చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ప్రజలే ముందు.. తర్వాతే ఏదైనా

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేత

by చైతన్యరధం
April 2, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రజలే ముందు.. తర్వాతే ఏదైనా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పేదల కోసం సంపద సృష్టిస్తా
  • పేదరికం నిర్మూలనకే పీ`4 తెచ్చాం
  • గత ప్రభుత్వ బటన్లు.. మన పెన్షన్లకు సాటిరావు
  • అనవసర విమర్శకులను ప్రజలే నిలదీయాలి
  • ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వేస్తా
  • స్కూళ్లు తెరిచేనాటికి నియామకాలు పూర్తిచేస్తాం
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి
  • కొత్తగొల్లపాలెంలో పేదల సేవలో పొల్గొన్న సీఎం
  • లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేత

బాపట్ల (చైతన్య రథం): సంపద సృష్టించి పేదల సంక్షేమానికి వెచ్చిస్తామని, పేదరిక నిర్మూలనకు పీ`4 విధానంతో శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలే ముందు.. తర్వాతే మిగిలినవాటికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడిరచారు. మంగళవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి.. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.

వారు నొక్కిన బటన్లు మనమిచ్చే పెన్షన్లతో సమానం
బటన్లు నొక్కామని కొందరు గొప్పగా చెప్పుకుంటున్నారని, వారునొక్కిన బటన్లు మనమిచ్చే పెన్షన్లతో సమానమన్నారు. అనవసర విమర్శలు చేసేవారిని ప్రజలు నిలదీయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక. రాష్ట్రంలో టీడీపీ ఇంత బలంగా ఉందంటే అందుకు వెనుకబడిన వర్గాలే కారణం. 43 ఏళ్లుగా టీడీపీ జెండా మోసింది బలహీన వర్గాలే. బెదిరించినా భయపడకుండా ఎదురొడ్డి పోరాడారు. జెండా మోశారు. పార్టీని ఆదుకున్న వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని

సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అసమర్థ ప్రభుత్వంలో అప్పులే మిగిలాయి
గత ప్రభుత్వ అసమర్థ పాలన ఎలా ఉందో అందరం చూశాం. రాష్ట్రాన్ని సర్వనాశం చేసిపోయారు. రూ.10 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చింది. ఓవైపు సంక్షేమం, అభివృద్ధి చేస్తూనే మరోవైపు అసలు, వడ్డీ రెండూ కట్టాలి. సంపద సృష్టించి ఆదాయం పెంచి దాన్ని నిరంతరం పేదలకే ఖర్చు పెడతానని హామీ ఇస్తున్నా. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు మిత్రులు పవన్‌ కల్యాణ్‌, నేనూ, బీజేపీ జతకట్టాం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

పేదల కళ్లలో ఆనందం చూస్తున్నా
నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో ప్రతి నెలా స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నాను. 28 రకాల పింఛన్లు ఇస్తున్నాము. మన దేశంలో ఒక్క పెన్షన్ల కిందే ప్రతి నెలా 63 లక్షల మందికి ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే రాష్ట్రం దేశంలో ఒక్క ఏపీనే. రూ.200 పింఛను రూ.2 వేలు చేసింది నేనే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ.3,000 పింఛను రూ.4000 వేలు చేశాను. డయాలసిస్‌ రోగులకు రూ.10 వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు పింఛను ఇస్తూ.. మానవత్వాన్ని చాటుకున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్టే పింఛన్లూ అందిస్తున్నాను. ప్రతి నెలా ఒకటిన ఉదయం 9 గంటలకే 80శాతం, తొలిరోజే 98శాతం మందికి పింఛన్లు పంపిణీ పూర్తి చేస్తున్న అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

