చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై యుద్ధం

స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

by చైతన్యరధం
Sep 22, 2025 at 6:16am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై యుద్ధం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్లాస్టిక్‌ రహిత ఏపీ ఆవిష్కరణే కూటమి లక్ష్యం
  • 2026 జూన్‌నాటికి ప్లాస్టిక్‌ రహితంగా రాష్ట్రం
  • చెత్తకే కాదు.. చెత్త రాజకీయాలకూ చరమగీతం పాడతా
  • కూటమి వచ్చేవరకూ పల్నాడులో ప్రజాస్వామ్యం లేదు
  • రాజకీయ ముసుగులో రౌడీయిజం చెలాయిస్తే సహించను
  • వరికపూడిశెల పూర్తిచేసి పల్నాడు పల్లెల్లో జలాలు పారిస్తా..
  • ప్రభుత్వం ఆధ్వర్యంలో కారంపూడి పలనాటి వీరారాధన ఉత్సవాలు
  • మాచర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
  • స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

మాచర్ల (చైతన్య రథం): రాష్ట్రంనుంచి ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు, రాష్ట్రాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు ‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఫ్రీ ఏపీ ఉద్యమం’ చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ద్వారా 2026 జూన్‌నాటికి రాష్ట్రాన్ని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రహితంగా మారుస్తామని వెల్లడిరచారు. శనివారం పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మాచర్లలో స్థానిక చెరువువద్ద పేరుకుపోయిన చెత్త తొలగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చెరువుగట్టు, పరిసర ప్రాంతాల్లో బహిరంగంగాఉన్న చెత్తను, గట్టువద్ద పేరుకున్న వ్యర్ధాలను మున్సిపల్‌ కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు శుభ్రం చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సీఎం సందర్శించారు. సఫాయి కార్మికులు, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి సంభాషించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.52 కోట్ల విలువైన చెక్కును అందించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడార.

కూటమి వచ్చాకే మాచర్లకు స్వాతంత్య్రం
రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు, ఘోరాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు అధికారం ఇచ్చింది మంచిపాలన అందించడానికే కానీ ప్రజలపై దాడులు చేయడానికి కాదన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. చెత్తనే కాదు ..చెత్త రాజకీయాలనూ క్లీన్‌ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్

చైతన్యరధం ఈ పేపర్ 18-02-2026

మీరే ఈ దేశపు హీరోలు

‘‘మాచర్ల ప్రజల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నాను. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాలాంటివారే గత ప్రభుత్వంలో మాచర్లకు రాలేకపోయామంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? పన్డీయే ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని మిమ్మల్ని చూస్తుంటే అర్ధమవుతోంది. రాజీవ్‌గాంధీ హత్య జరిగినప్పుడు మాచర్లలో రౌడీలు, ముఠానేతలు స్థానిక ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారు. ఎన్నో ఏళ్లుగా మాచర్లలో ప్రజాస్వామ్యం లేదు. ఎన్నికలు లేవు. గత ప్రభుత్వంలో నేను మాచర్ల రాకుండా నా ఇంటికి తాళ్లు కట్టారు. ఆ తాళ్లతో వాళ్లు ఉరితాళ్లు వేసుకున్నారు. మాచర్ల మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ నేతలపై దాడి చేశారు. సీమలో ముఠా రాజకీయాలు లేకుండా చేశాను. పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను. ఖబడ్దార్‌ జాగ్రత్తగా ఉండండి. ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడాలి. విద్రోహ శక్తులుగా మారకూడదు’’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

చెత్తనే కాదు… చెత్త రాజకీయాలనూ క్లీన్‌ చేస్తా
‘‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేయడం. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసి పోయింది. చెత్తపైనా పన్ను వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తపన్నుతోపాటు వారు వదిలివెళ్లిన చెత్తనూ తొలగించాం. రోడ్లపై చెత్తతోపాటు చెత్త రాజకీయాలను క్లీన్‌ చేస్తాం. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూశారు. 33 వేలకుపైగా మెజారిటీతో మాచర్ల చరిత్రలోలేని విధంగా జూలకంటి బ్రహ్మారెడ్డిని ప్రజలు గెలిపించారు. మాచర్ల పేరు వినగానే నాకు తోట చంద్రయ్య, జాలయ్య, నంబూరి శేషగిరిరావులాంటి ప్రజాస్వామ్య వీరులు గుర్తొస్తారు. మెడపై కత్తి పెట్టినా కూడా జై చంద్రబాబు అంటూ చంద్రయ్య ప్రాణాలు వదిలాడు. జాలయ్యను అతి కిరాతంగా హతమార్చారు. ప్రజాస్వామ్యం కోసం నంబూరి శేషగిరిరావు పోరాడారు. వారందరికీ నిండు మనసుతో నివాళి అర్పిస్తున్నాను’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

వరికపుడిశెలను పూర్తి చేసే బాధ్యత కూటమిదే
పల్నాడు జీవనాడి, 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షమందికి తాగునీరు అందించే వరికపుడిశెలను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం మాట్లాడుతూ ‘‘ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఎన్టీఆర్‌ శ్రీకారం చుడితే వాటిని పూర్తి చేసే అవకాశం భగవంతుడు నాకిచ్చాడు. వరికపుడిశెల మొదటిదశలో 1.54 టీఎంసీ, రెండో దశలో 6.32 టీఎంసీ నీటిని వినియోగించుకోవచ్చు. పోలవరం పనులు నేను 74 శాతం పూర్తిచేస్తే గత ఐదేళ్లలో ఒక వ్యక్తి వచ్చి దానిని ధ్వంసం చేశాడు. ప్రజావేదికతో కూల్చివేత మొదలుపెట్టి పోలవరం డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయేలా చేశారు. మేం మళ్లీ అధికారంలోకి వచ్చివుంటే 2020 నాటికే పోలవరం పూర్తయ్యేది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పనులు వేగవవంతమయ్యాయి. 2027నాటికి పోలవరం పూర్తిచేస్తాం. రాష్ట్రంలోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీకాకుళంలో ఉన్న వంశధారను, గోదావరి, కృష్ణా, రాయలసీమలో పెన్నానదిని అనుసంధానిస్తాం. ఇప్పటికే గోదావరి కృష్ణానదిని అనుసంధానించాం. త్వరలోనే గోదావరి వంశధారను అనుసంధానించి పెన్నాను కూడా కలుపుతాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నీరు అందించే బాధ్యత తీసుకుంటాను’’ అని సీఎం ఉద్ఘాటించారు.
ప్రభుత్వం తరపున కారంపూడి పలనాటి వీరారాధన ఉత్సవాలు
మాచర్లను మోడల్‌ మున్సిపాలిటీగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లను అదనంగా మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువగా ఉందన్నారు. జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. జలజీవన్‌ మిషన్‌ కింద ప్రతి ఇంటికి నీరు అందిస్తామన్నారు. కారంపొడి పలనాటి వీరారాధన ఉత్సవాలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే మిర్చి రైతుల విజ్ఞప్తిమేరకు మిర్చి బోర్డు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

