అమలాపురం (చైతన్య రథం): రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఉద్యాన మరియు మార్కెటింగ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పరిస్థితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సమగ్రంగా వివరించారు. మంత్రి అచ్చెన్నాయుడు జిల్లావ్యాప్తంగా పర్య టించి, తుఫాన్ ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.గాలులు, వర్షాల కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన విషయా లను ముఖ్యమంత్రికి నివేదించారు. రైతుల పంటల నష్టం, రహదారి రవాణా అంతరాయం, పల్లె ప్రాంతాల్లో గృహాల దెబ్బతినిపరిస్థితులను వివరించారు.
తుఫాన్ సమయంలో జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్, రవాణా, తాగునీటి పునరుద్ధరణ పనులు వేగవం తంగా కొనసాగుతున్నాయని, అవసరమైన అన్ని వనరులు సమకూర్చినట్లు వివరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతా లపై ఎప్పటికప్పుడు సమీక్ష కొనసాగించా లని, ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం చూపాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా ప్రభుత్వయంత్రాంగం సమగ్రంగా పని చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు. సీఎం దృష్టికి తీసుకొచ్చారు.