పేదలకు ఆర్థిక భరోసా
కొందరి ఆదాయం కంటే పింఛను ద్వారానే ఎక్కువ వస్తోంది. ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లిన వారు పింఛను అందుకోలేకపోయేవారు. అలాంటి వారికి గత ప్రభుత్వంలో పింఛను ఇవ్వలేదు. కానీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో మూడో నెలలోనైనా పింఛను తీసుకునే అవకాశం కల్పించాము. అలా రెండు నెలలు వరుసగా పింఛను తీసుకోని వారు మన రాష్ట్రంలో 93,324 మంది ఉన్నారు. వీరికి పింఛను ఆపేస్తే ప్రభుత్వానికి రూ.74 కోట్లు మిగుల్తుంది. కానీ పేదలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ఆ సొమ్ము చెల్లిస్తున్నాము. అలాగే మూడు నెలలకూ పింఛను తీసుకోనివారు 16 వేలమంది ఉన్నారు. వారికీ రూ.14 కోట్లు చెల్లిస్తున్నాం. భర్త చనిపోయిన భార్యకు వెంటనే పింఛను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. పింఛన్లు పంపిణీని టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నాం. పింఛను ఇంటికి తెస్తున్నారా? లేదా? మర్యాదగా ఇస్తున్నారా? లేదా? అనే దానిపై నేను నిరంతరం మానిటరింగ్‌ చేస్తున్నాను. తెలంగాణలో రూ.2,016, తమిళనాడులో రూ.1000, కేరళలో రూ.1600, కర్ణాటకలో రూ.600, యూపీ, ఒడిశాలో రూ.500 చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. సంక్షేమం ఇవ్వలేదనే వారికి ఇదే సమాధానమని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌
రాజధాని అమరావతి పనులకు శ్రీకారం చుట్టాం. నాలుగేళ్లలో అమరావతికి పూర్వ వైభవం తెస్తాం. ఏపీ జీవనాడి పోలవరం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 2027నాటికి పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. రాష్ట్రవ్యాప్తంగా 200కి పైగా అన్నక్యాంటీన్లు పెట్టి పేదలకు భోజనం పెడుతున్నాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు మంజూరు చేసింది. విశాఖకు రైల్వే జోన్‌ వస్తోంది. గత ఐదేళ్లూ రోడ్లు ఎలా ఉన్నాయో చూశారు. ఆ గుంతల రోడ్లలో ఆస్పత్రికి వెళ్తూ దారి మధ్యలోనే గర్భిణీ డెలివరీ అయిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పటికే రోడ్ల మరమ్మతులు చేపట్టాం. భవిష్యత్‌లో రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోతాయి. ఈ నెలలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇచ్చి జూన్‌లోగా కొత్త టీచరు పోస్టులు భర్తీ చేస్తాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం. ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ మే నెలలో తల్లికి వందనం ఇస్తాం. దీపం`2 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలండర్లు ఏడాదికి 3 ఇస్తున్నాం. కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలిపి రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు వేస్తాం. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఈనెలలోనే మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తాం. నేను తెచ్చిన డ్వాక్రా సంఘాలు నేడు ఒక వ్యవస్థగా మారడం గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు.

అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు
47 ఏళ్లుగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. సమైక్యాంధ్రలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా, నవ్యాంధ్రలో ఆరో ఏడాది ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. ఇది నాకు ప్రజలిచ్చిన అరుదైన గౌరవం. ఏ నాయకుడికీ ఈ అవకాశం దొరకలేదు. పేదరికం లేని సమాజమే నా ఆశయం. సంపద కొందరికే పరిమితం కాకూడదు. ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందినప్పుడు సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగానే పీ`4 కార్యక్రమం రూపొందించాం. సమాజంలో ఉన్నతంగా ఉన్న 10 శాతం సంపన్న వర్గాలు సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేద కుటుంబాలను ఆదుకుని వారి అభ్యున్నతి కొరకు స్వచ్ఛందంగా ముందుకురావాలి. పేద కుటుంబాలను ఆదుకునేవారు మార్గదర్శిగా, సాయం అందుకున్నవారు బంగారు కుటుంబంగా పరిగణించబడతారు. ఎన్టీఆర్‌, అంబేద్కర్‌, అబ్దుల్‌ కలాం సహా ఎవరూ పుట్టుకతోనే గొప్పవారిగా పుట్టలేదు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని మహోన్నత వ్యక్తులుగా ఎదిగారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇల్లు, పింఛను, మంచి నీటి కుళాయి, కరెంటు, మరుగుదొడ్లు, డ్రైనేజ్‌, ఇంటర్నెట్‌వంటి సౌకర్యాలు కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

మార్గదర్శులకు సీఎం అభినందన
పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చిన విక్రమ్‌ నారాయణరావు, వసంత శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు అభినందించారు. దాతలిద్దరూ చెరో 15 కుటుంబాలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకోనున్నారు.

పర్చూరు నియోజకవర్గానికి సీఎం వరాలు
పర్చూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును మనస్పూర్తిగా అభినందిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు షిప్‌ బిల్డింగ్‌, షిప్‌ రిపేరింగ్‌ ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వంనుంచి అన్ని విధాలా సహకరిస్తామని సీఎం చెప్పారు. అలాగే నాగార్జునసాగర్‌ కాలువ ఆధునీకరణ పనులు, నూతన ఎన్సీపీ కార్యాలయం, షాదీఖానాలు, దర్గాల ఆధునీకరణ పనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణం, బీసీ, ఓసీలకు శ్మశాన వాటికల నిర్మాణం, రూ.9 కోట్ల 10 లక్షల వ్యయంతో జాతీయ రహదారి నుంచి వలపర్ల ఇండస్ట్రియల్‌ పార్క్‌కు డబుల్‌ రోడ్డు, వలపర్ల గ్రామంలో వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌, ఇంకొల్లు-మార్టూరు-పర్చూరులో ఆటోనగర్‌ ఏర్పాటుకు అనుమతులు, కొమ్మూరు కాలువ భూసేకరణకు రూ.5 కోట్లు మంజూరు, పర్చూరు-కారంచేడు- ఇంకొల్లు-చినగంజాంలో మూడు వ్యవసాయ మార్కెట్లు, ఇంకొల్లులో డ్రైనేజ్‌ సమస్య పరిష్కారం సహా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పేదలకు వైద్యానికి ఆర్థిక సాయం వంటి అన్ని పనులకూ ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు వరాలు కురిపించారు.

పోలీసువై ప్రజల్ని రక్షించాలి
కొత్తగొల్లపాలెంలో మానసిక దివ్యాంగురాలైన వడ్లమూడి సుభాషిణి ఇంటికి పింఛను అందించేందుకు సీఎం వెళ్లారు. సుభాషిణి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతోపాటు ఆమె తల్లికి ఒంటరి మహిళ పెన్షన్‌ మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుభాషిణి చెల్లెలు భరణిని ఏం చదువుకుంటున్నావ్‌, ఏం కావాలనుకుంటున్నావని సీఎం అడిగారు. భరణి సమాధానమిస్తూ.. తనకు పోలీస్‌ అవ్వాలని ఉందని చెప్పింది. జనాల్ని బాగా కొట్టొచ్చని పోలీస్‌ అవుదామనుకుంటున్నావా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వుతూ చమత్కరించారు. పోలీసువై ప్రజల్ని కాపాడాలని సీఎం ఆశీర్వదించారు. చదివించుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని కుటుంబ సభ్యులు తెలపగా ఆమెను కస్తూర్బాగాంధీ పాఠశాలలో చేర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇష్టపడి చదువుకోవాలి
మరో లబ్ధిదారు బత్తుల జాలమ్మ గృహానికి వితంతు పెన్షన్‌ పంపిణీ చేశారు. జాలమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరడంతో చూసి చలించిపోయిన సీఎం వెంటనే గృహాన్ని మంజూరు చేయడంతో పాటు గ్యాస్‌ కనెక్షన్‌ కూడా ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కునేందుకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏం చదవు కుంటున్నావని జాలమ్మ చిన్న కుమారుడుని ప్రశ్నించగా పదవ తరగతి మధ్యలో నిలిపేశానని చెప్పారు. చదువుకుంటావా? అని సీఎం అడగ్గా… చదువు రాదని అతను తిరిగి సమాధానం ఇచ్చాడు. ఎందుకు రాదు, మేమంతా వచ్చి చదువుకున్నామా, ఇష్టపడి చదవుకున్నాం అని చంద్రబాబు అన్నారు. చదవు రాదని మనసులో పడితే రాదని, వస్తుందంటే వస్తుందని ధైర్యం చెప్పారు. ఎప్పుడూ గొర్రెలు మేపడమే కాదు, పైస్థాయికి రావాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Previous Post

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ బలోపేతానికి కార్యాచరణ

Next Post

అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

November 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

November 17, 2026
రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం
ఆంధ్రప్రదేశ్

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

November 17, 2026
రామోజీ సేవలు దేశానికి స్పూర్తి
ఆంధ్రప్రదేశ్

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

November 17, 2026
తెలుగు జాతి కీర్తి రామోజీ
ఆంధ్రప్రదేశ్

తెలుగు జాతి కీర్తి రామోజీ

November 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026

November 16, 2026
Next Post
అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు!

అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు!

ముఖ్య వార్తలు

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

తెలుగు జాతి కీర్తి రామోజీ

తెలుగు జాతి కీర్తి రామోజీ

by చైతన్యరధం
November 17, 2026

అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

by చైతన్యరధం
November 15, 2026

గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

by కార్యకర్త
November 18, 2026

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

by కార్యకర్త
November 17, 2026

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు,...

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.