స్వచ్చాంధ్ర- పచ్చదనం పెంపులో భాగస్వాములవ్వాలి
స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌ ఫ్రీ నినాదాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. మున్సిపల్‌ శాఖ, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కలిసి పరిశుభ్రమైన నగరాలు, గ్రామీణ ప్రాంతాల కోసం పని చేస్తున్నారన్నారు. అక్టోబర్‌ 2కంటే ముందుగానే గత పాలకులు వదిలేసి వెళ్లిన 85 లక్షల టన్నుల చెత్తను 100 శాతం క్లియర్‌ చేశామన్నారు. ఈ లక్ష్య సాధనలో సమర్థవంతంగా పనిచేసిన శానిటేషన్‌ కార్మికులకు, మునిసిపల్‌ శాఖ ఉద్యోగులు, అధికారులు, ఆ శాఖ మంత్రి నారాయణకు అభినందనలు తెలిపారు. ‘‘సర్క్యులర్‌ ఎకానమీలో భాగంగా చెత్తనుంచి సంపద సృష్టిస్తూనే.. ప్రజలకిచ్చే చెత్తకు నిత్యావసరాలు ఇస్తూ డబ్బులు ఆదా చేస్తున్నాం. చెత్తనుంచి కరెంటు, కంపోస్టు తయారు చేస్తున్నాం. కొంతచెత్తను రీసైక్లింగ్‌కు పంపిస్తున్నాం. అలాగే డోర్‌ టు డోర్‌ కలెక్షన్‌ కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రవేశపెడుతున్నాం. ఇప్పటికే విశాఖ, గుంటూరులో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. త్వరలో రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి. సెప్టెంబర్‌ 17నుంచి అక్టోబర్‌ 2వరకు స్వచ్ఛత హీ సేవా ప్రచారం నిర్వహిస్తున్నాం. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం కోసం సఫాయీ మిత్ర సురక్షిత శిబిరాలు, అలాగే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. పట్టణ పారిశుధ్య కార్మికులకు బీమా పథకాన్ని ప్రారంభించాం. 16 విభాగాల్లో 52 రాష్ట్రస్థాయి, 1,421 జిల్లాస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేస్తున్నాం. అక్టోబర్‌ 2న సఫాయి మిత్రలు, శానిటేషన్‌ వర్కర్లు, అగ్రస్థానంలో నిలిచిన మున్సిపాలిటీలు, స్వచ్ఛ వాలంటీర్లను జిల్లాల కలెక్టర్లు సత్కరించాలి. పచ్చదనం పెంపులో ప్రతీ పౌరుడూ భాగస్వామి కావాలి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పేదలకు లబ్ది కలిగేలా నిర్ణయాలు

సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలు సూపర్‌ హిట్‌ చేశారని సీఎం అన్నారు. తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్లు తల్లుల ఖాతాలో వేశామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని వెల్లడిరచారు. దీపం పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందిస్తున్నామని, తొలివిడతగా రైతుల ఖాతాల్లో రూ.7వేల చొప్పున రూ.3173 కోట్లు జమ చేశామన్నారు. అత్యంత పారదర్శకంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఏడాదిన్నరలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 9 లక్షలమందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. పేదరిక నిర్మూలన కోసం పీ`4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు అందించబోతున్నామని వెల్లడిరచారు. ప్రజలందరికీ లబ్ది కలిగించేలా జీఎస్టీ సంస్కరణలు వచ్చాయని సీఎం అన్నారు. 99రకాల వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి వచ్చాయని, తద్వారా ధరలు తగ్గుతాయని ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల ధరలు దిగివస్తాయని వెల్లడిరచారు. అనంతరం పీ`4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.

Previous Post

రైతు కోసమే సాహసం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 22-09-2025

మరిన్ని వార్తలు

ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్
ఆంధ్రప్రదేశ్

ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్

చైతన్యరధం
@ February 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-02-2026

కార్యకర్త
@ February 18, 2026
మీరే ఈ దేశపు హీరోలు
ఆంధ్రప్రదేశ్

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!
ఆంధ్రప్రదేశ్

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!
ఆంధ్రప్రదేశ్

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ
ఆంధ్రప్రదేశ్

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

చైతన్యరధం
@ February 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-02-2026

కార్యకర్త
@ February 17, 2026
అన్నదాతలకు ఏఐ, అగ్రిటెక్ సేవలు అత్యద్భుతం
ఆంధ్రప్రదేశ్

అన్నదాతలకు ఏఐ, అగ్రిటెక్ సేవలు అత్యద్భుతం

చైతన్యరధం
@ February 17, 2026
Load More

ముఖ్య వార్తలు

మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

చైతన్యరధం
@ February 17, 2026
మరింత సులభతరంగా పౌరసేవలు

మరింత సులభతరంగా పౌరసేవలు

చైతన్యరధం
@ February 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్

ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్

చైతన్యరధం
@ February 18, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist