- అతని ప్రేమ ఎడారిలో ఎండమావిలాంటిది
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం
- “హే రామ” అనడం.. దుష్టరాజకీయానికి నిదర్శనమని వ్యాఖ్య
మంగళగిరి (చైతన్య రథం): కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ గొడ్డలి పార్టీ నేత వైఎస్ జగన్‌రెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం పోయిన తర్వాత గంగవెర్రిలెత్తుతూ ఏదోరకంగా అధికారంలోకి రావాలని జగన్ ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. జన్మతః క్రైస్తవుడైన జగన్ “హే రామ్ రాష్ట్రాన్ని రక్షించు” అని వ్యాఖ్యానించడం ఆయన దుష్ట రాజకీయాలకు నిదర్శనమన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశ ద్రోహం కేసులో అరెస్టైన ప్రశ్న రావణ్‌కు వైఎస్ జగన్ మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని నిలదీశారు. సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల మాట్లాడుతూ.. “దళితులపట్ల జగన్ చూపిస్తున్న ప్రేమ.. తన పిల్లలను తానే తినే పాములాంటిది” అని తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ మాయ మాటలు నమ్మి విష కాటుకు గురి కావొద్దని హితవు పలికారు.
“స్వార్ధ రాజకీయాల కోసం కుల విద్వేషాలను రెచ్చగొట్టడం వైసీపీ నాయకుల ట్రేడ్ మార్క్‌గా మారింది. జగన్‌రెడ్డి కుట్రలను అమలు చేయడానికి దళితులను ఉపయోగించి వారిపై కేసులు పెట్టి జైలుకి పంపి దళితులను రాజకీయ పావులుగా జగన్ వాడుకుంటున్నాడు.
కోడికత్తి డ్రామాతో దళిత యువకుడు శ్రీనుని ఐదేళ్లుపాటు జైల్లోపెట్టి అతని జీవితాన్ని నాశనం చేశారు. 2024 ఎన్నికల్లో మాకొద్దు ఈ జగన్ అని తిరస్కరించిన దళిత జాతిని తిరిగి ఆకర్షించడం కోసం కులం, మతం, ప్రాంతాలను రెచ్చగొడుతూ అవినీతి డబ్బు వెదజల్లుతున్నారు. “దళిత వ్యతిరేకైన జగన్ వలలో దళిత సోదరులు పడొద్దు. జగన్ అవినీతి సొమ్ముకు ఆశపడి కొందరు కుహనా దళిత నాయకులు రాష్ట్రంలో సమావేశాలు పెట్టడం, మత ఘర్షణలు రెచ్చగొట్టడం సరైంది కాదు. జగన్ మొసలి కన్నీరు నమ్మొద్దు. అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎన్ని కుట్రలైన, హత్యలైన అవినీతి పనులుకైనా సిద్ధమని ఆయా వర్గాలను మభ్యపెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి జగన్ తెరలేపుతున్నారు. జగన్ అవినీతి సొమ్ముకు ఆశపడి కొందరు కుహనా దళిత నాయకులు రాష్ట్రంలో సమావేశాలు పెట్టడం, మత ఘర్షణలు రెచ్చగొట్టడం సరైంది కాదు. జగన్ ముసలి కన్నీరు నమ్మొద్దు. జగన్ చూపించే దళితులపట్ల ప్రేమ ఎడారిలో ఎండమావిలాంటిది. దళితుల ఎవరూ జగన్‌రెడ్డిని నమ్మొద్దు.
జగన్ మాయ మాట నమ్మి ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్న కొందరు రిటైర్డ్ ఉద్యోగులు, దళిత నాయకులు అతన్ని నమ్మి చరిత్రహీనులు కాకండి” అని వర్ల రామయ్య హితవు పలికారు. “అధికారం కోసమే జగన్మోహన్ రెడ్డికి దళితులు కావాలి. అధికారంలోకి రాగానే అంటరాని వారిగా దళితులను చూస్తారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎందుకు అండగా నిలుస్తున్నారు. డాక్టర్ సుధాకర్‌ను పిచ్చివాడిని చేసి ఎందుకు ఆత్మహత్య చేసుకునేలా చేశారు. జగన్ సొంత జిల్లాలో దళిత మహిళ నాగమ్మపై అత్యాచారం జరిగినా స్థానిక ఎమ్మెల్యేగా ఎందుకు పట్టించుకోలేదు. రాజమండ్రిలో 16ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడితే నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారు. గుంటూరులో రమ్య అనే అమ్మాయిని పట్టపగలే దారుణంగా హత్య చేసిన వారిపై చర్యలు ఏవి? దళిత జాతిపై అంత ప్రేమ ఉంటే వారికి రావాల్సిన 27 పథకాలను ఎందుకు రద్దు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి దళితులకు అన్యాయం చేసింది జగన్ కాదా? గొడ్డలి పార్టీ ఐదేళ్ల కాలంలో దళితులపై 56,981 దాడులు, 192 హత్యలు జరిగింది వాస్తవం కాదా జగన్?” అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
















