- తప్పు చేసినవాళ్లు శిక్షలనుంచి తప్పించుకోలేరు
- యజ్ఞశాలవద్ద చెప్పులేసుకున్న ఘనుడా.. కూటమిని విమర్శించేది
- బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ ధ్వజం
అమరావతి (చైతన్య రథం): చొక్కా వేసుకొని వెళ్లని యజ్ఞశాలవద్ద చెప్పులేసుకుని వెళ్లిన ఘనుడు జగన్ అని బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ జగన్‌పై విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… ‘ఒకసారి ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తానని జగన్ చెప్పి చెప్పులేసుకొని యజ్ఞశాలకు వెళ్లిన వ్యక్తి. వైసీపీ నేతల పాపాలు… పుట్టలోని పాముల్లా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గుడ్లగూబ ఏవిధంగా వెలుగును చూడలేదో అదేవిధంగా వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట్రాభివృద్ధిని చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. వైసీపీ పాల్పడిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి దుర్మార్గం ఇప్పుడు సిట్ అరెస్టులతో బయటపడిరది’ అని బుచ్చి రాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘40 ఏళ్ల నుండి కర్ణాటక ప్రభుత్వం టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. వాళ్ల ఆధ్వర్యంలో సరఫరా అయ్యే నందిని నెయ్యి కంపెనీని ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలి. నందిని అంటే దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో నడుపుతున్న సంస్థ. అనేక ప్రభుత్వాలు మారినా వారికే టెండర్ ఇచ్చేవారు. అన్ని ప్రభుత్వాలు బాధ్యతతో ప్రవర్తించాయి. జగన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించి వేరేవారికి టెండర్ ఇచ్చారు. ఇంట్లోనే దేవుడి సెట్టింగ్ వేసిన మహానుభావుడు జగన్. తన ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో వెంకటాయపాలెంలో దేవుడి గుడి ఉంది. అక్కడికి వెళ్లి దండం పెట్టుకొని రావచ్చు, ఉగాది సంబరాలు చేసుకోవచ్చు. కానీ దేవుడి గుడినే తన ఇంట్లో సెట్ వేసి.. పాపానికి ఒడిగట్టిన ఘనత జగన్‌కే దక్కుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌కు హిందువులపై, దేవుళ్లపై గౌరవం లేదని, చొక్కలు కూడా వేసుకోని యజ్ఞశాల వద్ద చెప్పులు వేసుకుని జగన్ తన దుర్గార్గ మనస్థత్వాన్ని బయటపెట్టుకున్నాడని దుయ్యబట్టారు. జగన్ ఐదేళ్ల పాలనలో జరగని అక్రమాలు లేవని, సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఆలయానికే మచ్చ తెచ్చాడన్నారు. వారు చేసిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటే వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా మాట్లాడుతున్నారని, బయటి బాగోతాలూ బయట పడుతుంటే వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోందన్నారు. తప్పు చేసిందేకాక ఎదురుదాడికి దిగుతూ కూటమి ప్రభుత్వంపై నిందలుమోపుతున్న వైసీపీ నేతలంతా జైలుకెళ్లక తప్పదన్నారు. వైసీపీ హయాంలో ఆలయాలకు జరిగిన అపచారాలను వివరిస్తూ.. తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఎక్కడైనా ఒక్క సంఘటనైనా అలాంటిది చోటుచేసుకుందా? అని నిలదీశారు. దేవాలయాలపైనా, దేవుళ్లపైనా, పూజార్లపైనా దాడులకు పాల్పడిన వైసీపీ నేతలు.. ప్రాయశ్చితాన్ని అనుభవిస్తూ కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ దుర్మార్గాలను బహిర్గతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని, పాపాలకు పాల్పడిన ఏ ఒక్కరూ శిక్షలనుంచి తప్పించుకోలేరని బుచ్చి రాంప్రసాద్ హెచ్చరించారు.