చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సమాజంలో అన్ని సమస్యలకు..విద్యతోనే పరిష్కారం!

కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి

by చైతన్యరధం
Jun 26, 2025 at 6:16am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
సమాజంలో అన్ని సమస్యలకు..విద్యతోనే పరిష్కారం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నైతిక విలువలతో జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగాలి
  • ఉన్నత లక్ష్యాలతో దేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
  • విద్యార్థులకు మంత్రి నారా లోకేష్‌ పిలుపు
  • కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి

మచిలీపట్నం (చైతన్యరథం): సమాజంలో అన్ని సమస్యలకు విద్య పరిష్కారం చూపుతుంది, ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం, సత్తా మీకు ఉన్నాయి, ఇక్కడి నుండే విద్యార్థులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో బుధవారం మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ… కేవలం గ్రాడ్యుయేషన్‌తో నేర్చుకోవడం ఆగిపోకూడదు, అది జీవితాంతం కొనసాగాలని ఉద్బోధించారు. మీరు ఉపగ్రహాలను నిర్మించాలని, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని, హరిత భవనాలను రూపొందించాలని, స్టార్టప్‌ను ప్రారంభించాలని, గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేయాలని కలలు కని ఉండొచ్చు. ఈ డిజిటల్‌ యుగంలో జ్ఞానానికి మించిన సంపద లేదు. మీరు మీ కెరీర్‌లో ఎదుగుతున్నప్పుడు ఎప్పుడూ విలువలను కోల్పోకండి. వాతావరణ మార్పు, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక నిపుణులుగా మాత్రమే కాకుండా దేశాభివృద్ధిలో పట్టుగొమ్మలుగా నిలవాలని కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ గొప్పతనాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని భావిస్తున్నాను. న్యాయం, రాజ్యాంగ విలువలు, సమానత్వం, విద్య పట్ల ఆయనకున్న లోతైన నిబద్ధత మన రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలవైపు నడిపిస్తోంది. క్రమశిక్షణ, సంకల్పం ఈ ఆడిటోరియంలోని ప్రతి యువకుడికి ఒక రోల్‌ మోడల్‌గా నిలుస్తుంది. ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (IIఖూజుR) స్థాపన వెనుక ఆయన మార్గనిర్దేశక శక్తిగా ఉన్నారు. ధైర్యం, వ్యక్తిత్వంతో అత్యున్నత స్థాయికి ఎదగగలరని చెప్పడానికి ఆయన జీవితం ఉదాహరణ అని మంత్రి లోకేష్‌ ప్రశంసించారు.

వైఫల్యాలకు భయపడొద్దు
యువ గ్రాడ్యుయేట్లు పెద్ద కలలు కనాలి. కష్టపడి పనిచేయాలి. వైఫల్యానికి ఎప్పుడూ భయపడవద్దని కోరుతున్నాను. విజయం ఒక గమ్యస్థానం కాదు, అది స్థిరమైన వృద్ధి, లక్ష్యంతో కూడిన ప్రయాణం. కేవలం కెరీర్‌ను మాత్రమే కాకుండా – ఇతరులకు స్ఫూర్తినిచ్చే జీవితాన్ని నిర్మించుకోండి. మీ మూలాల గురించి గర్వపడండి. లక్ష్యంతో ముందుకు సాగండి. మీ భవిష్యత్తును మాత్రమే కాకుండా దేశభవిష్యత్తును రూపొందించే మార్గదర్శకులుగా నిలవండి. సమాజానికి మార్గం చూపే దివిటీలా మారి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని మంత్రి లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

పట్టభద్రుల జీవితాల్లో కొత్త అధ్యాయం
ఈ రోజు పట్టభద్రుల జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు డిగ్రీలు అందుకుంటున్న గ్రాడ్యుయేట్లందరికీ హృదయపూర్వక అభినందనలు. మీకు మాత్రమే కాదు, మీ తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఈ ప్రయాణంలో మీకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ వేడుక తీపిగుర్తు. మీ కృషి, పట్టుదల, నిబద్ధతకు ఇదొక కొలమానం లాంటిది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది, ఇక రాబోయేది బాధ్యత, అవకాశాలతో నిండిన అధ్యాయం. మీ తల్లిదండ్రులు, కుటుంబం, రాష్ట్రం, దేశానికి మీ కృతజ్ఞతను చూపించాల్సిన ఉంది. మీ డిగ్రీ కేవలం ఒక సర్టిఫికేట్‌ మాత్రమే కాదు – అది ఒక బాధ్యత. మీ జ్ఞానాన్ని సమాజ హితం కోసం ఉపయోగించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, నవీన ఆవిష్కరణలు చేయడం, విలువలకు కట్టుబడి ధైర్యంతో ముందుకు సాగడం మీ బాధ్యత. మీరంతా సమాజానికి దిక్సూచిగా నిలచే అధ్యాపకులుగా, పరిశోధకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. డాక్టర్‌ ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో మీ కలలను సాకారం చేసుకుంటూ భారతదేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ దేశాన్ని ముందుకు నడిపించే మార్గనిర్దేశకులుగా తయారు కావాలని మంత్రి లోకేష్‌ ఆకాంక్షించారు.

