అమరావతి (చైతన్యరథం): తన ముంబై పర్యటనపై జగన్ రెడ్డి వ్యాఖ్యలను విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ గట్టిగా తిప్పికొట్టారు. అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశకు వచ్చే జగన్.. ఎప్పుడూ జనం మధ్య ఉండే మా వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారు. మీ వైపు 4 వేళ్లు చూపుతున్నాయని మర్చిపోతున్నారు. మొంథా తుపాను హెచ్చరిక వచ్చిన నుంచీ సాధారణ పరిస్థితి నెలకొనే దాకా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా ప్రజల చెంతే ఉన్నాం. ప్రజల్ని ఆదుకున్నాం. ఇవన్నీ మీకు తెలియడానికి మీరు ఇక్కడ లేరు. మీది వేరే భ్రమాలోకం. అందులో విహరిస్తుంటే, ఇవన్నీ తెలియవు. నాకు మహిళలంటే గౌరవం, దేశమంటే భక్తి, అందుకే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లాను. కోట్లాది భారతీయులు తలెత్తుకునేలా మహిళా మణులు వరల్డ్ కప్ గెలిస్తే, నేనే గెలిచినంత ఆనందించాను. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే.. అంటూ మంత్రి లోకేష్ చురకలు వేశారు.












