- యుఎస్-ఇండియా పార్టనర్ షిప్ సమ్మిట్‌లో ఒప్పందం
- మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పంద పత్రాల మార్పిడి
న్యూఢల్లీి (చైతన్యరథం): అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ గ్లోబల్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) ఆంధ్రప్రదేశ్ లో రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. న్యూఢల్లీిలో బుధవారం జరిగిన యుఎస్ ` ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో మంత్రి లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ కొనసాగుతుండగానే టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్ సంస్థ ఏపీలో రూ.15వేలకోట్లు పెట్టుబడి పెట్టనుందని సంధానకర్తగా వ్యవహరిస్తున్న ఎడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ ప్రకటించారు. వెనువెంటనే టీజిహెచ్ చైర్మన్ చైర్మన్ అండ్ సీఈఓ సంజీవ్ అహూజా మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలను ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో పంచుకున్నారు.















