- ఇదే ప్రభుత్వ విధానమన్న ముఖ్యమంత్రి
- సమాచార క్రోడీకరణతో మెరుగైన పాలన
- ప్రభుత్వం అందించే పౌర సేవలకు రేటింగ్
- ఆన్లైన్ సేవలతో ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలు తప్పిద్దాం
- కలిసి పని చేద్దాం…కలిసి విజయం సాధిద్దాం
- టెక్నాలజీ వినియోగంతో ఖర్చులూ తగ్గించొచ్చు
- ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం చేయొద్దు
- డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): వన్ విజన్ -వన్ డైరెక్షన్… ఇదే ప్రభుత్వ విధానమని.. దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈమేరకు గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలని సూచించారు.
గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి నేతృత్వంలో నిర్వహించిన సదస్సుకు మంత్రులు, కార్యదర్శులు, హెచ్డీలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. డేటా ఆధారంగా పాలన ఏవిధంగా చేపట్టాలి? సత్వర నిర్ణయాలు ఏవిధంగా తీసుకోవచ్చు? డేటా ఆధారిత గవర్నెన్స్. ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఏవిధంగా అందించవచ్చనే అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించాం.
2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నాను. నెలవారీ, త్రైమాసికాలవారీగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలి. నిర్దుష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉంది. ప్రతీ నియోజకవర్గానికీ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత కావాలి. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్గా మార్చుకుని సమర్ధవంతంగా ఆ విభాగాన్ని వినియోగించుకోవాలి. ఇటీవల వచ్చిన తుఫాన్ సమయంలో టెక్నాలజీ వినియోగించుకుని అంతా కలిసి కట్టుగా పని చేశాం. రాష్ట్రస్థాయినుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ.. ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సమాచార సేకరణ- క్రోడీకరణతో మెరుగైన సేవలు
“ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోంది. సిటిజెన్ డేటా అంతా క్రోడీకరించాం. అంగన్వాడీల స్థాయినుంచే విద్యార్థుల డేటా అనుసంధానం కావాలి. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముంది. ఈమేరకు డేటా లేక్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీనిద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్కచోటే క్రోడీకరించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ డేటా ద్వారా రియల్ టైమ్లోనే కావిశ్లేషించి… తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కాదముంది ముందుగా అంచనాలు వేయడం దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం… ఇతద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించండమనేది ఇటెక్నాలజీ ద్వారా సాధ్యమవుతోంది. ప్రజల సంక్షేమం కోసం, పాలన కోసం భారీస్థాయిలో బడ్జెట్ వ్యయం చేస్తున్నాం.
నిధుల వ్యయం సమర్థంగా జరగాలి. ప్రస్తుతం ఈ-ఫైల్స్ కూడా అందరికీ అందుబాటులో “ఉన్నాయి. అయితే ఎంతవేగంగా నిర్ణయం తీసుకుంటున్నారన్నదే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న ప్రశ్న గతంలో ఒక్క చదువుకే కులం, స్థానికత, ఆదాయం ఇలా వేర్వేరు ధృవపత్రాలు 10 రోజులు #ఆఫీసులచుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితి అంతా మారిపోవాలి. కేంద్రం తీసుకొచ్చిన డిజి లాకర్ను సమర్థంగా వినియోగించాలి. అందరూ “అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలి. ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నప్పుడు మళ్లీ ప్రజల్ని కార్యాలయాలకు రప్పించటం ఎందుకన్నది ఆలోచించాలి. దేవాదాయశాఖ అందిస్తున్న సేవల విషయంలో ఇభక్తులంతా క్షేత్రస్థాయికి వస్తారు. రెవెన్యూ సహా ఇతర -శాఖల సేవలు వీలైనన్ని ఆన్ లైన్ లేదా, వాట్సప్ గవర్నెనెన్సు ద్వారానే అందాలి. ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదు, అన్ని జిల్లాల్లో #ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. ఏఐ సాయంతో పాత సమాచారాన్ని, ప్రస్తుతం ఉత్పన్నమయ్యే సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ప్రజలకు అందే ప్రతీ సేవలోనూ ప్రమాణాల్ని ఆనెలకొల్పాల్సి ఉంది. అలాగే ప్రజలనుంచి అందే ఫిర్యాదుల విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నా, ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు సరిగ్గా వ్యవహరించాలి. ఆర్థికేతర, చట్టపరమైన ఫిర్యాదుల విషయంలో ఆలస్యం చేయోద్దు. అలాగే జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఎప్పటికప్పుడు అలెర్ట్ అవ్వాలి… జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరిగినప్పుడు… కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో అలాంటివి జరగ్గకుండా చూసుకోవాలి. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలవల్ల చాలా ప్రాణాలు పోయాయి. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక సంఘటన తర్వాత ఆయా తప్పులు దిద్దుకోవాల్సి ఉంది. ఆమేరకు ప్రామాణికాలు రూపొందించుకుని అటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవా ఉంది” అని సీఎం చంద్రబాబు సూచించారు.
