అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో మరో 10 కార్పొరేషన్లకు సంబంధించి బోర్డు డైరెక్టర్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 కార్పొరేషన్లలో మొత్తం 122 మందిని డైరెక్టర్లుగా నియమించారు. కొత్తగా నియమించిన వారిలో కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డులో 13 మంది, రాష్ట్ర ఎస్సీ కమిషన్‌లో 5 గురు, రాష్ట్ర మైనార్టీ కమిషన్‌లో ముగ్గురు, లేబర్ వెల్ఫేర్ బోర్డులో 11 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కళింగ కోమటి / కళింగ వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డు, దాసరి వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ, ముదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, నాగవంశం వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సగర/ఉప్పర వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లలో 15 మంది చొప్పున డైరెక్టర్లను నియమించారు.















