- తఫాను ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టండి
- సాధారణ స్థితి కల్పించేందుకు కృషిచేయాలి
- నష్టాలపై పూర్తిస్థాయి నివేదికలివ్వండి..
- వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- టెలికాన్ఫరెన్స్ లో మంత్రి నారా లోకేష్ ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం! మొబంధా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ సచివాలయం నుంచి బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో 48 గంటలపాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపకశాఖ తగిన చర్యలు దేపట్టాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు వందశాతం విద్యుత్ను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. మొంది తీవ్ర తుఫాను ప్రభావంతో జరిగిన ప్రాణనష్టం, దెబ్బతిన్న నిర్మాణాలను నివేదించాలనిఆదేశించారు. వర్షాలకు దెబ్బతిన్న వివిధ పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతోపాటు పంటనష్టం అంచనాలను రూపొందించాలన్నారు. వంతెనలు, కల్వర్టులను పర్యవేక్షించడంతోపాటు వర్నాల దాటికి దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువగట్లను పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్త చర్యలు దేపట్టడంతో పాటు పాముకాటుకు ఉపయోగించే ఔషధాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం నిర్వహణతోపాటు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మత్యకారులు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు అందించాలని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ఆదేశించారు. హోంమంత్రి అనిత, సీఎస్ కె విజయానంద్, ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు టెలీకాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.













