- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితురాలి ఫిర్యాదు
- టీడీపీ అనుకూలమన్న సాకుతో పెన్షన్లు పీకేశారు
- న్యాయం చేయాలని నాయకులకు వినతిపత్రాలు
- అర్జీలు స్వీకరించిన పల్లా, సంధ్యారాణి, అనురాధ
మంగళగిరి(చైతన్యరథం): జోగి రమేష్ అనుచరులు ముక్కంటి నారాయణ, బత్తు ల వెంకటయ్య, పవన్ నకిలీ డాక్యుమెంట్లతో తనకు స్థలాన్ని అమ్మి తన వద్ద డబ్బులు కొట్టేశారని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన బండారు పద్మ ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్ర మంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. మోసగించిన వారిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అర్జీలు స్వీకరించారు.
` తమకు గత టీడీపీ ప్రభుత్వంలో వచ్చే పెన్షన్‌ను వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్యాయంగా తొలగించిందని నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన డి.వెంకటస్వామి, రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తాము టీడీపీ సానుకూలపరులమనే కారణం తోనే తొలగించి దివ్యాంగుడు, వృద్ధులైన తమను తీవ్రంగా ఇబ్బందిపెట్టారని తెలిపారు. పింఛన్‌ను పునరుద్ధరించి ఆదుకోవాలని అర్జీ ఇచ్చారు.
` విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినకాడ గ్రామానికి చెందిన కిల్లా డ రాములమ్మ సమస్యను వివరిస్తూ కబ్జాదారుల ఆక్రమణలో ఉన్న తమ భూమిని సర్వే చేసి హద్దులు చూపించాలని వేడుకున్నారు. అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేసింది.
` ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం సింగపల్లి గ్రామంలో తాను కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయమంటే అధికారులు తిప్పుకుంటున్నారని.. సమస్యను పరిష్కరించి అధికారులు రిజిస్ట్రేషన్ చేసేలా చూడాలని పశ్చిమగోదావరి జిల్లా పసివె దల గ్రామానికి చెందిన బిక్కిన సీతారామయ్య విన్నవించుకున్నాడు.
` తన స్థలానికి దొంగ పట్టాలు పుట్టించి మంచు ఫణీంద్ర అనే ప్రభుత్వ ఉద్యోగి మచ్చు వెంకటేశ్వరరావు పేరుతో లోన్లు తీసుకున్నారని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కోనా పుణ్యకుమారి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసి నిలదీస్తే ఒంటరి మహిళనైన తనపై దౌర్జన్యానికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అభ్యర్థించింది.
` సర్వే నెంబర్ 244/1 లో ఉన్న డొంక దారిని కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని గుంటూరు జిల్లా తెనాలి మండలం బర్రిపాలెం గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. దాంతో రైతుల పొలాలకు వెళ్లేందుకు దారి లేకుండా ఇబ్బం దిగా మారుతుందని.. దయచేసి అధికారులు సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్క రించాలని ప్రాధేయపడ్డారు.
` ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా దాదాపు 1000 మంది పని చేస్తున్నామని.. తమకు గత ప్రభుత్వం జీతాలను నిలిపి ఇబ్బంది పెట్టిందని శ్రీకాకు ళం జిల్లా సంతబొమ్మాలికి చెందిన చల్లా జగ్గారావు తెలిపారు. తమకు రావాల్సిన జీతాలు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.
` ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తుందన్న నమ్మకంతో తాను ఎం ఫార్మసీ చేరి పూర్తి చేశానని..అయినా గత ప్రభుత్వం ఫీజు ఇవ్వలేదని గుంటూరు జిల్లా పిడు గురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన వల్లపు భాగ్యవతి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఫీజు కట్టుకోలేని పరిస్థితి ఉందని.. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.
` తనకు ప్రభుత్వం మంజూరు చేసిన డీ పట్టా భూమిని తోకల నీలకంఠే శ్వరరావు, తోకల నీలయ్యలకు ఆక్రమించుకున్నారని గుంటూరు జిల్లా అచ్చంపెట మండలం నిండుజర్ల గ్రామానికి చెందిన పిల్లగొర్ల నాగరత్నం ఫిర్యాదు చేశారు. వారి నుంచి తన భూమిని విడిపించాలని విజ్ఞప్తి చేశారు.
` జనరల్ వైద్య విద్యార్థులకు రూ.25000 స్టై ఫండ్ ఇస్తూ తమకు మాత్రం రూ.7000 వేలతో సరిపెడుతున్నారని ఏపీ వెటర్నీ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్‌కు సంబంధించిన పలువురు విద్యార్థులు తెలిపారు. దయచేసి తమకు కూడా ప్రభుత్వం రూ.25000 వేలు స్టైఫండ్ ఇవ్వాలని అభ్యర్థించారు.