- ఈనాడు.. ఒక యూనివర్సిటీ
- పత్రికే ప్రతిపక్షంగా ప్రజావాణిని వినిపించారు
- 40 ఏళ్ల పరిచయంలో ఏనాడూ చిన్న ఫేవర్ అడగలేదు
- తెలుగుభాషకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం
- రామోజీ స్ఫూర్తితో తెలుగు భాషను సంరక్షిస్తా
- రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదానంలో సీఎం చంద్రబాబు
హైదరాబాద్ (చైతన్య రథం): తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు స్ఫూర్తితో తెలుగు భాషను సంరక్షిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. రామోజీ మన మధ్య లేకున్నా.. ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయన్నారు. రామోజీ జయంతి సందర్భంగా అక్షరయోధుడికి ఘన నివాళి అర్పిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్ లెన్స్ జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “రామోజీ ఎక్స్లన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తోన్న కుటుంబ సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఎక్స్ల్సన్స్కి ప్రతిరూపం రామోజీరావు. సాధారణమైన వ్యక్తి అసాధారణ శక్తిగా ఎదిగారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన దేన్నయినా వదులుకున్నారు. రామోజీతో నాది 40 ఏళ్ల అనుబంధం. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన జీవితంలో ఏ వ్యక్తినీ చిన్న ఫేవర్ అడగిన సందర్భం లేదు. జనహితం కోసం ఏ పార్టీ నాయకులతోనైనా నిర్మొహమాటంగా మాట్లాడేవారు. నిఖార్సయిన జర్నలిజంతో తెలుగుభాషకు ఆయన చేసిన చేవలు చిరస్మరణీయం. ఎక్కడ అవినీతి, అన్యాయం జరిగినా తన కలంతో ప్రజలపక్షాన బలంగా పోరాడారు. ప్రతిపక్షాలు లేనప్పుడు ప్రజల తరపున పనిచేసిన ఏకైక వ్యక్తి రామోజీరావు. ప్రతిపక్షం బలహీనంగావుంటే తానే అపోజిషన్గా పనిచేస్తానని చెబుతుండేవారు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఉన్నత విలువలకు నిదర్శనం ఈనాడు
“ఐదు దశాబ్దాలుగా విశేష ప్రజాదరణతో ఈనాడు నడుస్తోందంటే సాధారణ విషయం కాదు. ఈనాడును ఉన్నతమైన విలువలతో రామోజీరావు స్థాపించారు. సాధారణ వ్యక్తులకు మెరుగైన శిక్షణనిచ్చి జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు. మిగిలిన పత్రికల్లో పనిచేసే సిబ్బందికీ.. ఈనాడులో చేసేవారికి తేడా ఉంటుంది. రామోజీలాంటి వారు -పదిమందివుంటే సమాజాన్ని మార్చడం సాధ్యమే. -ఎంత ఒత్తిడి వచ్చినా విలువల విషయంలో రాజీ -పడలేదు. ప్రజాహితం కోసం ప్రభుత్వాలతో పోరాడి -మనుగడ సాధించారు. ఆయన నెలకొల్పిన -జర్నలిజం స్కూల్లో చదువుకున్న వారు దేశవ్యాప్తంగా -అనేక పత్రికల్లో రాణించారు. 50 ఏళ్ల తర్వాత -ఏంచేయాలో ఆయన ఇవాళే ఆలోచిస్తారు. ఆయన దూరదృష్టికి నిదర్శనం రామోజీ ఫిల్మ్ సిటీ. 2 వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీని అత్యద్భుతంగా నిర్మించడం
“గొప్ప విషయం” అని సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు.
తెలుగుభాషకు రామోజీవి ఎనలేని సేవలు
“తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు ఎంతో సేవ చేశారు. కొత్త ఇంగ్లీషు పదాలకు ప్రత్యామ్నాయంగా ఆయన ఎన్నో తెలుగు పదాలను ఆసృష్టించారు. రామోజీ స్ఫూర్తితో తెలుగు భాషను పరిరక్షించేందుకు నా వంతు కృషి చేస్తాను. #జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సేవారంగం, కళలు, సంస్కృతి, యువ ఐకాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా సాధికారతలో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు రామోజీ ఎక్స్టెన్స్ అవార్డులు ఇవ్వడం స్పూర్తిదాయకం. ఈ రామోజీ అవార్డు భవిష్యత్తులో ఇజ్ఞానపీఠ్, పులిట్జర్ స్థాయికి చేరుకుంటుంది” అని సేఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, మాజి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.














