చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

శాస్త్రీయంగా క్రాప్‌ ప్లానింగ్‌

పంటలు, గిట్టుబాటు ధరలపై ఉప సంఘంతో సమీక్షించిన సీఎం

by చైతన్యరధం
May 23, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
శాస్త్రీయంగా క్రాప్‌ ప్లానింగ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పంటలవారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలి
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టిపెట్టండి
ఏ పంటలు సాగు చేయాలో రైతులకు ముందే చెప్పాలి
డిమాండున్న పంటలను సూచిస్తే రైతులు నష్టపోరు
పొగాకు, కోకోను కంపెనీలే కొనుగోలు చేసేలా చర్యలు
మద్దతు ధరకన్నా తగ్గితే.. రైతుల్ని నేరుగా ఆదుకోవాలి
ఈ ఏడాది హెచ్డీ బర్లే పొగాకు రకానికి క్రాప్‌ హాలిడే
ప్యూర్‌ జ్యూస్‌లపై జీఎస్టీ తగ్గింపునకు కృషి
మిడ్‌ డే మీల్స్‌, టీటీడీ ప్రసాదంగా మ్యాంగో జ్యూస్‌
పంటలు, గిట్టుబాటు ధరలపై ఉప సంఘంతో సమీక్షించిన సీఎం
రైతాంగ సమస్యపై కేంద్ర మంత్రులతో చర్చించనున్న చంద్రబాబు

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో పంటల సాగు అనేది జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్‌కు అనుగుణంగా జరగాలని, ఇందుకు సంబంధించి పంటలవారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్‌- సప్లయ్‌ మధ్య సమతూకం ఉంటుందన్నారు. అలాగే కేవలం డిమాండ్‌ ఉన్న పంటల్ని మాత్రమే సాగు చేస్తే రైతులు నష్టపోకుండా పోకుండా ఉంటారన్నారు. క్రాప్‌ ప్లానింగ్‌ అనేది చాలా శాస్త్రీయంగా జరగాలని, జాతీయ అంతర్జాతీయ ప్రరిణామాలు, మార్కెట్లు, దిగుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్టీజీఎస్‌, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్‌ సబ్‌ కమిటీ దృష్టిపెట్టాలన్నారు. కమిటీలోకి కొత్తగా మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, రామానాయుడును సభ్యులుగా తీసుకున్నారు. పొగాకు, కోకో, మామిడి, ధాన్యం రైతుల సమస్యలపై సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం అధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

అవసరాన్నిబట్టి ప్రభుత్వం ద్వారా కోకో కొనుగోళ్లు
రైతుల దగ్గర ఉన్న కోకో పంట నిల్వలను కేజీ రూ.500కు కంపెనీల ద్వారా కొనుగోలు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రూ.500 కన్నా తక్కువకు రైతులు పంట అమ్మాల్సిన అవసరం లేదని… అవసరమైతే ప్రభుత్వం ద్వారా నేరుగా కొనుగోలు జరపాలని చెప్పారు. ప్రస్తుతం 1,200 మెట్రిక్‌ టన్నుల నుంచి 1500 మెట్రిక్‌ టన్నుల కోకో నిల్వలు ఉన్నాయని… వీటిలో 600 మెట్రిక్‌ టన్నులు మాత్రమే రైతుల దగ్గర ఉన్నాయని వాటిని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

హెచ్‌డి బర్లే పొగాకు నిల్వల వివరాల నమోదు
సుమారు 20,000 మిలియన్‌ కేజీలమేర రాష్ట్రంలో రైతుల దగ్గరున్న హెచ్డీ బర్లే పొగాకు నిల్వలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. డిమాండ్‌ లేనందున రైతులు నష్టపోకుండా ఉండడానికి ఈ ఏడాది హెచ్‌డి బర్లే పొగాకు రకానికి క్రాప్‌ హాలిడే ప్రకటిస్తున్నట్టు అధికారులు చెప్పారు. రైతుల దగ్గర హెచ్డీ బర్లే రకం పొగాకు నిల్వలు ఎంత ఉన్నాయనే దానిపై యాప్‌ ద్వారా కచ్చితమైన వివరాలు సేకరించాలని చెప్పారు. టొబాకో బోర్డులో ఇందుకు సంబంధించి సెల్‌ ఏర్పాటు చేసి రోజువారీ కొనుగోలు వివరాలను నమోదు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు హెచ్డీ బర్లే, వైట్‌ బర్లే రకాలను టొబాకో బోర్డులో చేర్చాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర వాణిజ్య మంత్రికి లేఖ రాశారు. అలాగే ఈ వారం తన ఢల్లీి పర్యటనలో కేంద్ర మంత్రులతో రైతాంగ సమస్యలపై చర్చిస్తానని సీఎం తెలిపారు.

మ్యాంగో జ్యూస్‌ వినియోగం పెంచేలా చర్యలు
మ్యాంగో పల్ప్‌కు సంబంధించి ఆర్డర్లు రాకపోవడంతో మామిడి రైతులు ఆందోళన చెందకుండా తక్షణమే పల్ప్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు కొనుగోలు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అయితే పాతనిల్వలు కంపెనీల దగ్గర మిగిలి పోవడంతో కొత్తగా కొనుగోలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందని అధికారులు వివరించారు. అలాగే పల్ప్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం కూడా ఇందుకు కారణమైందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి పల్ప్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా అధికారులు చూడాలని సీఎం అన్నారు. ప్యూర్‌ జ్యూస్‌లపై సైతం కేంద్ర ప్రభుత్వం 40 శాతం జీఎస్టీ విధించడంతో మామిడి కొనుగోలు మందగించాయని… ప్యూర్‌ జ్యూసెస్‌కు జీఎస్టీ తగ్గించేలా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అలాగే మ్యాంగో పల్ప్‌ జ్యూస్‌ వినియోగం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్ధులకు అందించడంతో పాటు… తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ మ్యాంగో జ్యూస్‌ అందించే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

వరి, టొమాటా రైతుల సమస్యపైనా చర్చ
టొమాటో పంట గురించి కూడా ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో టొమాటో ప్రాసెసింగ్‌ యూనిట్లు పెరిగేలా ప్రోత్సహించి… రైతులు ఆశించిన ధర వచ్చేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్య లేదని, ఏ ప్రాంతాల్లో అయితే తడిచిన ధాన్యం ఉందో వాటిని కూడా కొనుగోలు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదండ్ల మనోహర్‌, గొట్టిపాటి రవి, రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

రమణాచార్యుల మరణం విచారకరం: సీఎం చంద్రబాబు

Next Post

ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

కార్యకర్త
@ April 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

కార్యకర్త
@ April 29, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు
ఆంధ్రప్రదేశ్

ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!
ఆంధ్రప్రదేశ్

విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist