- అడ్డంగా కొండారెడ్డి దొరికిపోతే ఆయన నేతృత్వంలో శిక్షణ కార్యక్రమాలా?
- విద్యార్థి సంఘ నేత ముసుగులో మాఫియా
- ఆయనను పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదు
- ‘డ్రగ్స్ వద్దంటుంటే.. తీసుకో బ్రో’ అంటున్నారు
- వైసీపీ నేతలు యువతను నాశనం చేస్తున్నారు
- వారి భవిష్యత్ కోసం ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చాం
- ఏడాదిన్నరలోనే గంజాయి రహిత రాష్ట్రంగా చేశాం
- హోం మంతి వంగలపూడి అనిత
మంగళగిరి (చైతన్యరథం): నేటి యువతే రేపటి భవిష్యత్తు అని నమ్మిన సిద్ధాంతంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ యువత భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ప్రజాప్రతినిధులంతా ఏక మై విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయిని సమూలంగా అంతమొందించాలని కట్టుబడి ఉన్నారని హెం మంత్రి అనిత తెలిపారు. గురువారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యువ తపై ఆధారపడి ఉంది. అందుకే గత ఒకటిన్నర సంవత్సరంగా ఈ దిశలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తల్లిదండ్రు లు ఒక పూట తిని మరొక పూట తినకుండా పిల్లలను చదివించి భవిష్యత్తు బాగుండాలని ఆశపడతారు. వారికి భరోసా, ధైర్యం కల్పించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యం. ఇందులో భాగంగా ఈగల్ వ్యవస్థను స్థాపించాం, దీని ఫలితంగా గంజా సాగును జీరో స్థాయి కి తగ్గించాం. ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదాన్ని స్కూల్ స్థాయికి తీసుకెళ్లాం.
50 వేల స్కూళ్లలో అవ గాహన కార్యక్రమాలు నిర్వహించి డ్రగ్స్ నష్టాలు, ఎన్డీపీఎస్ చట్టాల గురించి విద్యార్థులకు తెలియజేశామని వివరించారు. యువగళం పాదయాత్ర సమయంలో చిత్తూరు జిల్లాలో ఒక తల్లి మొహం ముసుగు వేసుకొని తన ఆడబిడ్డను తీసుకొచ్చి, గంజా అలవాటు కారణంగా స్కూలు దూరమై లైంగిక దాడులు ఎదు ర్కొంటున్న విషయం వెల్లడించి “నా బిడ్డను కాపాడండి” అని వేడుకుంది. ఆ ఆవేదన చూసి రాష్ట్రంలో డ్రగ్స్ పేరు కూడా విని పించకుండా చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరించారు. ఈగల్ సంస్థను ఐజీ స్థాయి అధికా రితో ఏర్పాటు చేసి పూర్తి అధికారాలు కల్పించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం “డ్రగ్స్ వద్దు బ్రో” అంటుంటే, “డ్రగ్స్ తీసుకో బ్రో” అని యువతను నాశనం చేస్తున్నది వైసీపీ అని దుయ్య కుట్టారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చి పాఠశాల విద్యార్థుల బ్యాగుల్లోకి డ్రగ్స్ కల్చర్ తీసుకొచ్చిన ఘనత గన్రెడ్డిదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవి ష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని పులివెందుల ఎమ్మెల్యే జగ న్రెడ్డి ఏ మొహం పెట్టుకుని యువతతో టైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని ప్రశ్నించారు.
కొండారెడ్డి దందా జగన్కు తెలియదా?
వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసి డ్రగ్స్ దందా నడిపిస్తూ ఈగల్ విభాగానికి పట్టుబడ్డాడు. ఇది జగన్కు తెలి య దా? ఆయనకు తెలియకుండానే విద్యార్థి విభాగాధ్యక్షుడు దందా. -నడిపాడా అని ప్రశ్నించారు. విశాఖ కాలేజీల్లో తల్లిదండ్రులు కడుపు కట్టుకుని చదివిస్తుంటే, విద్యార్థి -సంఘాల ముసుగులో డ్రగ్స్ అలవాటు చేస్తున్న వైసీపీ నాయకులతో మీటింగ్ పెడుతున్న జగన్రెడ్డికి సిగ్గు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రోజైన యువత భవిష్యత్తు కోసం ఆలోచించాడా జగన్రెడ్డి అని ప్రశ్నించారు. రాష్ట్ర యువతపై ప్రేమ ఉంటే డ్రగ్స్ దందాలో దొరికిన కొండారెడ్డిని ఎందుకు -సస్పెండ్ చేయలేదు? కొండారెడ్డి జగన్ రెడ్డికి దగ్గరి వ్యక్తి కాదా అని దుయ్యబట్టారు. ఇలాంటి వారితోనే గంజాయిని పెంచి పోషిస్తున్నారు. సిగ్గులేకుండా యువతతో మీటింగ్ పెట్టుకుంటున్నాడా జగన్ అని ప్రశ్నించారు.
వైసీపీ పాలనలో దేశంలో డ్రగ్స్ దందా
వైసీపీ పాలనలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవి. మదేళ్లలో డ్రగ్స్ మీద ఒక్క రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులతో సబ్ కమిటి ఏర్పా టు చేసి ఈగల్, టాస్క్ఫోర్స్, రైల్వేలతో సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్, గంజా ఎక్కడ దొరికినా పార్టీలు, కులాలు, మతాలకు
అతీతంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో అమాయక విద్యార్థులను టార్గెట్ చేసి యూనివర్సిటీల్లో దందా నడిపి జీవితాలు నాశనం చేశారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం శిక్ష కుడితే వారి భవిష్యత్తు పోతుందని జగన్రెడ్డి ఆలోచించాడా అని ప్రశ్నించారు. వైసీపీ ముఠా ధన దాహం వల్లే విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయని దుయ్య బట్టారు. డ్రగ్స్, భూకబ్జాలు, డీయిజం, హత్యలకు నడిపించు కోవడానికే విశాఖను రాజధాని చేస్తానన్నాడా అని ప్రశ్నించారు.
వైసీపీ నేతలకు పిల్లలను దూరంగా ఉంచాలి
విశాఖను ఎకనామిక్, ఇండస్ట్రియల్ హబ్ తయారు చేయడానికి ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రపంచ దేశాలు తిరిగి కంపెనీలు తీసుకొస్తున్నారని ప్రస్తావిం చారు. టీసీఎస్, స్టీల్ ఫ్యాక్టరీ, ఏటీసీ టైర్స్ వంటి సంస్థలతో లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని తెలిపారు. కూటమి పాలనలో రాష్ట్రం చుట్టుపక్కల రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ లాంటి పార్టీలు, వ్యక్తులతో పిల్లలను దూరంగా ఉంచండని ఆమె హితవు పలికారు. జగన్ తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్ తో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏలూరు, కర్నూలు ఘటనల్లో తప్పుడు ఆర్టికల్స్ రాసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. కొండారెడ్డిని సస్పెండ్ చేయకపోవడం డ్రగ్స్కు జగన్రెడ్డి పరోక్ష మద్దతే అని దుయ్యబట్టారు. ఎవరైనా డ్రగ్స్ దందా నడిపిస్తే ఈగల్ కన్ను గమనిస్తుందని ఆమె హెచ్చరించారు. యువత భవిష్యత్తు కాపాడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.












