- నెయ్యి కల్తీని సిట్ బయటపెట్టింది
- ఇది హిందువుల విశ్వాసాలపై ఉద్దేశపూర్వక దాడి
- దోషులు తప్పించుకోలేరు
- ఎక్స్‌లో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిన దారుణాన్ని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ధారించిందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. ఇది కేవలం నెయ్యి కల్తీ మాత్రమే కాదు. హిందువుల విశ్వాసాలపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి. మన నమ్మకాలను అపవిత్రం చేయడం. భారత ఆత్మపై జరిగిన ఘోరమైన నేరం. తిరుమల పవిత్రతతో ఆటలాడిన వారు మూల్యం చెల్లించక తప్పదు. దోషులు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.















