కాకుండా, ఒకే క్రీడాకారుడి వరకే ఆగిపోకుండా, ఒకే తరం వరకే పరిమితం కాకుండా, విస్తృత దార్శనికతతో ముందుకు సాగేందుకు ప్రోత్సహించిన గౌరవ సీఎం చంద్రబాబునాయుడుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదే నిజమైన నాయకత్వం.

విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం
ప్రతి చిన్నారి డాక్టర్ కాలేడు, ప్రతి చిన్నారి ఇంజనీర్ కాలేడు. ప్రతి చిన్నారి శాస్త్రవేత్త కాలేడు. అలాగే ప్రతి చిన్నారి ఒలింపియన్ కూడా కాలేడు. కానీ ప్రతి చిన్నారి ఒక ప్రత్యేకమైన ప్రతిభతోనే జన్మిస్తుంది. ప్రతి చిన్నారిలో దాగి ఉన్న సహజ ప్రతిభను గుర్తించేందుకు దోహదపడటం ఒక మంచి విద్యా వ్యవస్థ, ఒక మంచి ప్రభుత్వ బాధ్యత. అదే మా నిబద్ధత. విద్యా శాఖ మంత్రిగా విద్య, క్రీడలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నాం. తరగతి గది జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఆట స్థలం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. తరగతి గది ఎలా ఆలోచించాలో నేర్పుతుంది. ఆట స్థలం ఎలా పోరాడాలో నేర్పుతుంది. ఈ రెండూ ముఖ్యమైనవే. అందుకే మన పాఠశాలల్లో నో బ్యాగ్ డేను ప్రవేశపెట్టాం. ఎందుకంటే జీవితంలో అత్యంత విలువైన కొన్ని పాఠాలు బల్ల ముందు కూర్చొని నేర్చుకోలేం. వాటిని ఆట స్థలంలోనే నేర్చుకుంటాం.

క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుంది
క్రీడలు కేవలం పతక విజేతలను మాత్రమే తయారు చేయవు. మంచి వ్యక్తిత్వం కలిగిన మనుషులను కూడా తీర్చిదిద్దుతాయి. విజయానికి ముందు క్రమశిక్షణ నేర్పుతాయి. విజయానికి ముందు ప్రత్యర్థుల పట్ల గౌరవాన్ని నేర్పుతాయి. విజయం తర్వాత వినయాన్ని నేర్పుతాయి. ఓటమి తర్వాత మళ్లీ లేచి నిలబడే ధైర్యాన్ని నేర్పుతాయి. అందుకే ప్రతి చిన్నారి తప్పకుండా ఒక క్రీడ ఆడాలి. ప్రతి చిన్నారి పతకం గెలిచినా, గెలవకపోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం తప్పకుండా గెలుచుకుంటారు.

ఏపీ స్పోర్ట్స్ విజన్ సాకారంలో సింధు సహకారం కావాలి
ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా రంగానికి సంబంధించి మా విజన్‌ను సాకారం చేయడంలో సింధు సహకారం ఎంతో అవసరం. మహిళల క్రీడాభివృద్ధి కోసం ఎలా ముందుకు సాగాలనే అంశంపై మేం ఇప్పటికే పనిచేస్తున్నాం. మరింత మంది బాలికలు, మహిళలు క్రీడల్లోకి రావాలంటే ఏం చేయాలనే దానిపై దృష్టి సారిస్తున్నాం. అది అంత సులభం కాదని తెలుసు. మీ తండ్రి వాలీబాల్ క్రీడాకారుడు కావడంతో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి ప్రోత్సహించారు. కానీ ప్రతి బాలికకు అలాంటి ప్రోత్సాహం లభించదు. అందుకే ముఖ్యంగా బాలికలు క్రీడల్లో రాణించేలా వారికి అనుకూలమైన వాతావరణం, స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ నిర్మించడం అత్యంత అవసరం. ఆ మార్పునకు సింధు ఒక కీలక ప్రేరణగా ఒక్కరికి మాత్రమే కాదు, తరతరాల మహిళలకు స్ఫూర్తినిస్తూ క్రీడలను కూడా ఒక గొప్ప వృత్తి అవకాశంగా చూడగలిగేలా వారిలో ఆత్మవిశ్వాసం నింపాలి. అందుకే సమగ్ర క్రీడా విధానంతో పాటు బలమైన స్పోర్ట్స్ ఎకో సిస్టం నిర్మించడంలో మీతో కలిసి పని చేయాలని ఎదురుచూస్తున్నాను.

యువ క్రీడాకారులకు అవసరమైన సంపూర్ణ మద్దతు అందిస్తాం
ఏపీ క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తాం. మీకు ఎప్పుడైనా, ఏ సహాయం అవసరమైనా మా తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. శాప్ చైర్మన్ రవినాయుడు విశ్వవిద్యాలయ రాజకీయాల నుంచి వచ్చినప్పటికీ, క్రీడల ప్రాముఖ్యతను, మా గౌరవ ముఖ్యమంత్రి దూరదృష్టిని బాగా అర్థం చేసుకున్నారు. అందువల్ల మీకు అవసరమైన ప్రతి సహాయానికీ మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఏ చిన్నారి కూడా అవకాశం లేకపోవడంతో ప్రతిభ కోల్పోకూడదని మేం బలంగా విశ్వసిస్తున్నాం. అందుకే మేం మీ వెన్నంటే ఉంటాం. ప్రపంచాన్ని జయించండి. ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలవండి. భారతదేశానికి కీర్తి తీసుకురండి.