అధునాతన సాంకేతికలపై దృష్టిపెట్టండి
ఈరోజు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌తో సమాజంలోని అన్నిరంగాల్లో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ మార్పులను పసిగట్టడం, ఆరోగ్య సంరక్షణతోపాటు బయోటెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణల ద్వారా మానవ ఆయుర్దాయం పెంచే పరిశోధనలు జరుగుతున్నాయి. సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ సృజనాత్మకతతో నైతిక నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి. మీరు జీవిత లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు కీ ప్లేయర్‌గా ఉండటం నేర్చుకోండి. మీరు ఎప్పుడూ యంత్రంలో ఒకభాగంలా కాకుండా వ్యవస్థలో ఒక ముఖ్యమైన లీవర్‌గా ఉండాలి. ప్రపంచానికి కార్మికులు మాత్రమే కాదు, సృష్టికర్తలు కూడా అవసరం. ఉత్తమ ఆవిష్కరణలు మీ అభిరుచుల నుంచే పుడతాయి. జీవితంలో స్థిరపడేందుకు మీ అభిరుచికి తగ్గట్లుగా ఏ మార్గాన్నయినా ఎంచుకోండి. లక్ష్యాన్ని చేరుకునేందుకు బాధ్యతతో ధైర్యంగా ముందుకు సాగాలని మంత్రి లోకేష్‌ అన్నారు.

స్ఫూర్తిప్రదాతల పుట్టినిల్లు మచిలీపట్నం
దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ట్రేడిరగ్‌ పోర్టు టౌన్‌ మచిలీపట్నం. వాణిజ్యం, సంస్కృతి, కళలు, విద్యారంగంలో మార్గదర్శకులను, స్వాతంత్య్ర సమరయోధులను అందించిన నేల మచిలీపట్నం. ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యూరోపియన్లతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ఎందరో వ్యాపారులు ఇక్కడకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన తొలి మునిసిపాలిటీల్లో మచిలీపట్నం(1866) ఒకటి. ఇక్కడ స్థాపించిన నేషనల్‌ కాలేజ్‌ 1906 నాటి వందేమాతరం ఉద్యమానికి పుట్టినిల్లు. మచిలీపట్నం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమైంది. జాతీయజెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, కృష్ణాపత్రిక సంపాదకలు ముట్నూరి కృష్ణారావు, అన్న నందమూరి తారకరామారావు ఈ జిల్లాకు చెందినవారే. కూచిపూడి నృత్య రూపం, కలంకారీ కళకుఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. దీనికి జీఐ ట్యాగ్‌ కూడా వచ్చింది. బందర్‌ లడ్డూ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. 1964 నాటి దివిసీమ ఉప్పెన పట్టణ జనాభాలో 50% మందిని (సుమారు 30,000 మందిని) పొట్టన పెట్టుకుంది. ఆ తర్వాత పలుమార్లు తీవ్ర తుఫానులు కూడా వచ్చాయి. అన్నిటినీ తట్టుకుని సమున్నతంగా నిలబడిరదని మంత్రి లోకేష్‌ అన్నారు.

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ మెరుగుపర్చాలి
కృష్ణా విశ్వవిద్యాలయం 2008లో ఏర్పాటయింది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో 2000 మంది విద్య నభస్యసిస్తుండగా, 134 అనుబంధ కళాశాలలలో సుమారు 30,000 మంది విద్యార్థులకు సేవలు అందిస్తోంది. 2024-25లో కృష్ణా వర్సిటీ క్యాంపస్‌లో విద్యనభ్యసించిన విద్యార్థులు 100% ప్లేస్‌మెంట్‌ సాధించిన విషయం తెలుసుకుని ఎంతో ఆనందించాను. అయితే అనుబంధ కళాశాలలు గత విద్యా సంవత్సరంలో 50-60% ప్లేస్‌మెంట్‌ మాత్రమే సాధించాయి. 2017లో విశ్వవిద్యాలయం ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో 151-200 బ్యాండ్‌లో స్థానం సంపాదించినప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ర్యాంకింగ్‌లో వెనుకబడిరది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ను 100 కంటే తక్కువకు తీసుకువచ్చేందుకు తక్షణం చర్యలు ప్రారంభించాలని వర్సిటీ పాలకమండలిని మంత్రి నారా లోకేష్‌ కోరారు.

Previous Post

దేశానికే గర్వకారణం

Next Post

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన అనలాగ్‌ ఆస్ట్రోనాట్‌ దంగేటి జాహ్నవి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026

కార్యకర్త
@ February 24, 2026
ఉగాదికి మరో డీఎస్సీ?
ఆంధ్రప్రదేశ్

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

చైతన్యరధం
@ February 24, 2026
బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

క్రికెట్ మ్యాచ్ చూస్తానంటే జగన్‌టూ టికెట్ తీస్తా

చైతన్యరధం
@ February 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-02-2026

కార్యకర్త
@ February 23, 2026
దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే
ఆంధ్రప్రదేశ్

దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

చైతన్యరధం
@ February 23, 2026
జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి అసలు చిరునామా మేమే

చైతన్యరధం
@ February 23, 2026
టార్గెట్.. హైస్పీడ్ నెట్
ఆంధ్రప్రదేశ్

టార్గెట్.. హైస్పీడ్ నెట్

చైతన్యరధం
@ February 23, 2026
Load More

ముఖ్య వార్తలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
టార్గెట్.. హైస్పీడ్ నెట్

టార్గెట్.. హైస్పీడ్ నెట్

చైతన్యరధం
@ February 23, 2026
వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఉగాదికి మరో డీఎస్సీ?

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

చైతన్యరధం
@ February 24, 2026
బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

క్రికెట్ మ్యాచ్ చూస్తానంటే జగన్‌టూ టికెట్ తీస్తా

చైతన్యరధం
@ February 24, 2026
దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

చైతన్యరధం
@ February 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist