- మామిడి రైతుల పరామర్శ పేరుతో నాటకం
- దండుపాళ్యం బ్యాచ్ డ్రామా బట్టబయలు
- రచ్చ చేయబోయి అడ్డంగా బుక్కయ్యారు
- ఛీకొడుతున్న ప్రజలు..ఆత్మరక్షణలో వైసీపీ నేతలు
అమరావతి(చైతన్యరథం): దండుపాళ్యం బ్యాచ్ బంగారుపా ళ్యం డ్రామా రివర్స్ అయింది. తాను తీసిన గోతిలో తానే పడిరది. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసి ప్రజల నుంచి ఛీకొట్టిం చుకుని ఆత్మరక్షణలో పడిరది. బంగారుపాళ్యంలో జగన్‌రెడ్డి ఆర్గనైజ్ ఈవెంట్ పాలిటిక్స్‌కు ఆధారాలతో తిప్పి కొట్టటంతో కౌంటర్ ఇవ్వలేని స్థితిలో వైసీపీ నేత లు తోక ముడుచుకున్నారు. మామిడికాయలు పారబోసి ప్రజలు, మీడియా అటెన్షన్ తెచ్చుకో వాలన్న వైసీపీ డ్రామా డ్రోన్ విజువల్స్‌లో బట్టబయలు కావడంతో ఆ పార్టీ నేతలు ఇలా బుక్కయ్యామేమిటంటూ ఆత్మరక్షణలో పడ్డారు. వైసీపీ ట్రాక్టర్ల డ్రామా బూమరాంగ్ వీడియో ఆధారాలతో బయటకు రావటంతో ప్రజలు ఆ పార్టీ నేతలను ఛీకొడుతున్నారు. బంగారుపాళ్యంలో జగన్‌రెడ్డి డ్రామాలపై తొలినుంచీ అప్రమత్తం గా వ్యవహరించిన టీడీపీ నాయకులు వారి నాటకాలను బహిర్గ తం చేయటంలో సఫలమ య్యారు. జగన్‌రెడ్డి పర్యటనకు నాలుగు సీమ జిల్లాల నుంచి జనసమీకరణ కోసం నానా తంటా లు పడినా జనం రాకపోవడం, ఇక మామిడిని ట్రాక్టర్లతో తొక్కుడు డ్రామా బట్టబయలు కావడంతో సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ ప్రధాన నాయకులు గప్‌చుప్‌గా ఉన్నారు. తొలినుంచీ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్న ఆ పార్టీ తీరును కూటమి ప్రభు త్వం ఎండ గడుతూ వస్తోంది. జగన్ విషప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడు తున్నారు. ఓవరాల్ ఎపిసోడ్‌లో రైతులకు గత ప్రభుత్వంలో మంచి చేయకపోగా వారి ఆత్మహత్యలకు కారణమైన జగన్‌రెడ్డి..నేడు ప్రేమ ఒలకబోస్తూ చేసిన ఈవెంట్ డ్రామాతో బట్టబయలు కావ డంతో రచ్చ చేయబోయి పరువు పోగొట్టుకున్నామన్న భావనలో వైసీపీ సీనియర్ నాయకులు ఉన్నారు.