- డిప్యూటీ కలెక్టర్‌గా నియామకంపై సాకేత్ మైనేని సంతోషం
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ధన్యవాదాలు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం తనను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించటం పట్ల ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కృతజ్ఞతలు తెలిపారు. దీనిని ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇందుకు చొరవ తీసుకున్న విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌కు, త్వరితగతిన నిర్ణయం వెలువడేలా సాయపడిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
`