- విధ్వంసానికి ఆ పార్టీకి ఏడు విభాగాలు
- సిగ్గు లేకుండా మెగా డీఎస్సీపైనా ఆరోపణలు
- కుట్రలను ప్రజలకు వివరించి ఎండగట్టాలి
- ప్రతి ఎన్నికల్లోనూ గెలవాలి.. ఎన్డీయే రావాలి
- 2029 ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలి
- మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లిస్తాం
- జెన్ జీ, జెన్ అల్పాకు అవకాశాలు కల్పిస్తాం
- వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకెళతాం
- సీఎం అంటే కామన్ మ్యాన్ అనేలా పాలన ఉండాలి
- పార్టీ కోసం ప్రాణాలొదిన కార్యకర్తలే నాకు స్ఫూర్తి
- మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
- ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన హైబ్రిడ్ మహానాడు
- రెండురోజుల్లో 24.5 లక్షల మంది హాజరు
- క్లస్టర్ల వారీగా డిజిటల్‌గా నిర్వహణతో సందడి
- ఆసాంతం ప్రతిబింబించిన కార్యకర్తే అధినేత
- జై కార్యకర్త.. జైజై కార్యకర్త నినాదంతో ముగిసిన పసుపు పండుగ
మంగళగిరి(చైతన్యరథం): జై కార్యకర్త… జైజై కార్యకర్త అంటూ మహానాడు వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నినదించారు. రెండు రోజుల మహానాడు ఆసాంతం కార్యకర్తే అధినేత అనే అంశాన్ని అడుగు అడుగునా ప్రతిబింబించేలా నడిచింది. మహానాడు రెండు రోజుల కార్యక్రమంలో జరిగిన ప్రసంగాల్లోనూ ఇదే ప్రతిఫలించిం ది. కార్యకర్తను మరిచిపోవద్దు అంటూ స్వయంగా చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం
చేశారు. క్యాడర్.. క్యాడర్.. క్యాడర్ ఇదే తారక మంత్రం కావాలని స్పష్టం చేశారు. గురువారం రెండోరోజు మహానాడు సందర్భంగా సీఎం చంద్రబాబు ముగింపు ఉప న్యాసం చేశారు. వివిధ కీలకాంశాలను ప్రస్తావించారు. వర్చువల్ మహానా డు విజయవంతమైంది.. అదరగొట్టింది. అత్యద్భుతంగా మహానా డు కార్యక్రమాన్ని నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,875 క్లస్టర్లతో పాటు 12 దేశాల నుంచి కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. ఈ రెండురోజుల మహానాడులో ఏకంగా 24.5 లక్షల మంది హాజరు కావటం ఓ రికార్డ్. రికార్డులు సృష్టించడం, వాటిని తిరగరాయడం టీడీపీకి మాత్రమే సాధ్యమని తెలిపారు.
కార్యకర్తలే శిరోధార్యం..వారికి పాదాభివందనం
కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని ఆచరిస్తూ ఈ మహానాడులో వారికి భాగస్వామ్యం కల్పించాం. ఆకాశమే హద్దుగా పార్టీలో కార్యకర్తలు ఎదిగేందుకు అవకాశాలు కల్పించాం. నేతలు, కార్యకర్తలను చూసి నేను కూడా పోటీపడే పరిస్థితి వచ్చింది. శాశ్వతంగా పార్టీని మోసింది. మోసేది, మోయ బోయేది కార్యకర్తలే. వారందరికీ పాదాభివందనం. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160కోట్ల మేర ఖర్చు చేశాం. నాపై కార్యకర్తలు, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నాను. టీడీపీ కుటుంబ సభ్యులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. కార్యకర్తల బిడ్డలకు విద్య, సాధికారత, నైపుణ్యం లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సోషల్ రీ ఇంజనీరింగ్ ద్వారా విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాం, బూత్ కమిటీలు, యూనిట్లు, క్లస్టర్ల వరకూ అందరికీ న్యాయం చేస్తున్నాం. ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్ మెంట్ మా లక్ష్యం. నీతి నిజాయితీగా కార్యకర్తలు ఆర్థికంగా ఎదిగేలా నేను బాధ్యత తీసుకుంటాను. ప్రజల కోసం పనిచేసే కార్యకర్తల కోసం నేతలు కూడా పనిచేయాలి. పార్టీ కోసం, జెండా కోసం నేతలు, కార్యకర్తలు తమ ఆస్తులు అమ్ముకున్నారు. మెడపై కత్తి పెట్టినా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ ప్రాణం వదిలిన కార్యకర్తలే నాకు శిరోధార్యమని స్పష్టం చేశారు.
