- ఇతర శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయం
- స్వచ్ఛంద విరమణకు అనుమతించాలని ఆదేశాలు
- గత పాలకమండలి తీర్మానం మేరకు టీటీడీ ఉత్తర్వులు
తిరుమల(చైతన్యరథం): టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు అదేశాలతో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిం దూమతే తర సంప్రదాయాలు అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకా రం హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగాలు పొందారు. అయితే తర్వాత నిబంధనలు ఉల్లంఘించి హిందూయేతర ఆచారాలను పాటిస్తూ భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. హిందూమతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ వారు పాల్గొంటు న్నారు. గత ఏడాది నవంబర్ 18న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో అన్యమత ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని లేదా వీఆర్‌ఎస్ ఇచ్చి బయటకు పంపాలని తీర్మానించారు. ఈ మేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాలు, విభాగాల్లో పనిచేస్తున్న హిందూయేతర సంప్రదాయాలను పాటిస్తున్న వారిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతర హిందూ కార్య క్రమాల విధుల్లో నియమించకూడదని పేర్కొంది.