- కూకటి వేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత ప్రజలదే
- ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేశాడు
- అభివృద్ధికి బాటలేస్తున్న కూటమికి అడ్డుతగులుతున్నాడు
- జగన్‌ను నమ్మినవాళ్లంతా భయంతో బయటపడుతున్నారు
- ప్రమాదకర వైసీపీకి మళ్లీ బుద్ధిచెప్పాలి
- పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పిలుపు
మంగళగిరి (చైతన్య రథం): అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, నేర చరిత్ర కలిగిన మాఫియా లీడర్ జగన్మోహన్‌రెడ్డి సీఎంగా రాష్ట్రాన్ని అన్నివిధాలా సర్వనాశనం చేశాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నక్కా అనంద్ బాబు మండిపడ్డారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘‘వైసీపీ హయాంలో జగన్‌ను నమ్మి పని చేసినవాళ్లు నేడు భయపడిపోతున్నారు. జగన్‌రెడ్డి తన రాజకీయ అధికార దోపిడి దాహానికి ఎవరినైనా బలిస్తాడు. అందులో తర తమ భేదాలేమీ లేవు. రక్త సంబంధం లేదు, స్నేహితులు, బంధువులు లేదు. వైఎస్‌ఆర్ అధికారంలో ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. చట్టాన్ని ఉల్లంఘించటం, అధికారులూ ఉల్లంఘించేలా చేయడం, మానసిక ఆనందం పొందటం జగన్ నైజం. జగన్ చేష్టలకు అరడజనుపైన ఐఏఎస్‌లు జైళ్లకెళ్లారు.
ఇది యదార్థం. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు జైళ్లకెళ్లారు. నేరమనస్తత్వం ఉన్న జగన్.. తన చుట్టూ ఉన్నవాళ్ళతోనూ నేరాలే చేయిస్తాడు. వాళ్లకి అలవాటు లేకపోయినా.. అలవాటుచేసి నేరాల్లో భాగస్వాములు చేసి బలిచేస్తాడు. గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్‌లోనే అక్రమాలు, అరాచకాలు సాగాయి. సాక్షాత్తు ఆరోజు ఉన్నటువంటి అధికారులందరూ కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు కీలక పాత్ర పోషించిన అధికారులంతా ఒక్కొక్కరూ బయటికి వచ్చి కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కొండల బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. మొత్తం జగన్ చెబితేనే చేశామంటున్నారు. దక్షిణ కొరియాలో కిమ్ ఉన్నాడు. అతని నియంతకు మించిన అరాచకం జగన్‌ది. వైసీపీ అధికారంలో జగన్ చెప్పిందే చట్టం. చంద్రబాబుని అక్రమంగా నంద్యాల నడిరోడ్డు మీద తెల్లవారుజామును అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైలుకి పంపించి పైశాచిక ఆనందం పొందాడు. ఆ అజెండాను మోసిన వారందరూ ఈరోజు పశ్చాత్తాప పడుతున్నారు’’ అని ఆనంద్‌బాబు దుయ్యబట్టారు.
‘‘టిటీడి మాజీ ఈఓ ధర్మారెడ్డి.. హైకమాండ్ నిర్ణయాల మేరకే టెండర్ల సవరణలు చేశామని చెప్పారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సైతం.. హైకమాండ్ ఆదేశాల ప్రకారమే అడిషనల్ డిజీ ఏబి వెంకటేశ్వరావు, ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌లమీద యాక్షన్ తీసుకునే ఫైల్‌మీద సంతకాలు పెట్టానన్నారు. ఆ పొరపాటును క్షమించమని అడుగుతూ వీడియో విడుదల చేశాడు. జగన్ హయాంలో సీఎం పేషీలో పనిచేసిన పీఏలు, ఓఎస్డీలు లిక్కర్ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు.. వాళ్లూ అదే చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను నీచంగా విమర్శించి.. ఈరోజు చట్టానికి దొరికిన ప్రతి ఒక్కరూ పై ఆదేశాలమేరకే చేశామని అంటున్నారు. వర్రా రవీంద్రరెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి, రాజధాని ప్రాంతాన్ని రాజధాని రైతుల్ని అసభ్యంగా అభివర్ణిస్తూ.. సాక్షి మీడియాలో డిబేట్‌లో మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణంరాజు సైతం వైసీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడానని చెప్పారు. ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా? జగన్ బండారం బయట పడటం లేదా’’ అని ఆనంద్‌బాబు ప్రశ్నించారు.
జగన్ రాజకీయాలకు కాదేదీ అతీతం
‘‘నిన్న కర్నూల్ బస్సు ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే.. దానిమీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేసి సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలారు. యాంకర్ శ్యామలకు పోలీసులు నోటీస్ ఇచ్చి పిలిపిస్తే.. హై కమాండ్ స్క్రిప్ట్ అని చెప్పింది. హైకమాండ్ అంటే జగన్మోహన్‌రెడ్డే కదా? ఇలాంటి ఘట్టాలతో ప్రజలకు జగన్మోహన్‌రెడ్డి ఏం చెప్పదలచుకున్నాడు. 11 సీట్లు పరిమితం చేసి.. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ప్రజలు ఘోరంగా ఓడిరచినా.. రాష్ట్రంలో మళ్లీ అరాచకాలు, అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేయడం ఎక్కడి రాజకీయం. ప్రజలకే కాదు, రాష్ట్రానికీ ఇటువంటి నేర స్వభావం కలిగిన మాఫియా శక్తులతో మహా ప్రమాదం. ప్రశాంతమైన వాతావరణంలో నేడు ప్రజలిచ్చిన అధికారంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో ముందుకు వెళ్తోంది. విధ్వంస రాష్ట్రాన్ని అభివృద్ధి పంథాకు తీసుకెళ్తున్న తరుణంలో.. జగన్మోహన్‌రెడ్డి అనైతిక చర్యలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ఏవిధంగా కుట్రలు కుతంత్రాలు చేయాలనే దానిపై జగన్ ఆలోచిస్తున్నాడు. 14, 15న విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్‌లో రాష్ట్రానికి రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి.
వీటిని అడ్డుకునేందుకు జగన్ కుయుక్తులు పన్నుతున్నాడు. పీపీపీ విధానమంటే ఏంటో కూడా జగన్‌కు తెలియదు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. యువగళంలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి పూర్తిస్థాయిలో ఈ ప్రభుత్వం పని చేస్తుంది. ఇటువంటి వాతావరణం చెడగొట్టాలని చెప్పి మాఫియా శక్తులు జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో పని చేస్తున్నాయి. ఇలాంటి కుట్రలకు పాల్పడిన చాలామంది జైలుకెళ్లారు. మిగిలిన వాళ్ల లిస్ట్ రెడీగా ఉంది. అనైతిక శక్తులు మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్ చేష్టలకు నిరుద్యోగ యువత బలైపోయే ప్రమాదముంది. ఈ శక్తులను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కూటమి ప్రభుత్వానికి ప్రజలు సహకరించి అప్రమత్తంగా వ్యవహరించాలి. జగన్మోహన్‌రెడ్డి అనే విషవృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది’’ అని ఆనంద్‌బాబు పిలుపునిచ్చారు.