రాష్ట్రం మీద గొడ్డలి వేటు పడకూడదు
“రాష్ట్రంలో గొడ్డలి పార్టీ నేరాలు ఘోరాలు చేస్తోంది. రాజకీయాల్లో ఇలాంటి వాటిని నేను ఎప్పుడూ ఊహించలేదు. బాబాయిని హత్య చేసి నాచేతికే మరక అంటించే ప్రయత్నం చేశారు. గొడ్డలి పార్టీకి అధికారం పోయింది.. ప్రతిపక్ష హోదా పోయింది.. అయినా అహంకారం మాత్రం పోలేదు. కుట్ర, కుతంత్రాలు మాత్రం మానటం లేదు. దేశంలొ ఏ రాజకీయ పార్టీకైనా యువత, రైతులు, మహిళలు ఇతర వర్గాలు విభాగాలుగా ఉంటాయి. కానీ గొడ్డలి పార్టీకి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, సోషల్ మీడియా సైకోల బ్యాచ్, ఫేక్ ప్రచారాల కోసం పేటీఎం బ్యాచ్. హత్యా రాజకీయాల కిరాయి హంతక బ్యాచ్, దేవాల యాలపై దాడి చేసే బ్యాచ్, కల్తీ లిక్కర్ బ్యాచ్ కూడా మరో విభాగంగా గొడ్డలి పార్టీకి ఉంది. ఇలా ఏడు విభాగాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేసేందుకు కుట్రలు పన్నుతోంది. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు అర్ధమయ్యే చెప్పడానికి ఎంత బాధ్యతగా తీసుకుంటారో.. గొడ్డలి పార్టీ కుట్రలను ఎండగట్టే విషయంలోనూ అంతే బాధ్యత తీసుకోవాలి. గొడ్డలి పార్టీ కుట్రలను ప్రజలకు వివ రించాలి.. వాళ్లు చేసే నష్టాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేయాలంటే పబ్లిక్ కనెక్టివిటీ అనేది ముఖ్యం. వాళ్ల తప్పులను ఎండగడుతున్న సందర్భంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ స్థాయి వాళ్లకైనా క్యారెక్టర్ ముఖ్యం. మరక అంటకూ డదు. ఎవరూ వేలెత్తి తప్పు పట్టని విధంగా నేతలు, కార్యకర్తలు పనిచేయాలి. ప్రజా జీవితంలో ఉండే వాళ్లకు ఓపిక అవసరం. స్థానిక ఎన్నికల్లో మనం అంతా కలిసి సత్తా చాటాలి. ప్రతి ఎన్నికల్లో గెలవాలి. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు, నేతలు, కార్యకర్తలతో సమన్వయంతోపాటు సఖ్యతతో మెలగాలి. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అనేదే నినాదమే మనది కావాలని పిలుపు ఇచ్చారు.
