చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పాస్టర్లకు రూ.51 కోట్ల గౌరవ వేతనం..

విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Dec 23, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పాస్టర్లకు రూ.51 కోట్ల గౌరవ వేతనం..
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏసు సందేశమే ప్రపంచానికి స్ఫూర్తి
  • ప్రేమ, శాంతి, సేవా బోధనలు సదా ఆచరణీయం
  • క్రైస్తవుల భద్రతకు, గౌరవానికి భంగం కలుగనివ్వం
  • ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం
  • ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం
  • విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం చంద్రబాబు

విజయవాడ (చైతన్యరథం): క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్బోధించారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించింది తమ ప్రభుత్వమేనన్నారు. విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. క్రిస్మస్‌ కేట్‌ కట్‌ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఏసు ప్రభువు ఈ లోకంలో జన్మించిన రోజును మనం క్రిస్మస్‌గా జరుపుకుంటాం. ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్‌. మేరీ మాత కడుపున ఏసు ప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు మన అందరికీ పండుగైంది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన ఏసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకం. క్రీస్తు బోధనల్ని, ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలి. పశువుల పాకలో పుట్టి…గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజా రక్షకుడు ఏసు. నమ్మిన సిద్ధాంతం కోసం బలి దానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పదనం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలి. ప్రభువు తాగ్యాన్ని స్మరించుకోవాలి. శాంతి మార్గాన్ని అనుసరించాలి. ప్రేమ తత్వాన్ని పెంచాలి. ఈర్ష్య, ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్‌ చెబుతోందని ముఖ్యమంత్రి అన్నారు.
ఒక్కో ఇటుకా పేరుస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం
ఐదేళ్ల వైసీపీ అసమర్థ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. నేను ఎంత లోతుకు పోతే అన్ని ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి. ఇలాంటి విధ్వంసం నా జీవితంలో చూడలేదు. అన్నింటినీ అధిగమిస్తూ ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. మనో సంకల్పంతో లక్ష్యాన్ని సాధిస్తున్నాం. 18 నెలల్లో రాష్ట్రం తిరిగి నిలదొక్కుకునే పరిస్థితికి తీసుకొచ్చాం. ఇచ్చిన హామీ మేరకు సూపర్‌ సిక్స్‌ విజయవంతంగా అమలు చేశాం. క్రైస్తవుల్లో పేద కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ ఆర్థిక భరోసా కల్పించాం. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు పథకం, పోస్ట్‌-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, పాస్టర్లకు గౌరవ వేతనాలు .. ఇలా అన్ని విధాలా క్రిస్టియన్‌ మైనారిటీలను ఆదుకుంటున్నాం. ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం కోసం రూ.22 కోట్లు ఖర్చు చేసి, 44,812 మంది క్రైస్తవ సోదర సోదరీమణులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నాం. ఇందు కోసం మే 2024 నుంచి నవంబర్‌ 2024 వరకు…మొత్తం రూ.30 కోట్లు విడుదల చేశాం. డిసెంబర్‌ 2024 నుంచి నవంబర్‌ 2025 వరకు రూ.51 కోట్ల మొత్తాన్ని ఈ నెల 24వ తేదీ లోగా వారి ఖాతాల్లో వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
క్రైస్తవులకు ఆర్థిక చేయూత
క్రైస్తవుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉపాధి, ఆర్థిక సాధికారత విషయంలో అండగా ఉంటాం. భద్రతకు, గౌరవానికి భంగం కలగనివ్వం. వారి కోసం ఉపాధి పథకాలను పునః ప్రారంభించాం. 2025`26లో రూ.20 కోట్లు కేటాయించి, 2,000 మంది లబ్ధిదారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. సీఈడీఎం ఆధునీకరణకు రూ.5 కోట్లు కేటాయించాం, రూ.6 కోట్ల పెండిరగ్‌ బకాయిలను కూడా క్లియర్‌ చేస్తున్నాం. గ్రూప్‌-1, గ్రూప్‌-2, డీఎస్సీ, టెట్‌, నీట్‌, యూపీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నాం. మెగా డీఎస్సీ నిర్వహించాం. కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ చేశాం. డీఎస్సీలో 26 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి శిక్షణ ఇస్తే 500 మందికి పైగా ఎంపికయ్యారు. భవిష్యత్‌లో మరింత మంది శిక్షణ అందిస్తాం. అలాగే 2014 నుంచి 2018 మధ్య 977 చర్చిలకు రూ.70 కోట్లు మంజూరు చేశాం. వీటిలో 377 చర్చ్‌ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మన హయాంలో గుంటూరులో క్రిస్టియన్‌ భవన నిర్మాణం కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశాం. మరిన్ని నిధులు విడుదల చేసి ఈ ఏడాది క్రిస్టియన్‌ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. జెరూసలేం యాత్రకు వెళ్లే క్రైస్తవ సోదర, సోదరీమణులకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం. వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్న వారికి రూ.60,000, రూ.3 లక్షలకు పైగా ఉన్న వారికి రూ.30,000 ఇస్తున్నాం. దీని కోసం ఈ ఏడాది రూ.1.50 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి తెలిపారు.
సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి క్రైస్తవ మిషనరీలు
సమాజ సేవలో క్రైస్తవ సంస్థలు ముందున్నాయి. క్రిస్టియన్‌ పాఠశాలలు, కాలేజ్‌లు, ఆసుపత్రులు దశాబ్దాలుగా చేస్తున్న సేవలు వెలకట్ట లేనివి. లక్షల మంది జీవితాల్లో మార్పు తెస్తున్నాయి. మిషనరీ పాఠశాలల్లో చదివి ఎంతోమంది ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్లారు. క్రమశిక్షణ, సేవ, విజ్ఞానానికి మిషనరీ విద్యా సంస్థలు కేంద్రంగా ఉన్నాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్‌ కాలేజీ, విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీ వంటి క్రిస్టియన్‌ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నతికి సేవ చేశాయి. ఎన్టీఆర్‌ కూడా మిషనరీ కాలేజ్‌ లోనే చదువుకున్నారు. పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026

అండగా నిలబడతాం

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 22-12-2025

Next Post

రాష్ట్రంలో పర్యాటకుల భద్రతకు..టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్‌ పాలసీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026

కార్యకర్త
@ June 10, 2026
అండగా నిలబడతాం
ఆంధ్రప్రదేశ్

అండగా నిలబడతాం

చైతన్యరధం
@ June 10, 2026
స్టీల్ ప్లాంట్ ప్రమాదం..
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

చైతన్యరధం
@ June 10, 2026
ఆన్లైన్ లో  ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్
ఆంధ్రప్రదేశ్

ఆన్లైన్ లో ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

చైతన్యరధం
@ June 10, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 10, 2026
ప్రాజెక్టులతో ‘ఆర్థిక’ పరుగులు
ఆంధ్రప్రదేశ్

ప్రాజెక్టులతో ‘ఆర్థిక’ పరుగులు

చైతన్యరధం
@ June 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-06-2026

కార్యకర్త
@ June 9, 2026
ఆంధ్రప్రదేశ్

విశాఖ ఉక్కు ప్రమాదం రాష్ట్రానికి షాక్

చైతన్యరధం
@ June 9, 2026
Load More

ముఖ్య వార్తలు

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
2027 నాటికి భూ రికార్డులు క్లీన్

2027 నాటికి భూ రికార్డులు క్లీన్

చైతన్యరధం
@ June 9, 2026
ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

చైతన్యరధం
@ June 7, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అండగా నిలబడతాం

అండగా నిలబడతాం

చైతన్యరధం
@ June 10, 2026
స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

చైతన్యరధం
@ June 10, 2026
ఆన్లైన్ లో  ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

ఆన్లైన్ లో ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

చైతన్యరధం
@ June 10, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist