- దేశంలోనే రెండో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ యూనిట్
- తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీన్ రూ.5,942 కోట్ల పెట్టుబడి
- నాయుడుపేట వద్ద ఏర్పాటు
- మంత్రి నారా లోకేష్ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): దేశంలోనే రెండో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ అండ్ మాడ్యూల్ తయారీ ప్రాజెక్ట్ ఏపీకి రానుందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడిరచారు. ఇందు కోసం తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏపీలో రూ.5,942 కోట్లు పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సౌర యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులో 5 Gఔ సిలికాన్ ఇంగోట్, వేఫర్ ప్లాంట్‌తో కూడిన 4 Gఔ ుూూజశీఅ సోలార్ సెల్ యూనిట్ భాగంగా ఉంటాయి. ఎకో సిస్టం అభివృద్ధి ఆయేÊ కొద్దీ ఈ ప్రాజెక్ట్ దాదాపు 3,500 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్ట్ సాకారం చేయటంలో మేం ఎంతో వేగంగా పనిచేశాం. ఏపీఐఐసీ రికార్డు సమయంలో 269 ఎకరాల భూమిని సిద్ధం చేసింది. అక్టోబర్ 2024లో చర్చలు ప్రారంభమయితే ఫిబ్రవరి 2025 నాటికి భూమిని కేటాయించారు. దగ్గరలో పోర్టుల ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు అనుకూల అంశం. ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రోత్సాహకాలు ప్రకటించాం. ఏపీని ప్రముఖ సౌర తయారీ కేంద్రంగా రూపుదిద్దటంలో ఈ ప్రాజెక్ట్ కీలకం కానుంది. అదే సమయంలో పారిశ్రామిక వృద్ధితో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అదుతుంది. 7 Gఔకి సామర్థ్యాన్ని అందుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఏదేమైనా దేశంలోనే రెండో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ అండ్ మాడ్యూల్ తయారీ ప్రాజెక్ట్‌నే ఏపీకి సగర్వంగా ఆహ్వానిస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.












