అమరావతి (చైతన్య రథం): ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యబీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో ఏపీ ఉద్యోగులు చికిత్స పొందేందుకు అనుమతించింది. ఈమేరకు రిఫరల్ ఆసుపత్రులు గుర్తించాలని ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఏపీ ఉద్యోగులు, పింఛనర్లు… బిల్లులు రీయింబర్స్‌కాక నష్టపోయారు. విభజన తర్వాత అనేకమంది ఏపీ ఉద్యోగులు హైదరాబాద్‌లోనే సెటిలయ్యారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇకనుంచి తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ఆమోదం లభించింది.