పారదర్శకత పాటించాలి… ప్రజలకు వాస్తవాలు చెప్పాలి
“గత పాలకులవల్ల 22ఏలాంటి వివాదాలు పెద్దఎత్తున తలెత్తాయి. రికార్డులు కూడా తారుమారు. చేశారు. వాటిని పరిష్కరించే విషయంలో యంత్రాంగం అత్యంత బాధ్యతగా వ్యవహరించాలి. అలాగే ఎక్సైజ్ శాఖలోనూ గత ప్రభుత్వంలో తీవ్రమై అవకతవకలు జరిగాయి. వాటన్నిటినీ సరిచేస్తుంటే మళ్లీ మనపై ఆరోపణలు గుప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి అపోహలపై ప్రజలకు అవగాహన కల్పించి వాస్తవాలు వివరించాలి. పారదర్శకత పాటించటంతో పాటు దానిని ప్రజలకు కూడా సరిగ్గా చెప్పుకోవాలి. పోలీసు విభాగానికి సంబంధించిన వివరాలు కూడా డేటా లీకు అనుసంధానం కావాలి. టెక్నాలజీ వినియోగంతో వ్యవస్థలను స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. గాడితప్పిన వ్యవస్థలను దారిలో పెట్టేందుకు ఈ-టెక్నాలజీని వినియోగించక తప్పదు.. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోంది. గత పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించి అగ్రస్థానానికి తీసుకెళ్తాం. ఏపీ ఉపయోగించుకున్నంతగా టెక్నాలజీని ఏ రాష్ట్రమూ వినియోగించుకోవటం లేదు.
సింగిల్ టీమ్, సింగిల్ అప్రోచ్, సింగిల్ థీమ్ అంతా పనిచేద్దాం. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ లేదు. అధికార యంత్రాంగమంతా బాధ్యతతో పనిచేయాల్సిందే. ఎక్కడా నిర్లక్ష్యానికి, అలసత్వానికి తావు లేదు. గత పాలకులు అన్ని శాఖల పనితీరునూ తెల వారు వాటిని నరుదరించే విషయంలో -దెబ్బతిశారు. వాటిని పునరుద్ధరించే విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ -సమయంలో అంతా టీమ్ గా కలిసి పనిచేయాలి. అలాగే రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించే చర్యలూ తీసుకుంటున్నాం. ప్రభుత్వ యంత్రాంగం అందించే -నాణ్యమైన సేవలతోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి -ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది…. 15 శాతం వృద్ధిరేటు దిశగా మనం అడుగులు -వేస్తున్నాం. రాష్ట్రంలో బాధ్యతతో కూడిన ప్రభుత్వముంది కాబట్టే గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ శాఖలు 100శాతం ఆన్లైన్ సర్వీసులను -ప్రజలకు అందించాలి. పెన్షన్ పంపిణీ, ఆర్టీసీ, “రేషన్ వంటి సేవల్లో మంచి పనితీరు కనపడుతోంది. కొన్ని శాఖలు తమ పనితీరును మార్చుకోవాల్సి ఉంది. మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, ఇసుక సరఫరా సేవలు మరింత మెరుగుపడాలి.
