- విలువల్లేని జగన్‌రెడ్డి ముఠాతో అగౌరవం
- అబద్ధాలతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు
- కాగ్ కడిగేసినా..11 సీట్లిచ్చినా బుద్ధి రాలేదు
- వైసీపీ దోపిడీని గుర్తించబట్టే ఇంటికి పంపారు
- కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి
- నేటి నామినేషన్ ర్యాలీని విజయవంతం చేయండి
- ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు
మంగళగిరి(చైతన్యరథం): కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు పిలుపునిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న తాను శుక్రవారం నామినేషన్ వేయనున్న సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చి నామినేషన్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే 3,46,000 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని చెప్పిన ఆయన రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలంటే కూటమి నాయకత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు. గత పాలనలో రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసు.. వైసీపీని ఓడిరచి ఇంటికి పంపినా కూడా జగన్‌రెడ్డి ఆలోచనలో ఏ మాత్రం మార్పులేదు.
రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్‌రెడ్డి మాత్రమే.. 16 నెలలు జైలులో ఉండి బెయిల్‌పై వచ్చిన ఆయన ఏ రకంగా పాలన సాగించావో అందరూ చూశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి విధ్వంసం సృష్టించారు..ప్రజా స్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగానికి విఘాతం కలిగించారు..ప్రతిపక్ష హోదా కూడా లేదు.. అసెంబ్లీ అంటేనే భయంతో పారిపోతున్నారు.. ప్రజలను వదిలి పారిపోతున్న జగన్‌రెడ్డి.. ఈ రోజు ఏ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో చూస్తు న్నాం. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుం ది. మద్యంపై ప్రేమ.. దోచుకోవాలనే ఆలోచన.. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో 11 కూడా మిగలవని హితవుపలికారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి నట్లు స్వయంగా కాగ్ చెబుతోంది.
జగన్ అరాచక పాలనతో అన్ని రంగాల్లో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. అంతకు ముందు చంద్రబాబు పాలనలో రాజధాని, పోలవ రాన్ని తీసుకువచ్చి..పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చారు. కానీ, జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అందరిని హింసించి వెనక్కి వెళ్లిపోయేలా చేశా రు. ఆయన దిగిపోయే నాటికి ఏ ఒక్కటి అయినా ఉందా? ఎవరికైనా ఉద్యోగం కల్పిం చారా? అని ప్రశ్నించారు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ లెస్ క్యాలెం డర్‌ను ప్రకటించిన ఘనత జగన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుంది. నాడు-నేడు కార్యక్రమాన్ని కేవలం అవినీతి కోసమే వినియోగించుకుని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ప్రజలు మీ మోసాలను, దోపిడీని గుర్తించబట్టే కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని హితవుపలికారు.
ఆలపాటిని గెలిపించి మండలికి గౌరవం తెద్దాం
ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ శుక్రవారం కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేం ద్రప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబును అవమానించిన తీరు, అసెంబ్లీలో జరిగిన విధానాన్ని ప్రజలు గమనించా రు. ఇది కౌరవ సభ రాను..గౌరవ సభ అయితేనే వస్తాను అని చంద్రబాబు చెప్పడం.. ఆయనను నమ్మి ప్రజలు 164 సీట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అసెంబ్లీ ప్రక్షా ళన అయిపోయింది.. ఇంకా కౌన్సిల్ ప్రక్షాళన మాత్రమే మిగిలి ఉంది. గత ప్రభుత్వం ముద్దాయిలు, నిందితులు, రౌడీ షీటర్లను, స్త్రీలను అపహాస్యం చేసిన వారిని ఎమ్మెల్సీగా నియమించింది.
వారిని చూస్తే రాష్ట్రం ఎటు పోతుందో కూడా అర్థం కాదు.. కౌన్సిల్ కూడా ప్రక్షాళన జరిగితేనే ప్రభుత్వం సజావుగా సాగుతుంది. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందజేశాం. 27న కచ్చితంగా లోకల్ సెలవు ఉంటుంది.. వ్యక్తిగత పనులు వాయిదా వేసుకుని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాళ్లు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులు కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. వివరాలు కావాల్సిన వారు స్థానిక నాయకులను సంప్రదించాలి. ఉమ్మడి కృష్ణా, గుంటూ రు జిల్లాలో 416 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశాం. కానీ, 80 అవసరమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రతిఒక్కరూ కూడా ఓటును బాధ్యతగా వినియోగించుకోవా లని పిలుపునిచ్చారు.