మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి విద్యా మంత్రిగా విశేష సేవలందించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఏపీ ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు షరీఫ్, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు, ఏపీ ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ బాషా, శ్రీశైలం ఆలయ బోర్డు సభ్యులు ఏవీ రమణ, ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మ న్ మందలపు రవికుమార్, నేతలు మహమ్మద్ నూర్, గొట్టిపాటి రామకృష్ణ, బొద్దులూరు వెంకటేశ్వరరావు, చప్పిడి రాజశేఖర్, పోరా రామ కృష్ణ, కోడూరు అఖిల్, పర్చూరి కృష్ణ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ మౌలా నా అబుల్ కలాం ఆజాద్ భారతీయ విద్యా వ్యవస్థకు చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. సమగ్ర విద్యకు ప్రాధాన్యం ఇచ్చిన దూరదృష్టి నాయకుడని, ఆయన ఆశయాల సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.












