- 2029లో వైకాపాకు అధికారం.. వైనాట్ 175/175లాంటి మాయమాటలే
- తిరిగి వైకాపా కొరివితో తలగోక్కునే అమాయకులు కాదు ఆంధ్రులు
పాలిచ్చే గోవులాంటి చంద్రబాబును కాదని తన్నే దున్నలాంటి జగన్‌ను తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగివుంటే పోలవరం పూర్తై.. కరవురహిత ఏపీ అయ్యుండేది.
జగన్ యాత్రలకు భారీగా జనం వస్తున్నారని.. కనుక 2029లో అధికారంలోకి వచ్చి కూటమి నేతల్ని రఫా.. రఫా.. నరికేస్తామని జగన్ బాబా 40 దొంగల ముఠా ఉన్మాద ప్రేలాపనలు చేస్తున్నది. నరికేవాడు నరుకుడుపాలౌతాడని చరిత్ర చెప్పే సత్యం. సిద్ధం సభలకు భారీగా వచ్చిన జనాన్ని చూసి.. 175/175 సీట్లు గెలుస్తామని జగన్ ఉబ్బించే మాటలు చెప్పారు. అది నమ్మిన వైకాపా కార్యకర్తలు, నేతలు బెట్టింగుల్లో పాపపు సొమ్ము పోగొట్టుకుని కొందరు ఆత్మహత్యలపాలయ్యారు. అధికార దుర్వినియోగం చేసిన అధికారులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు జైళ్లపాలయ్యారు. మరలా ఇప్పుడు 2029లో అధికారంలోకి వస్తామని జగన్ చెప్తున్న మాయమాటలు నమ్మి బరితెగిస్తే.. వారి భవిష్యత్తు దెబ్బతినడం ఖాయం.
టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నదని, సూపర్ సిక్స్ అమలు కావట్లేదని, సర్వేల్లో కూటమికి వ్యతిరేకత ఉన్నదని.. కనుక 2029లో అధికారంలోకి వస్తామని వైసీపీ కార్యకర్తల్ని, ప్రజల్ని తిరిగి జగన్ మోసం చేస్తున్నారు. దోపిడీ దుడ్లు వెదజల్లి పర్యటనలకు గంజాయి బ్యాచ్‌ల్ని, మాఫియాలను తరలించి సీఎం.. సీఎం అంటూ గావుకేకేలు పెట్టించుకొంటూ లేనిది వున్నట్టుగా మోసపుచ్చే టక్కరి ప్రయత్నం చేస్తున్నారు. బంగారమని నమ్మి రోల్డ్‌గోల్డ్ కొన్నవారు.. రెండోసారి అదే చేస్తే వాతలు పెడతారు. 2024లో 39.4 శాతం ఓట్లు పొందిన వైకాపా తాజా కేకే సర్వేలో 38 శాతానికి పడిపోయింది. జగన్ పాలనతో పోలిస్తే చంద్రబాబు పరిపాలన ఎలావుందన్న కేకే సర్వే ప్రశ్నకు చంద్రబాబు పాలన బాగుందని 74శాతం ప్రజలు చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తమైన కొద్దిపాటి వ్యతిరేకత రానున్న రోజుల్లో వారు అధిగమిస్తారు. ఎవరన్నా కొద్దిమంది అధిగమించలేకపోతే మార్చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అధిగమించేందుకు అందరూ ప్రజల్లోకి వెళ్తున్నారు.. కార్యకర్తలతో కలసి నడుస్తారు.
సూపర్ సిక్స్ అమలుపై ప్రజలు సంతోషంగా వున్నారు. ఇక మిగిలిన రెండూ.. ఒకదాని తరువాత ఒకటి తప్పక అమలు చేస్తారని ప్రజలు నమ్మకంగా వున్నారు. జగన్ తొలి ఏడాదినాటి పాలనలో మేనిఫెస్టోలోని హామీల్లో 10 శాతమే అమలు చేయగా.. చంద్రబాబు 70 శాతం అమలు చేశారు. జగన్ విద్వేష, విధ్వంస పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండేది కాదు. ప్రజలు భయంతో బతకాల్సి వచ్చేది. చంద్రబాబు పాలనలో ప్రజలు స్వేచ్ఛ అనుభవిస్తున్నారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులనే జైళ్లకు పంపుతున్నారు.
జగన్ ముఠా అబద్ధాలకు, కుల, మత, ప్రాంతీయ విద్వేషాలకు, వివేక హత్య, కోడి కత్తిలాంటి సానుభూతి డ్రామాలకు మోసపోయి.. 2019లో చంద్రబాబు ప్రభుత్వాన్ని పోగొట్టుకొని ఎంత నష్టపోయారో ప్రజల అనుభవంలో వున్నది. 2019లో కూడా చంద్రన్న ప్రభుత్వం కొనసాగివుంటే ఇప్పటికే పోలవరం, నదుల అనుసంధానం పూర్తై.. కరవురహిత ఏపీ ఏర్పడి ఉండేదని ప్రజలకు తెలుసు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, 2029 ఎన్నికల్లో కూటమికి ఘన విజయం అందిస్తారు. స్వర్ణాంధ్ర-2047కు ప్రజలు అండగా నిలుస్తారు.
`గురజాల మల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్.