అప్పుడు పరదాల పాలన.. ఇప్పుడు ప్రజల మధ్య పాలన
“గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అన్ని వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి. అన్నింటినీ గాడిన పెట్టి పనిచేస్తున్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సంక్షేమం చేస్తూనే.. అభివృద్ధి పనులు పెద్దఎత్తున చేపడుతున్నాం.. పెట్టుబడులు తెస్తున్నాం. విభజన తర్వాత మనపై నమ్మకంతోనే రైతులు రాజధాని అమరావతి కోసం భూములిచ్చారు. గత పాలకులు ప్రజావేదికను కూల్చారు. పెట్టుబడులను తరిమేసి విధ్వంసం సృష్టించారు. వారు సృష్టించిన విధ్వంసం తో రాష్ట్రానికి పెట్టుబడి దారులు రావాలంటే భయ పడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ఏపీ బ్రాండ్ పునరుద్ధరించి విశ్వాసం కల్పించాం. అమరావతిని, పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంట్లను తిరిగి నిల బెట్టేందుకు కేంద్రం సహకారం అందించింది. వెంటిలేటర్‌పై ఉండే ఆర్థిక వ్యవస్థకు కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చాం. ఇదేమీ సులువుగా అయిపోలేదు. గత పాలకులు చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పు కారణంగా ఏపీ దివాలా తీసే పరిస్థితికి చేరు కుంది. వాటన్నింటినీ రీషెడ్యూల్ చేసి అప్పుల భారాన్ని తగ్గించు కునేందుకు ప్రయత్నిస్తున్నాం. రూ.12 వేల కోట్లతో మళ్లీ కేంద్ర పథకాలను పునరుద్ధరించాం. కుప్పకూలిన వ్యవస్థలన్నింటినీ సరిదిద్దాం. క్యాబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ సమావేశాలు, కలెక్టర్ల సదస్సులు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలతో పాటు పట్టాదా రు పాస్ పుస్తకాల కోసం క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో పరదాల పాలన జరిగితే ఇప్పుడు ప్రజల మధ్య పాలన చేస్తున్నాం. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథ కం అందిందా లేదా అని తనిఖీ చేస్తున్నాం. సీఎం అంటే కామన్ మ్యాన్ అనే విధానంలో మా పాలన కొనసాగుతోందని తెలిపారు.
సంపద సృష్టించి సంక్షేమం ఇవ్వటమే టీడీపీ లక్ష్యం
గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థ, ఆర్సెలార్ మిట్టల్ లాంటి సంస్థలు వచ్చాయంటే చాలా సంతోషం అనిపించింది. 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తేగలిగాం. ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేస్తున్నాం. సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ ఆశయాన్ని శిరోధార్యంగా భావించి అభివృద్ధి చేస్తున్నాం. ఆదాయం లేకుండా, అప్పులు చేసి సంక్షేమం చేయటం ఏమిటి? సంపద సృష్టించి సంక్షేమం ఇవ్వటమే టీడీపీ లక్ష్యం. మొదటి తేదీనే పెన్షన్, మహిళలకు స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం 2.0 లాంటి పథకాలను అందిస్తున్నాం. పేదల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతిఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే ఆశయం. అందరికీ ఉద్యోగం, ఉపాధి కల్పించేలా పెట్టుబడి దారుల్లో నమ్మకాన్ని కల్పిస్తున్నాం. దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఏపీకి 25 శాతం వచ్చాయి. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ ఇలా అన్నిటికీ తేదీలు నిర్దేశించి ఒప్పందాలు చేసుకుంటున్నాం. కేవలం 36 రోజుల్లోనే 5వ తరం ఫైటర్ జెట్ తయారీ, టెస్టింగ్ ప్రాజెక్టు ఏపీకి వచ్చిం దంటే రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉందన్నది తెలుస్తోంద వెల్లడించారు.
వారి కుట్రలు ఇక పనిచేయవు
“పోర్టులు, ఎయిర్‌పోర్టులు వంటి మౌలిక సదుపాయాలతో పాటు పరిశ్రమలకు తగిన మానవవనరులను కూడా తయారు చేసే లక్ష్యంతో ముందుకెళుతున్నాం. నైపుణ్యాల కల్పన కోసం దేశంతో పాటు అంతర్జాతీయంగా అత్యుత్తమ స్కిల్ డెవలప్మెం ట్ సంస్థలను ఏపీకి తీసుకువస్తున్నాం. ఏఐ, క్వాంటం లాంటి అంశాల్లోనూ మన యువతకు పెద్దఎత్తున స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. కోర్టుల్లో వేసిన కేసులను ఎదుర్కొని మెగా డీఎస్సీతో పాటు కానిస్టేబుళ్ల ఉద్యోగాలను కూడా ఇచ్చాం. అసాక్షి అనే అక్రమ పత్రిక ద్వారా మెగా డీఎస్సీపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు. వారు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఇక పని చేయ వు. యువతలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తే దుష్ప్రచారం చేసిన వారిని నడి రోడ్డున నిలబెడతాం. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరిరోజు అని హెచ్చరించారు.
