- మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద సీఐడీ వాపసు తీసుకుంది
- నైతిక విలువలు ఉంటే జగన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రాన్ని గతంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు ముఖ్యమంత్రులుగా పరిపాలించారు.. ప్రజలకు సేవ చేయడంలో, రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వాలు పోటీ పడ్డారు..అయితే 2019లో జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కక్ష, కార్పణ్యం, ద్వేషం, అరాచకం, అప్రజాస్వామిక చర్యలు, రాజ్యాంగ విరుద్ధ పాలన, అవినీతి చోటు చేసుకున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వీటన్నిం టికీ మించి ఫ్యాక్షనిజం రాజకీయాల్లోకి ప్రవేశించిందని తెలిపారు. ఈ కక్షపూ రిత రాజకీయాల్లో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయ కుడు చంద్రబాబుపై స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో తప్పుడు కేసు నమోదు చేసి 53 రోజులు జుడిషియల్ కస్టడీకి పంపి కక్ష సాధించారు. సీమన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విడుదల చేసిన నిధులు చంద్రబాబుకు, ఆయన కుటుంబసభ్యులకు, ఆయనకు సంబంధిం చిన ఖాతాలకు వెళ్లలేదని ఆయన ఎన్నిసార్లు స్పష్టం చేసినా జగ న్‌రెడ్డి వినకుండా రాజకీయ ప్రత్యర్థిని శత్రువుగా భావించి ఏదైనా సరే అరెస్ట్ చేయాలన్న దురుద్దేశంతో జైలులో పెట్టారని ధ్వజమెత్తారు.
మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్
సీఐడీ దర్యాప్తులో డిజైన్‌టెక్‌కు చెల్లించిన నిధులు ఏ ప్రజాసేవ కుడికి, చంద్రబాబుకు, ఇతర నిందితులకు వెళ్లలేదని..ప్రతి రూపా యి అకౌంటెడ్ అని స్పష్టంగా తేల్చింది. అందువల్ల ఈ కేసును “మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట” కింద కేసు వాపస్ తీసుకున్నారు. అదే విధంగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఈ కేసులో చంద్రబాబుకు ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితంలో 53 విలువైన రోజుల కాలాన్ని జగన్‌రెడ్డి తన కక్ష సాధింపుల కోసం దుర్వినియోగం చేశారు. జైల్లో కనీస సౌకర్యాల కోసం కూడా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పించి కక్ష రాజకీయాలకు దారితీశారు. చంద్రబాబు జైలులో ఉన్న 53 రోజుల్లో ఆయన రాష్ట్రానికి చేసిన సేవను రాష్ట్ర ప్రజలందరూ గుర్తుచేసుకున్నారని వ్యాఖ్యానించారు.
నిజాయితీపరుడిపై కక్ష
ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు చూశారు. శాసనసభలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రజలే 11 సీట్లతో తీర్పునిచ్చారు. తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు జీవితంలో 53 రోజులు దొంగిలించడం నేరం. అరెస్టు సమయం లో నిజాయితీపరుడైన నాయకుడిని ఎందుకు జైలులో పెట్టారని ప్రపంచవ్యాప్తంగా అరెస్టుకు వ్యతిరేకంగా 108 దేశాల్లో నిరసనలు చేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ sడ్డికి నైతిక విలువలు ఉంటే చంద్రబాబు, ఆయన కుటుంబం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.















