తిరుపతి (చైతన్యరథం): క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తిప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడిరపచేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్సులో మంగళవారం పలువురు క్రీడాకారులు శాప్ ఛైర్మన్‌ను కలిశారు. యోగాలో గిన్నిస్ రికార్డ్ సాధించిన తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన సీహెచ్ వసంత లక్ష్మి స్పోర్ట్స్ కాంప్లెక్సులోని డీఎస్ఏ కార్యాలయంలో శాప్ ఛైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 2023, డిసెంబర్ 3వ తేదీన యోగాలో భాగంగా 3:42 గంటల పాటు సమకోనాసనం వేసి పాత రికార్డులను బ్రేక్ చేసినట్లు వివరించారు. దీనికిగానూ 2024 డిసెంబర్ 29న తన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదు చేశారన్నారు. ఈ సందర్భంగా ఆమెను శాప్ ఛైర్మన్ అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఇటీవల ఢల్లీిలో జరిగిన ఖోఖో తొలి ప్రపంచకప్‌లో ఇండియా నుంచి రిఫరీగా వ్యవహరించిన ఎస్.సురేష్‌కుమార్.. శాప్ ఛైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖోఖో నేషనల్స్‌లో ఏపీ నుంచి మూడుసార్లు ప్రాతినిథ్యం వహించానని, అలాగే సీనియర్ సౌత్ జోన్ నేషనల్స్‌లో ఎస్వీ యూనివర్సిటీ భాగస్వామ్యంతో మూడుసార్లు పాల్గొని సిల్వర్ మెడల్ కూడా సాధించినట్లు సురేష్ కుమార్ వివరించారు. ప్రస్తుతం యాదమర్రి మండలం కొటాలం జెడ్పీ ఉన్నతపాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ ఆయనను అభినందిస్తూ భవిష్యత్తులో ఖోఖో క్రీడాకారులకు మరిన్ని మెళకువలు నేర్పించి ఉత్తమ క్రీడాకారులుగా తయారుచేయాలని సూచించారు. క్రీడల్లో ఏపీ సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి డీఎస్డీఓ సయ్యద్ సాహెబ్, చిత్తూరు డీఎస్డీఓ బాలాజీ, కోచ్‌లు పాల్గొన్నారు.