విజయవాడ(చైతన్యరథం): హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలతో విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షించారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత, కదిరి ఎమ్మెల్యే కందికోట వెంకటప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే రాజు, హిందూపూర్ ఎమ్మెల్యే ప్రతినిధి శ్రీనివాసరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. గత ఐదేళ్ల పాలనలో హంద్రీనీవాకు అర బస్తా సిమెంట్, ఒక రూపాయి కూడా జగన్ ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టులో ఉన్న పంపులను కూడా పూర్తి సామ ర్థ్యంతో ఉపయోగించుకోలేకపోయారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2629 కోట్లతో చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టు పనులు ప్రారంభించారని తెలిపారు.