- భవిష్యత్ నగర నిర్మాణానికి అనుగుణంగా దృష్టి
- హైకోర్టు భవనాల వద్ద రూ.547 కోట్లతో
- మౌలిక సదుపాయాల కల్పనకు నిర్ణయం
- భవనాలు, అక్రమ నిర్మాణాల వివాదాల పరిష్కారానికి
- ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
- ఎకనామిక్ రీజియన్ ఆరఎఫ్‌పీకి అంగీకారం
- ఏపీసీఆర్డీఏకు సొంతంగా అగ్నిమాపక విభాగం
- అనువుగా లేని ప్లాట్లకు గ్రామకంఠంలో 5 సెంట్లు
- రాజధాని పరిధిలో పేదలకు గృహ సముదాయాలు
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన 61వ అథారిటీ సమావేశం
- 18 అంశాలపై చర్చించి ఆమోద ముద్ర
అమరావతి(చైతన్యరథం): రాజధానిలో భవిష్యత్ నగర నిర్మా ణానికి అనుగుణంగా అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. సీఆర్డీఏ ప్రతిపాదించిన 18 అంశాలపై అథారిటీ సమావేశంలో చర్చించి ఆమోదాన్ని తెలియ జేశారు. రూ.547.07 కోట్ల వ్యయంతో హైకోర్టు భవనాలకు సంబంధించిన వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. పీపీపీ ప్రాతిపదికన డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్సఫర్ విధానంలో అమరావతిలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేలా జెయింట్ అబ్జర్వేషన్ వీల్‌ను నిర్మించేం దుకు అథారిటీ అంగీకారం తెలిపింది. ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధి పోట్లు ఉంటే ప్లాట్లలో ఏటీఎంలు, కియోస్క్‌లు లాంటి వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఆమోదం ఇచ్చింది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానం లో కల్పించేందుకు అథారిటీ ఆమోదాన్ని తెలియజేûసింది. అలాగే నెగోషియబుల్ సెటిల్‌మెంట్ పాలసీలో భాగంగా అనువుగాలేని ప్లాట్లకు గ్రామకంఠంలో 5 సెంట్ల వరకూ కేటాయించేందుకు అథారిటీ అంగీకారాన్ని తెలిపింది. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు మార్గదర్శకాలకు అనుగుణంగా రాజధాని పరిధిలో దిగువ, మధ్యతరగతి ప్రజల నివాసానికి అనుగుణంగా గృహ సముదాయాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశా లు జారీ చేశారు. అమరావతి ప్రాంతంలో భవనాలు, అక్రమ నిర్మాణాల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు కు కూడా అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. వివాదాలను పరిష్క రించుకునేలా అమరావతిలో ఓ మీడియేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమరావతి రాజధానిలో ఫైర్ వింగ్ ఏర్పాటు చేసుకుని ఎనఓసీలను జారీ చేసేందుకు సొంత అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు కూడా అథారి టీ ఆమోదాన్ని తెలియచేసింది. రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సంబంధించి టాబ్రీడ్ ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదాన్ని తెలియ చేసింది. ఎల్పీఎస్ లేఆవుట్లలోని 495 మంది రైతుల కొత్త అలాట్మెంట్ కోడ్‌లు మారటంతో వారికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహా యింపునకు అథారిటీ అంగీకారం తెలియజేసింది.
అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు ఆరఎఫ్‌పీ
9 జిల్లాలకు విస్తరించిన అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపకల్పన కోసం ఆరఎఫ్‌పీ తయారు చేసేందుకు కూడా అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. ఏలూరు నుంచి ప్రకాశం వరకూ 9 జిల్లాల్లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేలా అథారిటీ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలోని అన్ని భవనాలు, కార్యాలయాలకు ఓ సెంట్రల్ కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. డక్ట్‌ల ద్వారా పైపుల నుంచి ఇళ్లు, కార్యాలయాలకు ఇది చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బల్క్ చిల్లింగ్ యంత్రాల తయారీ సంస్థలు ఏపీలో ఉన్నాయని వీటిని సమర్థంగా వినియో గించుకోవాలని దిశానిర్దేశం చేశారు. బ్లూ గ్రీన్ సిటీగా నిర్మితం అవుతున్న అమరావతిలో కొత్త సాంకేతిక వ్యవస్థలపై విస్తృతమైన అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మితమయ్యే ప్రతీ టౌన్‌షిప్‌లోనూ వర్క్‌ఫ్రమ్ హోమ్ సహా లివబుల్, కమర్షియల్ కార్యకలాపాల కేంద్రాలుగా ఉండాల ని సూచించారు. రాజధాని ప్రాంతంలో ఎకనమిక్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. అమరావ తిలో నిర్మించే ఆస్పత్రుల్లో రోగుల అటెండెంట్లకు కూడా వసతి ఉండేలా చూడాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో హోటళ్లు, కన్వెన్షన్ కేంద్రాలను వేగంగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి.నారా యణ, సీఎస్ జి.సాయిప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ, సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు














