- పరిశుభ్ర, ఆరోగ్య, హరితాంధ్రప్రదేశ్ లక్ష్యం
- స్వర్ణాంధ్ర సాధనకు సమన్వయంతో కృషిచేయాలి
- ప్రభుత్వ ప్రధానకార్యదర్శి విజయానంద్ ఆదేశం
అమరావతి(చైతన్యరథం): స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని శాఖలను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రకు సంబంధించి కార్యక్రమాల ఖరారుపై గురువారం సచివాలయం నుంచి ఆయన కార్యదర్శులు, శాఖా ధిపతులతో వీడియో సమావేశం నిర్వహించారు. మూడో శనివారం క్రమం తప్పకుండా స్వచ్ఛాంధ్ర దివస్‌ను నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. విజన్ 2047 కింద పరిశుభ్ర, ఆరోగ్య, హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిద్దేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, వాటి అమలు చేయడం ద్వారా లక్ష్య సాధనకు కృషి చేయాలని స్పష్టం చేశారు.
పర్యావ రణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవ డంతో పాటు వాటి స్థానంలో పర్యావరణ హితమైన విధానంలో గ్లాసులు, కప్పులు, ప్లేట్లు, క్యారీ బ్యాగులు తయారీకి చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇందుకు చేనేత జౌళి శాఖ తగిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ఎంఎస్‌ఎంఈ, ఖాదీ గ్రామీణ పరిశ్ర మల బోర్డు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ల ద్వారా వాటిని ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేశ్‌కుమా ర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల గురించి వివరించారు. స్వచ్ఛాంధ్ర అనేది స్వర్ణాంధ్ర విజన్ 2047కు తొమ్మిదో పిల్లర్‌గా పేర్కొ న్నారు. దీనిలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల గృహాలలో పరిశుభ్రతను పాటించ డం, వ్యర్ధాల నిర్వహణ, రీసైక్లింగ్‌కు ఉత్తమ విధానాలు అవలంభించేలా చర్యలు చేపట్టా లని తెలిపారు.
మున్సిపల్ పరిపాలన శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటక శాఖతో పాటు అన్ని శాఖలు ఉమ్మడిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్‌రెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ జి.సంపత్‌కుమార్, న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి, స్వచ్ఛాం ధ్ర కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి దశరథరామిరెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు. వర్చువల్‌గా వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, వివిధ శాఖల కార్యదర్శు లు, శాఖాధిపతులు పాల్గొన్నారు.