ప్రతి మెడల్ వెనుక తల్లిదండ్రుల త్యాగం, కోచ్ అంకితభావం దాగి ఉంటాయి
ఇక్కడ ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచం ఒక ఛాంపియన్‌ను చూసే ముందు.. తల్లిదండ్రులు తమ బిడ్డలోని కలను చూస్తారు. ప్రతి కోచ్‌కూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు కేవలం ఒక క్రీడను మాత్రమే బోధించరు. ఆత్మవిశ్వాసాన్ని నిర్మిస్తారు. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతారు. కొన్నిసార్లు ఒక జీవితాన్నే మలుస్తారు. ప్రతి మెడల్‌పై ఒక క్రీడాకారుడి పేరు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ ప్రతి పతకం వెనుక ఒక కుటుంబం చేసిన త్యాగం, ఒక కోచ్ అంకితభావం దాగి ఉంటాయి.

గొప్ప క్రీడాకారులను తీర్చిదిద్దే రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందాలి
నా డ్రీమ్ చాలా సింపుల్. ఆంధ్రప్రదేశ్ గొప్ప విద్యార్థులను తయారు చేసే రాష్ట్రంగా మాత్రమే కాకుండా, గొప్ప పరిశ్రమలను నిర్మించే రాష్ట్రంగా మాత్రమే కాకుండా, గొప్ప క్రీడాకారులను తీర్చిదిద్దే రాష్ట్రంగా కూడా గుర్తింపు పొందాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ప్రతి పాఠశాల క్రీడలను ఒక పండుగలా జరుపుకోవాలి. ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసంతో ఆట స్థలంలో అడుగుపెట్టాలి. ప్రతి చిన్నారిని సింధు చేయగలిగితే… నేను కూడా చేయగలననే నమ్మకంతో ముందుకు సాగాలి. ఒక రోజు ఒక చిన్నారి ఈ అకాడమీ గేటు దాటి… ఆశ అనే ఒకే ఒక్క సంపదతో లోపలికి అడుగుపెడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే చిన్నారి త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి ఒలింపిక్ స్టేడియంలోకి అడుగుపెట్టవచ్చు. ప్రపంచం ఆ పతకాన్ని చూసి సంబరాలు చేసుకుంటుంది. భారతదేశం ఆ విజయాన్ని చూసి గర్విస్తుంది. కానీ ఆ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో మనం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఒక కలతో, నమ్మకంతో నిలిచిన ఒక కుటుంబంతో, దారిచూపిన కోచ్‌లతో, అవకాశాలను సృష్టించిన ఒక ప్రభుత్వంతో చిన్నగా ఆలోచించడానికి ఎప్పుడూ నిరాకరించిన ఒక అకాడమీతో ఆ ప్రయాణం ఇక్కడే ప్రారంభమైంది. పీవీ సింధుకు, దత్తాకి, పీవీ రమణకి, పి.విజయకి, ప్రతి కోచ్‌కు, ప్రతి ఆర్కిటెక్ట్‌కు, ఈ మహత్తర దార్శనికతను సాకారం చేయడానికి తోడ్పడిన ప్రతి భాగస్వామికి, తమ వంతు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.

కేవలం అకాడమీకీ కాదు.. దేశ భావి ఛాంపియన్లకు పునాది వేశాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మన పిల్లలకు, పెద్ద కలలు కనే అవకాశాన్ని కల్పించే, మెరుగైన శిక్షణ పొందే అవకాశాన్ని అందించే మరింత ధైర్యంగా పోటీపడే వేదికను కల్పించే, భారతదేశానికి గర్వకారణంగా నిలిచే ప్రతి కార్యక్రమానికి మేం ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని మీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం కేవలం ఒక క్రీడా అకాడమీకి శంకుస్థాపన చేయలేదు. భారతదేశ భావి ఛాంపియన్లకు బలమైన పునాదిని వేశాం. ఒక ఛాంపియన్ గొప్ప వారసత్వం అతని మెడలో వేలాడే పతకం కాదు, ఒక చిన్నారి హృదయంలో వెలిగించే కల అని మంత్రి లోకేష్ చెప్పారు.

Previous Post

విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

Next Post

ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026

కార్యకర్త
@ August 6, 2026
వైఫల్యాలను చూసి భయపడొద్దు
ఆంధ్రప్రదేశ్

వైఫల్యాలను చూసి భయపడొద్దు

చైతన్యరధం
@ August 6, 2026
ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ
ఆంధ్రప్రదేశ్

ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

చైతన్యరధం
@ August 6, 2026
విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

చైతన్యరధం
@ August 6, 2026
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వీఈఆర్ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వీఈఆర్ అభివృద్ధి

చైతన్యరధం
@ August 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026

కార్యకర్త
@ August 5, 2026
నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్
ఆంధ్రప్రదేశ్

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

చైతన్యరధం
@ August 5, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్

డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

చైతన్యరధం
@ August 5, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

చైతన్యరధం
@ August 2, 2026
కూటమి కలయికే.. అభివృద్ధి

కూటమి కలయికే.. అభివృద్ధి

చైతన్యరధం
@ August 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైఫల్యాలను చూసి భయపడొద్దు

వైఫల్యాలను చూసి భయపడొద్దు

చైతన్యరధం
@ August 6, 2026
ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

చైతన్యరధం
@ August 6, 2026
భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

చైతన్యరధం
@ August 6, 2026
విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

చైతన్యరధం
@ August 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist