- విడదల రజినీ నీతులు చెప్పడం ఆపు
- ఒక్క అవకాశమని పేదవాడి గొంతు కోశారు
- అందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు
- అన్న క్యాంటీన్ల మూసివేత.. పేదలపై గొడ్డలిపోటే
- సొంత కుటుంబసభ్యులనూ బజారుకీడ్చారు
- “కిల్లింగ్ మైండ్ సెట్”జగన్ రెడ్డిది
- మీరు చేసింది పాలన కాదు.. అరాచకం
- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రంలో గత ఐదేళ్ల పాటు సాగిన వైసీపీ అరాచక పాలన, రౌడీయిజం, గొడ్డలి సంస్కృతిని ప్రజలు అసహ్యించుకున్నారు.. అందుకే ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ససీర్ అహ్మద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి విడదల రజనీ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు.. అది ఒక సైకోల ముఠా అని మండిపడ్డారు. జగన్రెడ్డి అధికార దాహం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి సొంత బాబాయ్ వివేకా హత్యే అతిపెద్ద నిదర్శనం, రాజకీయంగా అడ్డు వస్తున్నాడని బాబాయ్్న గొడ్డలితో సరికి చంపిన చరిత్ర జగన్ రెడ్డిది. ఈ విషయాన్ని మనం చెప్పడం లేదు. ఆయన సొంత చెల్లెలు షర్మిల గారే బహిరంగంగా చెప్పారు. అక్రమ ఆస్తుల రక్షణ కోసం, కడపలో పెద్ద దస్తగిరిని నరికి చంపించిన రక్త చరిత్ర జగన్. ఇలాంటి చరిత్ర కలిగిన పార్టీని ‘గొడ్డలి పార్టీ’ అనకుండా మరేమనాలి?” అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వరుస హత్యలు గొడ్డలి పార్టీకి నిదర్శనమని తెలిపారు.
గొడ్డలి పార్టీ అని షర్మిళ అన్నది నిజం
రాజకీయ అడ్డు తొలగించుకోవడానికి వివేకానందరెడ్డిని నరికి నరికి చంపినది గొడ్డలి పార్టీ అని వైఎస్ షర్మిళ అన్నది నిజం. అక్రమ ఆస్తుల కోసం కడపలో పెద్ద దస్తగిరిని నరికి చంపించి నందుకు గొడ్డలి పార్టీ అంటారు. మంగంపేట: బైరటీస్ గని కబ్జా కోసం బీసీ వర్గానికి చెందిన బైరటీస్ పారిశ్రామికవేత్తను హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ అంటారు. పల్నాడులో తోట చంద్రయ్య ను నడి రోడ్డుపై గొంతు కోసి చంపినందుకు గొడ్డలి పార్టీ అంటా రు. ప్రొద్దుటూరులో చేనేత నాయకుడు నందం సుబ్బయ్యను హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ.. పరిటాల రవిని కాల్చి చంపినం దుకు గొడ్డలి
పార్టీ… దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినందుకు గొడ్డలి పార్టీ.. మాస్కు అడిగినందుకు సుధాకర్ను వేధించి అతడి ప్రాణాలు పోగొట్టినందుకు గొడ్డలి పార్టీ.. అక్కను వేధించవద్దన్నందుకు అమరనాథ్ గౌడ్ అనే బాలుడి ని
నిలువునా తగులబెట్టి చంపినందుకు గొడ్డలి పార్టీ.. మద్యం రేట్లు పెంపుని ప్రశ్నించినందుకు పుంగనూరులో ఓం ప్రతాప్ శవమైనందుకు గొడ్డలి పార్టీ… పల్నాడులో జాలయ్య యాదవు చంపినందుకు గొడ్డలి పార్టీ.. కావలిలో కరుణాకర్ చేపల చెరువు ను కబ్జా చేసి అతడి చావుకు కారణమైనందుకు గొడ్డలి పార్టీ..
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు సామూహిక ఆత్మహత్యకు కారణమైనందుకు గొడ్డలి పార్టీ.. గిరిజన మహిళ మంత్రూబాయిని ట్రాక్టర్తో తొక్కించి చంపినందుకు గొడ్డలి పార్టీ.. నిందలు మోపి నరకం చూపించి కోడెల శివప్రసాద్ ప్రాణాలు పోగొట్టినందుకు గొడ్డలి పార్టీ.. పులివెందులలో నాగమ్మపై అత్యాచారం చేసి ఆమె ప్రాణాలు తీసినందుకు గొడ్డలి పార్టీ.. స్వాతంత్య్ర దినోత్సవం నాడే గుంటూ రులో రమ్యను హత్య చేసినందుకు. గొడ్డలి పార్టీ.. పలమనేరులో మిస్బా అనేక బాలిక ప్రాణాలు పోగొట్టినందుకు గొడ్డలి పార్టీ.. పరిటాల రవి, వివేకా హత్య కేసుల్లో పది మందికి పైగా సాక్షులు ప్రాణాలు పోయినందుకు గొడ్డలి పార్టీ అంటారని ధ్వజమెత్తారు. రప్పా రప్పా అంటూ నిత్యం పేట్రేగిపోతున్నందుకు ఈ నేరపూరిత కేకలను సమర్థిస్తున్నందుకు జగన్ పార్టీని గొడ్డలి పార్టీ కాక మరే మవుతుంది విడదల రజనీ? ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇంకా వందలాది హత్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
పేదవాడి పొట్టపై గొడ్డలి వేటు కాదా?
పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను అధికారంలోకి రాగానే మూసివేయడం పేదవాడి పొట్టపై గొడ్డలితో నరకడం కాదా? అని ప్రశ్నించారు. ఆకలితో ఉన్న పేదవాడి పట్టెడన్నం లాక్కున్న జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం అని విమర్శించారు. ఎన్నికల సమయం లో రూ.3000 పెన్షన్ ఇస్తానని నమ్మబలికిన జగన్రెడ్డి, అధికా రంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు రూ.250 చొప్పున పెంచుకుంటూ పోయి వృద్ధులను మోసం చేశారు. ఒకేసారి ఇస్తానని చెప్పి కాల యాపన చేయడం ద్వారా వృద్ధుల, పేదల నమ్మకాన్ని గొడ్డలితో నరికేసినందుకు వైసీపీని గొడ్డలి పార్టీ అనక ఇంకేమనాలి? మైనా రిటీ పిల్లల విద్యకు భరోసా ఇవ్వాల్సింది పోయి, పథకాలను నిలిపి వేసి. వారిని చదువుకు దూరం చేసి రోడ్డు మీద పడేసిన ఘనత వైసీపీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ను చిదిమేయడం కూడా. ఒక రకమైన ‘గొడ్డలి’ పోటేనని విమ ర్శించారు. ప్రతిపక్షాలను వేధించడమే కాకుండా తనతో పాటు. నడిచిన సొంత పార్టీ నాయకులను, అధికారులను కూడా చిత్ర హింసలు పెట్టిన సంస్కృతి జగన్రెడ్డిదని గుర్తుచేశారు. కుటుంబ సభ్యులను సైతం రోడ్డు మీదకు ఈడ్చిన “కిల్లింగ్ మైండ్ సెట్” జగన్రెడ్డి సొంతమని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రతి అడుగులోనూ సామాన్యుడిని ఇబ్బంది పెట్టిన వైసీపీకి ప్రజలు 11 సీట్లతో సరైన తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా విడదల రజినీ వంటి నాయకులు ఆత్మవిమర్శ చేసుకో వాలని హితవుపలికారు. మీరు చేసింది పాలన కాదు… అరాచక మని స్పష్టం చేశారు.

















