జగన్‌రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా, గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖకు మహాయోగం పట్టిందన్నది నిజం. ఒకే ఒక్క పరిశ్రమతో విశాఖపట్నం దిశ, దశ మారనుంది. రాష్ట్ర ప్రగతిరథ గమనంలో ఇదొక కీలక ఘట్టం. గూగుల్ ఆసక్తి తెలుసుకుని.. కార్యరూపానికి తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ అపూర్వం. ఒక్కక్షణం ఆలస్యం చెయ్యకుండా గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖకు రప్పించడానికి శక్తినంతా ప్రయోగించారు చంద్రబాబు. సైబరాబాద్‌ను సృష్టించిన విధంగానే విశాఖ అభివృద్ధి ప్రదాతగా చంద్రబాబు పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోవడం ఖాయం!
మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఏపీ.. ఏపీ ప్రజలపై ఏమాత్రం ప్రేమలేదు. ఆయన ప్రతిభ (పడగొట్టడం, విడగొట్టడం, చెడగొట్టడం) విధ్వంసక నైపుణ్యాలకే పరిమితం. అబద్ధాలు, అహంకారం, ఆరాచకత్వాలే ఆయన సహజాభరణాలుగా మిగిలాయి. అబద్ధాలాడటంతో ప్రపంచ నేతలకంటే ఆరాకులు ఎక్కువే చదివిన జగన్‌రెడ్డి.. ఇంట్లో కూర్చుని సొంత మురికి మీడియా మైకుల ముందు ‘గూగుల్ డేటా సెంటర్‌ను తానే తెచ్చా’నని చెప్పుకోవడం చూస్తుంటే.. నక్కలు నీతి శతకాలు వల్లెవేస్తున్నట్టుంది! గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎంతటి నీచానికైనా దిగజారతాననే ప్రకటనలు, ప్రవర్తనతో చెప్పుకుంటూనే ఉన్నారు. తాజాగా `అదానీ గ్రూప్, కేంద్రం, వైసీపీ ప్రభుత్వం చూపిన చొరవ వల్లే ఇది సాధ్యమైందని మురికి మీడియా మైకులముందు పచ్చి అబద్ధాలు వల్లెవేయడం జగన్‌కే చెల్లింది.
ఇవీ.. అసలు వాస్తవాలు
విశాఖ మహానగరంలో దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో డేటా పార్కు, సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చిన అదానీ గ్రూప్ సంస్థతో.. 2019 జనవరి 9న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో గిగావాట్ డేటా సెంటర్ మూడు కేంద్రాలతో ఏర్పాటు చేయాలని, ఐదు గిగావాట్స్ సామర్థ్యంతో సోలార్ పార్క్‌ను నెలకొల్పాలని నిర్ణయించారు. ఒప్పందం జరిగిన 35 రోజుల వ్యవధిలోనే విశాఖలోని కాపులుప్పాడలో అదానీ డేటా సెంటరుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పటి తెదేపా ప్రభుత్వం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు, అవసరమైన పునరుత్పాతక విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు మూడుచోట్ల 400 ఎకరాలు కేటాయించింది. ఈ డేటా సెంటర్‌ను ప్రపంచానికే తలమానికగా తీర్చిదిద్దాలన్నది అప్పటి ప్రభుత్వం సంకల్పం. ఇందుకు విరుద్ధంగా.. జగన్‌రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే.. కొర్రీలతో గూగుల్‌ని నిలిపివేసిన పెద్దమనిషి.. నేడు విశాఖకు డేటా సెంటర్ రావడానికి తానే కారణమైనట్టు ప్రకటించుకోవడం సిగ్గుచేటు. రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తమైన ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించిన జగన్‌రెడ్డే..
ప్రాజెక్టు సాధించామన్న క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టేస్తున్నారంటూ బుకాయించడం విడ్డూరం!
కూటమి ప్రభుత్వం, కేంద్రం సహకారంతో గూగుల్‌వంటి ప్రపంచ ఐటీ దిగ్గజాన్ని విశాఖలో రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో సాధిస్తే.. దానిని తక్కువ చేసి మాట్లాడటం జగన్ తెంపరితనానికి పరాకాష్ట. ప్రపంచం మొత్తం చంద్రబాబు ప్రభుత్వా సామర్థ్యాన్ని వేనోళ్ల పొగుడుతుంటే.. డేటా సెంటర్‌పై పచ్చి అబద్ధాలను పచారం చేస్తుండటాన్ని `జగన్ విజ్ఞతకే వదిలేయాలి. జగన్ హయాంలో అదానీ సంస్థను దారికి తెచ్చుకునేందుకు ప్రాజెక్టుపై సమీక్షల పేరిట ఆలస్యం చేశారు. దీర్ఘకాలిక ప్రణాళికలు తమకువద్దని.. మూడేళ్లలో ఏంచేస్తారో చెప్పాలంటూ మోకాలు అడ్డుపెట్టిందీ జగనే. పాత ఒప్పందం రద్దు చేస్తున్నామని, కొత్త ప్రతిపాదనతో రావాలనడంతో.. ప్రాజెక్టు పరిధిని అదానీ సంస్థ పరిమితం చేసేసింది. అలా, 2023లో అదానీ డేటా సెంటర్‌కు జగన్ మళ్లీ శంకుస్థాపన చేసినా ముందుకు సాగలేదు. తనకు ఏమాత్రం సంబంధంలేని గూగుల్ డేటా సెంటర్‌లో క్రెడిట్ వాటా ఇవ్వాలని కోరుకోవడం `జగన్ నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట!!
కూటమి అధికారంలోకి వచ్చాక.. పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న ఫ్రెండ్లీ విధానాలు నచ్చే.. విశాఖలో పెట్టుబడులకు గూగుల్ సంస్థ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఇప్పుడున్న పన్ను విధానాలను మార్చి, భవిష్యత్‌లో పెంచితే ఎలాగని డైలమాలోవున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రధానిని కలిసి సమస్య వివరించారు. పన్ను విధానంలో మార్పు ఉండదని, భవిష్యత్‌లో పెంచబోమని మోదీ హామీ ఇచ్చాకే.. గూగుల్‌ని ఆహ్వానించారు. పన్ను పెంచబోమన్న ప్రధాని హామీతో గూగుల్‌కి భరోసా దక్కింది. ఏపీకి గూగుల్ డేటా సెంటర్‌ను తీసుకురావడానికి ప్రభుత్వం 13 నెలలుగా పడిన శ్రమకు ప్రతిఫలమే గూగుల్. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది మొదలు… జగన్ ముఠా సోషల్ మీడియాలో ఇష్టానుసారం విషప్రచారం కావించింది. ప్రాజెక్టుతో పర్యావరణానికి ముప్పు అంది. ఆశించినన్ని ఉద్యోగాలు రావంది. జగన్ ఎంతగా దిగజారుతున్నారంటే.. మునుపటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలు, వచ్చిన పెట్టుబడులు, ఏర్పాటైన పరిశ్రమల్లోనూ క్రెడిట్ కొట్టేయాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
గూగుల్ డేటా సెంటర్‌పై `జగన్ మోచేతి నీళ్లుతాగే కుహనా మేధావులు బురదజల్లే ప్రయత్నాలు గట్టిగానే చేశారు. కూటమి ప్రభుత్వం సాధిస్తోన్న భారీ ప్రాజెక్టుల పరపతి.. తమకు రాజకీయ ఉనికి లేకుండా చేస్తుందనీ భయపడ్డారు. అందులో భాగమే `వైసీపీ సాగిస్తోన్న విష ప్రచారం. జగన్ ముఠా దుష్ప్రచారాన్ని జనం నమ్మలేదు. సరికదా.. జగన్‌రెడ్డిని ఛీకొట్టే పరిస్థితి రావడంతో డేటా సెంటర్‌తో భవిష్యత్‌లో మార్పు రావొచ్చంటూ నాల్క మడతపెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్టును కూడా తానే తెచ్చినట్టుగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకోవడం.. జగన్ మార్క్ రోత రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం.