అన్ని ప్రాజెక్టులూ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం
రాష్ట్రంలో నీటి భద్రత కోసం సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ విడుదల చేశాం. రూ.40 వేల కోట్ల వ్యయంతో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అన్ని ప్రాజెక్టులూ ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తాం. గోదావరి నుంచి కావేరి అనుసంధానం దిశగా ప్రయ త్నాలు చేస్తున్నాం. గోదావరి నుంచి నల్లమల సాగర్‌కు నీటిని తరలించాలని ఆలోచన చేస్తున్నాం. భూమినే జలాశయంగా చేసుకుని పెద్దఎత్తున నీటిని నిల్వ చేసుకునేలా ప్రణాళికలు చేశాం. ప్రస్తుత ఎండాకాలం లోనూ రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. ఎల్‌నినో కారణంగా ఈసారి వర్ష పాతం తగ్గే అవకాశం ఉన్నా.. సరైన నీటి నిర్వహణతో ఇబ్బందులు లేకుండా చేయాలని నిర్ణయించాం. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తాం. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఆ ప్రాంతంలోని పంటలకు నీరు ఇచ్చి సస్య శ్యామలం చేస్తాం. కోస్తా జిల్లాల్లో ఆక్వా సాగుకు రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను ఇచ్చేలా చర్యలు చేపట్టాం. మరో రెండు నెలల్లో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేస్తుంది. గుంతలు లేని రోడ్లుగా రాష్ట్ర రహదారుల ను తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి దానిని నిలబెట్టుకున్నాం. విద్యుత్ కొనుగోలులో 38 పైసల మేర తగ్గించాం. రూ.4,462కోట్లు విద్యుత్ భారం ప్రజలపై లేకుండా ట్రూడౌన్ చేశాం. భవిష్యత్తులో రూ.1.20 మేర విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతిఒక్కరూ ఇంటి పై సోలార్ రూఫ్గాప్ ఏర్పాటు చేయండి. ఏపీలో తయారయ్యే ఉత్పత్తులు పూర్తి నాణ్యతతో తయారవ్వాలన్నదే మా లక్ష్యం. డ్వాక్రా ఉత్పత్తులకు స్వయం బ్రాండ్ కల్పించాం. చెత్త పన్ను రద్దు చేసి గత పాలకులు వదిలి వెళ్లిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించాం. అన్ని పౌరసేవ లనూ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించేలా చర్యలు చేపట్టాం. ధృవపత్రాలు కూడా దాని ద్వారానే అందు బాటులో ఉంచేలా చేశామని చెప్పారు.
టెక్నాలజీకి ఆధ్యాత్మికత తోడైతే ఆనందాంధ్రప్రదేశ్
మహిళా మహానాడు ఇది. వారికి అంకితం చేస్తూ దీనిని నిర్వహించుకున్నాం. దేశంలోనే మొదటిసారి మహిళలకు రాజకీ య రిజర్వేషన్ కల్పించే పార్టీగా టీడీపీ నిలిచింది. నేషనల్ వర్కింగ్ ప్రెసిండెంట్ లోకేష్ ప్రతిపాదించినట్టుగా తెలుగుదేశం పార్టీలో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తాం. ఏ ఆలోచన చేసినా, పాలసీ చేసినా యువత భవిష్యత్తు కోసమే. గతంలో ఐటీ ఇప్పుడు ఏఐ, క్వాంటం అల్గారిథమ్స్ లాంటి అంశాలను యువత కోసమే తెచ్చాం. మహిళల కోసం, యువత కోసం, బీసీ వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. టీడీపీకి అండగా ఉన్న బీసీలకు పార్టీ రుణపడి ఉంటుంది. ఆ వర్గాలను ఆర్థికంగా ముందుకు తేవటమే లక్ష్యంగా పనిచేస్తు న్నాం. రాష్ట్రంలో టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత కూడా అవసర మే. ప్రశాంతతకూ, మానసిక ఆనందానికి కేంద్రాలుగా ఆధ్యాత్మిక ప్రదేశాలను తీర్చిదిద్దుతాం. టెక్నాలజీకి ఆధ్యాత్మికత తోడైతే ఆనం దాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ప్రభుత్వం అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపింది. ఎన్డీయే ప్రభుత్వం చేసిన పనులను క్యాడర్ ప్రజల ఇళ్లకు వెళ్లి వివరించాలి. ప్రజల అవసరాలు గుర్తించి సాయం చేయాలి. అర్హులకు పథకాలు అందేలా చూడాలి. అధికారులతో కలిసి నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించా రు. మహానాడును గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.















