స్వాతంత్య్ర సమరయోధులు, బ్రిటీషర్ల పాలిట సింహస్వప్నమైన అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా విద్యా మంత్రి నారా లోకేష్ నివాళి అర్పించారు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మరుపురానిదని, స్వాంతంత్య్రం పొందడానికి సాయుధపోరాటం ఒక్కటే మార్గమని నమ్మిన అల్లూరి.. తన పోరాటపటిమతో బ్రిటీష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారన్నారు. అల్లూరిలాంటి మహనీయుడు మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణమని, ఆయన ఆశయ సాధనకోసం ప్రతిఒక్కరం పునరంకితమవుదామని లోకేష్ పిలుపునిచ్చారు.