- జగన్ బిచ్చంతోనే జనం బ్రతకాలా?
- పేదలు సొంతకాళ్లపై నిలబడడం ఆ ముఠాకు ఇష్టంలేదా?
- డ్వాక్రా పేరుతో చంద్రబాబు మహిళల్ని చెడగొడుతున్నారని ఆరోజు నిందించలేదా?
- నేడు 60 వేల కోట్ల బ్యాంకు లావాదేవీలతో.. కోటిమంది డ్వాక్రా మహిళలు సొంత కాళ్లపై నిలబడుతున్నది నిజంకాదా?
- ఏపీ ట్యాక్స్ పేయర్స్ సంఖ్యను రెండు రెట్లు కుదించిన ‘వర్ధెల్లి మురళి కుతంత్రం`17’
06.04.2025 ఆదివారం అవినీతి పుత్రిక ‘సాక్షి’ ఎడిట్ పేజీలో తమ యజమాని అవలక్షణాల్ని చంద్రబాబుకు అంటగడుతూ వర్ధెల్లి మురళి మరో భారీ వ్యాసం రాశారు. ఏరు దాటకముందు ఓడమల్లన్న… ఏరు దాటాక బోడిమల్లన్న అనే సామెత సరిగ్గా జగన్‌కు వర్తిస్తుందిగాని, మీరు చెప్పినట్టు చంద్రబాబుకు కాదు. మద్యనిషేధం హామీపై మాటతప్పి మడమ తిప్పారు. పైగా మీ అవినీతి కోసం విషపూరిత మద్యం పోసి 35 లక్షలమంది పేదల్ని రోగాలపాలు చేశారు. మూడు రెట్లు మద్యం ధరలుపెంచి, పేదల సంపాదన కొల్లగొట్టి, పేదల్ని నిరుపేదలుగా మార్చారు. రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం చేశారు. మెగా డిఎస్సీపై మొండిచేయి చూపి వేలాదిమంది యువతను ఆత్మహత్యలపాలు చేశారు. అలాగే గంజాయి, డ్రగ్స్ మాఫియాతో కుమ్మక్కయి యువతను నిర్వీర్యం చేశారు. ఇలా జగన్ మేనిఫెస్టోలో 85శాతం హామీలకు ఎగనామం పెట్టారు. అమ్మఒడికి రూ.13 వేలు ఇచ్చి నాన్న బుడ్డిలోనుంచి రూ.లక్ష కొట్టేశారు. డ్రైవర్‌కు రూ.10 వేలు ఇచ్చి.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి రూ.లక్ష కొట్టేశారు. మత్స్యకారునికి రూ.10 వేలు ఇచ్చి, చెరువులపై వారికి ఉన్న హక్కుల్ని తొలగిస్తూ జీవో నెంబర్ 217 తెచ్చారు. ఇలా నవరత్నాల్ని నవమోసాలు చేశారు. ఇవీ బోడి మల్లన్నకు అతికే సత్యాలు!
కోతల గాంభీర్యమేగాని కుప్పంలో విత్తులులేని డీబీటీ
డీబీటీికి రూ.2.73 వేల కోట్లు ఇచ్చి పేదల్ని ఉద్ధరించినట్టు నాన్‌స్టాప్ కాకి గోల చేస్తున్నారు. పేదల్ని సొంత కాళ్లపై నిలబెట్టే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.లక్ష కోట్లు దారిమళ్లించారు. ఒక్క విషపూరిత మద్యంలోనే రూ.99 వేల కోట్లు పేదల సంపాదన కొల్లగొట్టారు. 9సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. డీజిల్, పెట్రోల్ ధరలు తారాస్థాయికి పెంచారు. ఇలా ధరలు, పన్నులు, చార్జీల బాదుడుతో వేలకోట్లు పేదలవద్ద పిండుకున్నారు. ఇలా పది రూపాయలిచ్చి.. పేదలవద్ద వంద కొట్టేశారు. పేదల పేరుతో ఆరు లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. సెంటు పట్టా పేరుతో రూ.7 వేల కోట్లు అవినీతి చేశారు. 5 లక్షల ఎకరాలకుపైగా పేదల అసైన్‌మెంట్ భూములు కబ్జా చేశారు. విదేశీ విద్య రద్దు చేశారు. పేదలు సొంత కాళ్లపై నిలబడే పథకాల్ని రద్దు చేశారు. పేదల్ని నిరుపేదలుగా చేసి.. మాయమాటలతో మభ్యపెట్టడమే డీబీటీపై చేసే అతి ప్రచారం. మాయమాటలకు, కపట ప్రేమలకు పేదలు ఎల్లకాలం మోసపోరు. తగిన శాస్తి చేశారు. భవిష్యత్తులో కూడా చేస్తారు.
