- గుడికట్ల పూజారులకు గౌరవవేతనం అందిస్తాం
- బైరవానితిప్ప ప్రాజెక్టును మేమే పూర్తిచేస్తాం
- తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు రాజకీయ స్వాతంత్ర్యం
- కేంద్రంతో మాట్లాడి ఆర్డీటీ లైసెన్సు పునరుద్ధరించాం
- భక్త కనకదాస జయంతి సభలో మంత్రి నారా లోకేష్
కళ్యాణదుర్గం (చైతన్య రథం): తెలుగుదేశం పార్టీక్ అండగా నిలిచిన కురుబ సోదరులను మరువం. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.. కళ్యాణదుర్గంలో భక్త కనకదాస 538వ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ… “తెలుగుదేశం అంటేన బీసీల పార్టీ. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు అన్ని విధాలుగా టీడీపీకి అండగా నిలిచారు. ఇప్పుడు మేము బీసీలను బలోపేతం చేయడానికి అన్నివిధాలుగా కృషిచేస్తున్నాం. ఈ రోజు చాలా మంచి రోజు. మహా భక్తుడు కనకదాస జయంతి. ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహావిష్కరణ చేయడం, కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం నా జీవితంలో మార్చిపోలేని రోజు. ఒకే రోజు మూడు పండుగలను కురుబ సోదరులతో కలిసి జరుపుకోవడం నా అదృష్టం. కనకదాస గొప్ప పాటలతో శ్రీకృష్ణుడుని తనవైపునకు తిప్పుకున్నారు. ప్రజల్లో దైవభక్తిని పెంచారు. చైతన్యం తీసుకొచ్చారు. ఆయన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. చిన్నతనంలో బాగా చదువుకున్నారు. సైన్యంలో చేరి యుద్ధాల్లో పాల్గొన్నారు. ఆయన జీవితాన్ని భక్తికి, ప్రజలకు అంకితం చేశారు. ఒక రోజు కనకదాస ఆయన గురువు నీకు మోక్షం పొందాలని లేదా అని అడిగారు. అప్పుడు కనకదాసు అహంకారం అనేది పోతే మోక్షం వస్తుంది అని చెప్పిన గొప్పవ్యక్తి ఆయన. కనకదాసు జీవితం మనకు స్పూర్తి. ఆయన చూపిన మార్గంలో సమాజం నడవాలి” అని లోకేష్ పిలుపునిచ్చారు. భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేస్తాం
“భైరవతిప్ప ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది టీడీపీ, పూర్తిచేసేదీ టీడీపీనే. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. కరువుసీమలో కార్ల పంట పండించిన చరిత్ర టీడీపీది. నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు ఇప్పుడు పరిశ్రమలు తెస్తున్నాం. జిల్లాలో హార్టికల్చర్కు సాయం అందిస్తాం. తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉన్న జిల్లాను 3వ స్థానంలోకి తీసుకొస్తాం. దశాబ్దాలుగా మన జిల్లాలో ఆర్డీటీ సంస్థ అనేక సేవలు అందిస్తోంది.
హాస్పటల్స్, పాఠశాలలు, స్వయం ఉపాధిపరంగా సేవలు చేస్తున్నారు. వారి లైసెన్సు పునరద్ధరణ ఆలస్యమైంది. నేను బాధ్యత తీసుకుని కేంద్రంతో మాట్లాడి ఈ రోజు లైసెన్సును పునరుద్ధరించాం. ఇకపై వారి కార్యక్రమాలను ముందుకు తీసుకెళతాం. బీసీ సోదరులు ఒక విషయాన్ని ఆలోచించాలి. టీడీపీ వల్లే బీసీలకు రాజకీయ స్వాతంత్య్రంవచ్చింది. 3,132 కి.మీ.లు పాదయాత్ర చేసినప్పుడు ఉపకులాలను కలిశా. మీ సమస్యలను నేరుగా తెలుసుకున్నా, ఆ సమస్యలను పరిష్కరించే వరకు నిద్రపోను. ఫైర్ బ్రాండ్ మంత్రి సవితమ్మ మీకున్నారు. చెప్పిన పని అయ్యేవరకు ఆమె వదిలిపెట్టరు. బీసీ సంక్షేమ మంత్రిగా ఆమెకు కూడా బాధ్యత ఉంది. ఇచ్చిన హామీలను మనం నిలబెట్టుకోవాలి. ఎంపీ పార్థసారథి కేంద్రంతో పోరాడుతున్నారు. నిధులు తెచ్చేందుకు కష్టపడుతున్నారు. కేంద్రంనుంచి రావాల్సిన సంక్షేమ పథకాలతో కురుబలకు అనుసంధానం చేసి ముందుకు తీసుకెళ్లండి” అని లోకేష్ సూచించారు.
అనంతపురం జిల్లాకు రుణపడి ఉంటాం
“ఉమ్మడి అనంతపురం జిల్లాకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. ఎన్టీఆర్ను 3సార్లు శాసనసభకు పంపించింది. నా మామ నందమూరి హరికృష్ణను ఒకసారి గెలిపించారు. మరొక మామ బాలకృష్ణను మూడుసార్లు గెలిపించి శాసనసభకు పంపిన గొప్పనేల అనంతపురం. ఈ నేలకు మేము ఎంతచేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. అనంతపురం అంటే టీడీపీ, టీడీపీ అంటేనే అనంతపురం. టీడీపీని కురుబలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటూ వస్తున్నారు. కురుబలకు రాజకీయంగా, ఆర్థికంగా స్వాతంత్యం వచ్చింది టీడీపీతోనే. కురుబ సోదరులు మొదటి నుండీ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఎన్టీఆర్ దగ్గరనుంచి చంద్రబాబువరకు కురుబలు అంటే ప్రత్యేక ప్రేమ. కురుబలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసింది టీడీపీ. 2014నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం కురుబ సామాజికవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కురుబ కార్పొరేషన్ను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కురుబ కమ్యూనిటీకి వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేసింది. గొర్రెల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు, బీమా కూడా ఇచ్చాం. 50శాతం సబ్సిడీతో 4 లక్షల వరకు రుణసౌకర్యం కల్పించాం. కురుబ కమ్యూనిటీ భవనాలు నిర్మించాం. కురుబ సామాజిక వర్గాన్ని రాజకీయంగా టీడీపీ ప్రోత్సహిం చింది. ఎస్. రామచంద్ర రెడ్డి 14 శాఖలతో మంత్రిగా ఎంపీగా పనిచేశారు. బీకే పార్థసారథి ఎంపీగా, ఎమ్మెల్యేగా, జడ్పీ ఛైర్మన్ గా పనిచేశారు. సవిత గతంలో కురుబ కార్పోరేషన్ ఛైర్మన్ గా పనిచేసి, నేడు మంత్రి గా పనిచేస్తున్నారు. కురుబ సాధికార రాష్ట్ర సభ్యుడు బస్తిపాటి నాగరాజు ఇప్పుడు కర్నూలు ఎంపీ. అనంత పురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, కర్నూ లు జెడ్పీ ఛైర్మన్ బత్తిన వెంకటరాముడు కురుబ సామాజికవర్గానికి చెందిన వారు. చాలామందికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు కూడా లభించాయి” అని లోకేష్ స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో చీకటిరాజ్యం
-2019 నుంచి 2024 వరకు చీకటి రాజ్యం చూశాం. మన బిడ్డలపై పెట్రోలు పోసి తగుల బెట్టారు. బీసీ సోదరుల్లో తిరుగుబాటు వచ్చింది. 94శాతం సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. పాదయాత్రలో కురుబ సోదరులు కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నన్ను కోరారు. వారి కోరిక మేరకు ఈరోజు అధికారికంగా కనకదాసు జయంతిని నిర్వహిస్తున్నాం. బెర్రప్ప పేరుతో గుడులను టీటీడీ సహకారంతో కట్టిస్తాం. పూజారులకు త్వరలోనే గౌరవవేతనం అందజేస్తాం. గతంలో కురుబ సోదరులకోసం అనేక కమ్యూనిటీ భవనాలు ప్రారంభించాం. అసంపూర్తిగా నిలిచి పోయిన కురుబ భవనాలను వచ్చే 12నెలల్లో పూర్తిచేస్తాం. ఆదరణ పథకం కింద పనిముట్లు అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. కురుబ సోదరులకు ఇన్సూరెన్స్, షెడ్లు కోరారు. పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్న పవనన్న ఆవుల కోసం షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయనతో మాట్లాడి కురుబల కోసం షెడ్లు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. మేత భూములు, దాణా, మందులు, షెడ్లువంటి సమస్యలను కురుబ సోదరులు నా దృష్టికి తెచ్చారు. వాటన్నింటినీ ప్రజాప్రభుత్వం తప్పకుండా పరిష్కరించి, మీ ఆదాయాన్ని మెరుగుపర్చేందుకు కృషిచేస్తుంది. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపురం ఎంపీ పార్థసారధి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం, దగ్గుబాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి, బండారు శ్రావణి, కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.















