అమరావతి (చైతన్యరథం): భారతదేశ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన యోధుడు నేతాజీ అని కొనియాడారు. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను.. అని నేతాజీ నినదించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఏటా జనవరి 23ను పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు, త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు వెలకట్టలేనివంటూ మంత్రి లోకేష్ అందరికీ పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
`