- తెలుగు జాతీ గుండెచప్పుడు తారకరాముడు
- మండల, పంచాయతీ కేంద్రాల్లోనూ విగ్రహాలు
- బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత
సోమందేపల్లి (చైతన్యరథం): ఎన్టీఆర్ తోనే బడుగులకు రాజ్యాది, కారం వచ్చిందని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లి మండల కేంద్రంలో హిందూపురం ఎమ్మె ల్యే నందమూరి బాలకృష్ణ చేతులమీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు. అంతకుముందు సోమందేపల్లెలోని కొత్తపల్లి క్రాస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు పెద్దఎత్తున నాయకులు కార్యక ర్తలతో ర్యాలీగా వచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్టీఆర్ తోనే బడుగులకు రాజ్యాధి కారం ఏర్పడిందని ఎన్టీఆర్ పేరే ఒక ప్రపంచం.. ఆ పేరే ఒక చరిత్ర అన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ చిరస్థా యిలో ఉంటారని, తెలుగోడి ఆత్మగౌరవాన్ని నినాదంతో ఆనాటి ఢిల్లీ పెద్దలను గడగడలాడించారని గుర్తుచేశారు. నియోజకవర్గం లో ప్రతి మండల పంచాయతీ కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు నెలకొల్పనున్నట్లు తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కలుగలేదన్నారు. అటువంటి సమయంలో అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి వారిని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారన్నారు. సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఎన్టీఆర్ అవకాశమిచ్చారు.
పూల వ్యాపారం చేసుకునే తన తండ్రి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. బడుగుల బాంధవుడైన అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రావడం తన జన్మ ధన్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. విగ్రహాలను నియోజకవర్గ వ్యాప్తంగా మండల, పంచాయతీ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న ట్లు వెల్లడించారు. తండ్రికి తగ్గ తనయుడుగా బాలయ్య సినిమా రాజకీయ రంగంలో సింహంలా గర్జిస్తున్నారని, సమాజ సేవలోను బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారన్నారు. బసవతారకం ట్రస్ట్ చైర్మన్ గా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆపద్బాంధవుడుగా నిలిచారన్నారు. బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడం నా జన్మ ధన్యమైందని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి, ఎంపీ బీకే పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే వల్లె సింధూరరెడ్డి, ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, కూటమి నాయకులు కార్యకర్తలు, బాలయ్య అభిమానులు పాల్గొన్నారు.














