- -ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టరు ఆదేశం
ఆచంట(చైతన్యరథం):ఎప్పటి నుంచో తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామ ధేనువు లంకగ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని మాట్లాడిన వీడియో వైరల్ కాగా సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిన విషయం తెలిసిందే. సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం మీ భూమి-మీ హక్కు కార్యక్రమం లో పాల్గొనేందుకు సిద్దాంతంవెళ్లిన చంద్రబాబు.. కార్యక్రమం అనంతరం తన బస్సులోకి సత్య నారాయణను ప్రత్యేకంగా పిలి పించుకుని కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు. కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధ పడుతున్నాడని, అతనికి వైద్యసాయం అందించా లని సత్యనారాయణ కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని విన్నవించా రు. కుమారుడికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. సత్యనారాయణకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు.