రిజిస్ట్రేషన్ విభాగంలో సేవల సంతృప్తిస్థాయి 62-70 శాతానికి చేరింది. రెవెన్యూలాంటి ప్రభుత్వ శాఖలు చేపట్టిన వివిధ కార్యక్రమాలు గడువుమేరకు పూర్తి కావాలి. ఆన్లైన్, వాట్సాప్ సేవలు, పీపుల్స్ టచ్ అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. ప్రజా ప్రతినిధులుగా, అధికారులుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే మన లక్ష్యం. ఫైళ్ల క్లియరెన్సు విషయంలో ఇంకా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్సు కోసం రోజుల సమయాన్ని తీసుకోవటం సరికాదు. కొందరు మంత్రుల పనితీరు బాగా మెరుగుపర్చుకోవాలి. ఫైళ్లు క్లియర్ చేయటంలో ఆలస్యం జరగకూడదు. ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు రేటింగ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం”అని చంద్రబాబు స్పష్టం చేశారు.
టెక్నాలజీ వినియోగంతో ఖర్చులూ తగ్గించొచ్చు
“నీటి వనరుల విషయంలోనూ రియల్ టైమ్లోనే నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. రీఛార్జి చేయటంతోపాటు భూగర్భ జలాలను పెంచుకుంటే కరవనే పరిస్థితే ఉండదు. ఉచిత విద్యుత్ నిమిత్తం రైతులకు రూ.9 వేల కోట్ల సబ్సీడీ ఇస్తున్నాం. భూగర్భజలాలు పెరిగితే విద్యుత్ వినియోగం తగ్గి రూ.4500 కోట్ల వ్యయం తగ్గించుకోవచ్చు. అలాగే వైద్యారోగ్య శాఖలోనూ వనరుల సమర్ధ నిర్వహణ ద్వారా ప్రిడిక్టివ్ అనాలసిస్ ద్వారా వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకునే అవకాశముంది. అప్పుడు డేటానే మనకు అద్భుతమైన సంపదగా మారుతుంది. భూసంబంధిత వ్యవహరాల్లో లిటిగేషన్లు పెరుగుతున్నాయి. ఉన్నతాధికారులు సైతం కోర్టుకు వెళ్లే పరిస్థితులు వస్తున్నాయి. ఏఐ వాడితే జీవోల ద్వారా లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చు. బాధ్యతగా పనిచేస్తూ ముందుకెళ్లాం. సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించండి. అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలి. మొంథా తుపానులో పనిచేసిన విధంగానే పరిపాలనలోనూ పనిచేయాలి.
మొంథా తుఫాన్ సందర్భంగా కన్పించిన టీం స్పిరిట్ అన్నిచోట్లా కన్పించాలి. ఇదో మోడల్గా తీసుకుని కలసి పనిచేద్దాం. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా పనితీరు మెరుగుపర్చుకోకపోతే అది నిర్లక్ష్యమే.
రాష్ట్రాభివృద్ధి, విజన్ లక్ష్యాల సాధనలో అన్ని శాఖలూ సమన్వయంగా పనిచేయాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు సాగాలి. సామాజిక, శాంతిభద్రతల ఇండికేటర్లు కూడా విశ్లేషించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రజలకు అందే సేవల విషయంలో కాంట్రాక్టర్లకు సర్వీస్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేయాల్సిందే. ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోతే సమాజానికి అన్యాయం చేస్తున్నట్టే”నని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అధికారులు టెక్నాలజీని తమ తమ శాఖల్లో ఏవిధంగా ఉపయోగిస్తున్నామనే విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. టెక్నాలజీని వినియోగించుకుని… విశ్లేషణలు చేసుకోవడం ద్వారా జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని అధికారులు వివరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఎగవేతలు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామని వెల్లడించారు. ఇక ఈ-వేబిల్స్ ద్వారా ఎక్కడా ఎగవేతలు లేకుండా చూస్తున్నామని… రెవెన్యూ లాస్ లేకుండా సీసీ కెమెరాలు వినియోగిస్తున్నామని చెప్పారు. గడచిన 25 రోజులుగా సురక్షా యాప్ స్కాన్ చేస్తూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఇప్పటి వరకూ ఒక్క నకిలీ బాటిల్ కూడా లభ్యం కాలేదని చెప్పారు. మద్యం కొనుగోలు చేసే సమయంలో యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలనే అంశాన్ని మరింతగా ప్రచారం చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. మైనింగ్ ఆదాయం మరింతగా వృద్ధి చేసుకునే విషయంలో టెక్నాలజీని అనుసంధానిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.












