అమరావతి (చైతన్య రథం): ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. ‘‘ఆయన మరణం.. తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.