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే ‘పీ-4’ తెచ్చారనేది పచ్చి అబద్ధం
సూపర్-6లో భాగంగా ఇప్పటికే కోటిమందికి పైగా మహిళలు గ్యాస్ తీసుకుంటున్నారు. జులై నెలలోపు ఎంతమంది పిల్లలుంటే వారందరికీ ‘తల్లికి వందనం’ ఇవ్వబోతున్నారు. మత్స్యకారులకు వేట నిషేద భృతి రూ.20 వేలు ఇవ్వబోతున్నారు. ఈనెల నుండే 16,347 ఉపాధ్యాయ నియామకాలకు డిఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు.
ప్రతి నెలా పింఛన్లకే చంద్రబాబు ప్రభుత్వం రూ.1.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. అన్న క్యాంటిన్ల ద్వారా వేలాదిమంది పేదలు ఆకలి తీరుస్తోంది. ఉచిత ఇసుక విధానం ద్వారా 40 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పనితోపాటు 125 వృత్తులు, వ్యాపారాలు లబ్ది పొందుతున్నాయి. నాణ్యమైన మద్యం ద్వారా పేదల ఆరోగ్యాలు కాపాడబడుతున్నాయి. ధాన్యం సేకరించిన 24 గంటల్లో నిధులు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. ఇప్పటికే రూ.7 లక్షల కోట్ల పెట్టబడులు ఆకర్షించి 4 లక్షల మందికి ఉద్యోగ కల్పనకు అవకాశాలు కల్పించారు. ఇక పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంది. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపబడిరది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించకుండా స్వయం ఉపాధి ప్రారంభమైంది. ఇలా 9 నెలల్లోనే 50 శాతానికి పైగా మేనిఫెస్టో హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ఐదేళ్లలో జగన్ 85శాతం హామీలకు ఎగనామం పెట్టారు. ఏపీలోగాని, దేశంలోగాని ఏ పార్టీ కూడ మొదటి ఏడాదే మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేసిన పరిస్థితి లేదు. జగన్ మొదటి ఏడాది అమలు చేసిన హామీలకన్నా కూటమి ప్రభుత్వం ఎక్కువరెట్లే హామీలు అమలు చేసింది. సూపర్-6లోని ప్రతి హామీ అమలు చేసి తీరుతుంది.
పీ-4 అంటే జగన్ ముఠాకు ఎందుకంత వణుకు?
పేదరికంలేని సమాజ నిర్మాణం గొప్ప సంకల్పం. ఇందుకు పెద్దమనసు ఉంటే చేయూతనివ్వాలిగానీ దానికి విరుద్ధంగా జగన్ ముఠా ఎందుకు విషం కక్కుతోంది? అబద్ధపు ప్రచారం ఎందుకు చేస్తోంది? పేదరికం శాశ్వతంగా ఉండాలని, వారు తనపై ఆధారపడి బతకాలని, సొంత కాళ్లపై పేదలు నిలబడకూడదనేది జగన్ రెడ్డి ఫ్యూడల్, ఫ్యాక్షనిస్టు సిద్ధాంతం. పేదలకు బిస్కెట్లు వేసి అధికారానికి వచ్చి రాష్ట్ర సహజ వనరులు, ప్రభుత్వ ఖజానాను లక్ష కోట్లు కొల్లగొట్టడం జగన్ కుటుంబ మార్క్ రాజకీయం. తెలుగు వారు ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలనేది చంద్రబాబు మార్క్ విజన్. నూటికి 80 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదలు పేదరికంలో మగ్గుతూ అశాంతికి గురైతే ఎవరికీ రక్షణ ఉండదు. రాష్ట్రం ప్రగతి సాధించలేదు. కనుక కేంద్ర జాతీయ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎండీపీఐ) ప్రకారం ఏపీలో 7.2 శాతం పేదలు అంటే 20 లక్షలమంది ఉన్నారు. ముందుగా ఈ కుటుంబాలను అభివృద్ధి చేయాలనేది చంద్రన్న సంకల్పం. గతంలో జన్మభూమి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశారు. స్వర్ణాంధ్రవిజన్ 2047 లక్ష్యాలలో భాగంగా నేడు కుటుంబాల్ని అభివృద్ధి చేయుటకు ‘మార్గదర్శి- బంగారు కుటుంబం’ అమలుకు కృషి చేస్తున్నారు. సదుద్దేశం ఉండేవాళ్లయితే ఒకటి, రెండేళ్లు చూసి దానిపై విమర్శలు చేయాలిగాని ప్రారంభంలోనే దానిపై దుష్ప్రచార దాడి దురుద్దేశం కాదా?
ఏపీలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న అధికాదాయవారు 8 లక్షల మంది అన్న జగన్ మాట అబద్ధం. నేడు ఏపీలో 22 లక్షలకు పైగా అధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారున్నారు. వీరితోపాటు లక్షలాదిమంది తెలుగు ఎన్నారైలు ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో స్థిరపడి మంచి స్థానంలో ఉన్న తెలుగు ప్రముఖులున్నారు. వీరందరిని భాగస్వాముల్ని చేయడం ద్వారా 20 లక్షల పేద కుటుంబాల్ని పేదరికం నుండి ఉన్నతికి తీసుకరావడం సాధ్యమే. మనసుంటే మార్గం ఉంటుంది. అమరావతి అభివృద్ధి ద్వారా దాని చుట్టూ ఉన్న వేలాది పేదలు పేదరికం నుండి బయట పడతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల నిధులు దారి మళ్లించకుండా స్వయం ఉపాధి పథకాలు అందించడం ద్వారా రాబోయే ఐదేళ్లు కొన్ని లక్షల మంది పేదలు పేదరికం నుండి ఉన్నత స్థితికి వస్తారు. 20 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ ద్వారా వచ్చే ఉద్యోగాలు, ఉపాధి పేదల అభివృద్ధికి దోహదపడుతుంది. ఇలా ఎన్నో విధాల 20 లక్షల పేదల అభివృద్ధితోపాటు రాష్ట్ర అభివృద్ధి కూడా సాధ్యమే. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోటిమంది డ్వాక్రా అభివృద్ధి మన కళ్లుముందు ఉంది.
తెల్లకార్డులు కోటి నలభై ఎనిమిది లక్షలు ఉన్నాయన్న జగన్ రెడ్డి తన పాలనలో ఆ కార్డులు ఉన్నవారందరికీ నవరత్నాలు ఎందుకు ఇవ్వలేదు? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం రాష్ట్రంలో ఉన్న పేదలు సుమారు 20 లక్షలమంది మాత్రమే.
పేదల్ని అవమానించింది.. హత్యలు చేసింది జగన్ ముఠానే
చంద్రబాబు పేదల్ని అవమానించారనేది వాస్తవాల్ని వక్రీకరించి చూసే అబద్ధపు ప్రరాచమే. రైతు బిడ్డలు చదువుకోవాలని చంద్రబాబు అంటే దాన్ని వక్రీకరించి ముందు, వెనుక మాటలు కత్తిరించి వ్యవసాయం దండగ అన్నారని దుష్ప్రచారం చేశారు. ఇలాంటివే మిగిలిన ఆరోపణలు కూడా.
జగన్ పాలనలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని నిలబెట్టి మంత్రులు కుర్చీలో కూర్చొన్నారు. బీసీ మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ.. వైవి సుబ్బారెడ్డి ముందు మోకరిల్లజేశారు. జగన్ కూర్చొని వుంటే బీసీ, ఎస్సీ మంత్రులంతా ముని కాళ్లపైనే నిలబెట్టేవారు. 5 లక్షలకు పైగా పేదల అసైన్‌మెంట్ భూములు కబ్జా చేశారు. లక్ష కోట్లు సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. ప్రశ్నించిన బీసీ, పస్సీ, ఎస్టీ వర్గాలవారిని 600లకు పైగా హత్యలు చేశారు. దుర్మార్గ లక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి తాము తప్పించుకోవడానికి చెప్పిన అబద్ధమే వందసార్లు చెబుతున్నారు.
రైతు ద్రోహి జగన్
వైఎస్ పాలనలో 14,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్ పాలనలో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు పాస్ పుస్తకాలపై, పొలాలపై ఆయన బొమ్మలు వేసుకున్నారు. చంద్రబాబు పాలనలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గించారు. రైతు బాంధవుడు చంద్రబాబు.. రైతు ద్రోహి జగన్!!
గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్