- పాలనలో నూతన ప్రమాణాలు సెట్‌చేసిన ఏపీఎస్‌డీపీఎస్
- ఉద్యోగుల శిక్షణనుంచి స్వర్ణాంధ్ర విజన్ వరకు నిశ్శబ్ద విప్లవం
అమరావతి (చైతన్య రథం): ‘‘ప్రభుత్వ వ్యవస్థ మెరుగుపడాలంటే, ముందు ఆ వ్యవస్థను నడిపేవారి ఆలోచనలు, నైపుణ్యాలు మెరుగుపడాలి’’ అనే సిద్ధాంతంతో ఏపీపస్‌డీపీఎస్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ) వేసిన అడుగులు, పాలనలో కొత్త దిశ చూపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేసే దిశగా ఏపీఎస్‌డీపీఎస్ చేపట్టిన చర్యలు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఉద్యోగుల నైపుణ్యవృద్ధి నుంచి అభివృద్ధి ప్రణాళికల వరకు పలు వినూత్న కార్యక్రమాలతో ఏపీఎస్‌డీపీఎస్ పాలనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
కర్మయోగి అమలులో దేశంలోనే ఏపీ అగ్రస్థానం
గతంలో ప్రభుత్వ శిక్షణ అంటే కొన్ని తరగతులు, పేపర్లు, సర్టిఫికేట్‌తో ముగిసిపోయేది. కానీ ఏపీఎస్‌డీపీఎస్ నేతృత్వంలో ఱGూు కర్మయోగి అమలు శిక్షణను ఒక ఆటోమేటెడ్, నిరంతర, వ్యక్తిగత వృద్ధి ప్రయాణంగా మార్చింది. ఏపీఎస్‌డీపీఎస్ ఆధ్వర్యాన ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో మన రాష్ట్రం రికార్డులు సృష్టించింది. 8 నెలల్లో ఱGూు ప్లాట్‌ఫార్మ్‌లో కోర్సు పూర్తి చేసిన వారి సంఖ్య 2.98 లక్షలనుంచి 58 లక్షలకు చేరడం విశేషం. కేవలం 24 గంటల్లో 8 లక్షలమంది ఉద్యోగులను ప్లాట్‌ఫార్మ్‌లోకి తీసుకురావడం మరో మైలురాయి. ఈ విజయంతో దేశానికి ఆదర్శంగా ఏపీ నిలిచింది. గోవా ప్రతినిధులు ప్రత్యేకంగా ఏపీని సందర్శించి అమలు విధానాలను అధ్యయనం చేశారు.
ప్రతి నియోజకవర్గానికి భవిష్యత్ బ్లూప్రింట్
స్వర్ణాంధ్ర` 2047 విజన్‌ను కార్యరూపంలోకి తీసుకువెళ్లేందుకు ఏపీఎస్‌డీపీఎస్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక విజన్, యాక్షన్ ప్లాన్ రూపొందించింది. 175 నియోజకవర్గ యూనిట్లు, 26 జిల్లా యూనిట్లు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి మానిటరింగ్ వ్యవస్థను ప్రారంభించారు. దాంతో అభివృద్ధి అనేది ఇక పేపర్ మీద ప్రణాళిక కాదు.. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించే విధానంగా మారుతోంది.
టీటీడీ శ్రీవారి సేవకు ఆధునిక శిక్షణ
భక్తులకు మెరుగైన సేవ అందేలా ఏపీఎస్‌డీపీఎస్, టీటీడీ, ఐఐఎం-అహ్మదాబాద్ కలిసి శ్రీవారి సేవకు నూతన శిక్షణ మోడల్‌ను రూపొందించాయి. ఫీల్డ్ స్టడీ, మాన్యువల్స్ రూపకల్పన, శిక్షణ కార్యక్రమాలతో మొదటి విడతలో 130మందికి మాస్టర్ ట్రైనింగ్ అందించారు. త్వరలో 1,700 సేవకులు శిక్షణ పొందనున్నారు. భక్తులకు మెరుగైన సేవ అందించడమే ఈ శిక్షణ యొక్క ప్రధాన లక్ష్యం.
ప్రజా పాలనలోకి యువశక్తి
ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ప్రొఫెషనల్స్‌ను నియమించి, 6 రోజుల బూట్ క్యాంప్ శిక్షణతో వారిని ప్రజల ప్రభుత్వం మధ్య విజన్‌ను తయారు చేసింది. క్షేత్రస్థాయిలో డేటా ఆధారిత ప్లానింగ్‌కు ఈ యంగ్ ప్రొఫెషనల్స్ కీలక మద్దతు అందిస్తున్నారు.
ప్రభుత్వోద్యోగుల పని తీరుకు స్కోర్‌కార్డ్ జీఈపీఈఎస్
ఉద్యోగుల పనితీరు అంచనాకు ఏపీఎస్‌డీపీఎస్ రూపొందించిన జీఈపీఈఎస్ సిస్టమ్‌తో పనితీరు ఉన్నవారికి గుర్తింపు ఇస్తుంది. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి వారి పనితీరును బట్టి స్కోర్‌కార్డ్‌లను ఇస్తుంది. ఉద్యోగులు అలసత్వాన్ని, నిర్లక్ష్యానికి చెక్ పెట్టడంతో పాటు సేవా నాణ్యతకు ప్రమాణాలు అనే మూడు దిశల్లో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.
గుడ్ గవర్నెన్స్‌కు గ్లోబల్ హబ్‌గా ఏపీ అడుగులు
భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ను మంచి పాలన ఆలోచనలకు, పరిశోధనలకు, శిక్షణకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో గ్లోబల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ప్రతిపాదన పుట్టింది. భారతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, థింక్ ట్యాంక్‌లతో భాగస్వామ్యాలపై చర్చలు జరుగుతున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించి గుడ్ గవర్నెన్స్‌లోనే గ్లోబల్ హబ్‌గా ఏపీని నిలిపేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర మంత్రిత్వశాఖలలో వ్యూహాత్మక పనులకు 24 ఎస్‌వీఎంయూ ప్రొఫెషనల్స్ నియామకం జరగగా, ప్రతిభావంతులను ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడానికి స్వర్ణాంధ్ర సీఎం ఫెలోషిప్ ప్రవేశపెట్టడం మరో ముందడుగు. ఏపీఎస్‌డీపీఎస్‌లో డిజిటల్ మార్పువల్ల ఉద్యోగ నియామకాలు, హెచ్‌ఆర్‌ఎంఎస్ పనితీరు అన్నీ ఒక క్లిక్ దూరంలో అయ్యాయి. పాలనలోని ఈ మార్పు ప్రచారం లేకుండానే సాగుతున్నా దాని ప్రభావం ఊహించని విధంగా ఉంటుంది. పాలనలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తుంది. ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తుంది. దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతుంది. ఇది కేవలం ఒక డిపార్ట్‌మెంట్ కథ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో రూపుదిద్దుకుంటున్న పాలనా సంస్కృతి కథ. స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించాలంటే ఉద్యోగులే ప్రధాన శక్తి అని, శిక్షణ, టెక్నాలజీ, డేటా ఆధారిత పాలన `ఇవే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పునాది అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ముందుకు సాగడం హర్షణీయం, అభినందనీయం.











