- భువనమ్మకు అంతర్జాతీయ గౌరవం
లండన్ (చైతన్యరథం): నిండైన మానవతామూర్తికి ఘన సత్కారం. లక్షలాది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న భువనమ్మకు అంతర్జాతీయ స్థాయిలో దక్కిన అరుదైన గౌరవం. ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ నుంచి సీఎం చంద్రబాబ సాక్షిగా సతీమణి నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. లండన్లోని మే ఫెయిర్ హాలులో యూకే కాలమానం సాయంత్రం 7 గంటలకు అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజా సేవ, సామాజిక ప్రభావం అంశాల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హెూదాలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ -2025 అవార్డు అందుకున్నారు. అదే విధంగా హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్స్టెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ను ఎక్స్టెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఐఓడి సంస్థ ఎంపిక చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హెూదాలో భువనేశ్వరి గోల్డెన్ పీకాక్ అవార్డును స్వీకరించారు.
దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తితో… సుమారు మూడు దశాబ్దాలుగా పేద ప్రజలకు సాయమందిస్తూ.. వారి జీవితాలో వెలుగులు నింపుతోంది. ఎన్టీఆర్ ట్రస్ట్. దానికి మేనేజింగ్ ట్రస్టీగా నారా భువనేశ్వరి చూపించిన అంకితభావం, సేవా గుణమే ఇందుకు కారణం. ఈ సేవాభావానికి గుర్తింపుగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హెూదాలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ -2025 అవార్డు భువనేశ్వరిని వరించింది.
అదే విధంగా అత్యంత సమర్థతతో, విలువలకు కట్టుబడి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను నడిపిస్తున్నందుకు ఎక్స్టెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు గోల్డెన్ పీకాక్ అవార్డుకు భువనమ్మ ఎంపికయ్యారు.












