- ప్రజావినతులకు క్యూ కడుతున్న బాధితులు
- గుంటూరులో టీచర్స్ ఉద్యోగాల పేరుతో టోకరా
- బుద్ద మెగాషెక్త ఫౌండేషన్ రూ.45 కోట్లు స్వాహా
- పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు
- అర్జీలు స్వీకరించిన మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మేడా భాస్కర్‌రెడ్డిలు తమ గ్రామంలో ఎవరైనా చనిపోయినా, లేదా బతుకుదెరువుకు ఊరు విడిచి వెళ్లినా వారి భూములను కొన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి భూములు కబ్జా చేస్తున్నారని అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం పిఎస్.గుంటుకానిపల్లె గ్రామా నికి చెందిన అవసాని రమణయ్య ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. తమ భూమిని కూడా అలాగే కొట్టేశారని వివరిస్తూ దీనిపై తాము కోర్టుకు వెళ్లగా కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పారు. అయినా వైసీపీ కబ్జాదారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతిపత్రం అందజేశాడు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షరీఫ్, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ అర్జీలు స్వీక రించారు. విచారణ జరిపించి తగిన న్యాయం జరిగేలా చూస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు. పలువురు అధికారులతో ఫోన్లలో మాట్లాడి వెనువెంటనే సమస్యల పరిష్కా రానికి కృషి చేశారు.
` మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అండతో తుమ్మా వెంకట కృష్ణారెడ్డి, ఆయన అనుచరులు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి పేదలు, ప్రభుత్వ భూములు కొట్టేశారని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొత్తబొమ్మువానిపాలెంకు చెందిన తుమ్మా శివరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. వారి కబ్జాలపై అధికారులు విచారించి కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు.
` చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులు రమేష్‌రెడ్డి, సిద్దారెడ్డి, మధు, డి.నరేంద్రలు దౌర్జన్యంగా తమ భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని తిరుపతి జిల్లా తిరుపతి అర్బన్ మండలానికి చెందిన ఎస్.శామలాదేవి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రహరీ గోడను కూడా ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయా లని వేడుకుంది.
` గుంటూరులో ఉన్న బుద్ద మెగాషెక్త ఫౌండేషన్ వారు మెగా టీచర్స్ ఉద్యోగాల పేరుతో వందల మంది నిరుద్యోగులను మోసం చేశారని విశాఖపట్నం జిల్లా మధు రవాడకు చెందిన సునీత ఫిర్యాదు చేసింది. నిరుద్యోగుల నుంచి రూ.45 కోట్ల వరకు దండుకున్నారని.. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. డీజీపీ ప్రత్యేక చొరవ తీసుకొని నిరుద్యోగులను మోసం చేస్తు న్న అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని వాపోయింది.
` 1969లో ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని వైసీపీకి చెందిన వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్లతో దౌర్జన్యంగా కొట్టేయాలని చూస్తున్నాడని అనంతపురం జిల్లా తాడిపత్రి కి చెందిన పి.నాగరంగయ్య ఫిర్యాదు చేశాడు. ఆయనపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో తమ స్వాధీనంలో ఉన్న భూములను బలవంతంగా తీసుకుని ఎటువంటి పరిహారం ఇవ్వలేదని ఏలూరు జిల్లా జంగారె డ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన కొంపల్లి వెంకట రవణమ్మ వేడు కున్నారు. అన్యాయంగా పామాయిల్ చెట్లను తొలగించి తమను నష్టపరిచారని.. దయచేసి తమకు న్యాయం చేయాలని వేడుకుంది.
` తన భూమి మరొకరి పేరుపై ఆన్లైన్ అయిందని ప్రకాశం జిల్లా పామూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన యమ్మని వెంకటరత్నం తెలిపాడు. దానిని సరి చేసి తను పేరున ఆన్లైన్ చేయాలని విన్నవించాడు.
` తమ స్వాధీనంలో ఉన్న మెట్ట భూమిని కాపు శ్రీదేవి అనే మహిళ కబ్జా చేసిందని అనంతపురం జిల్లా కుందుర్తి మండలం యర్రగుంట గ్రామానికి చెందిన ఎం.మంజునాథ్ ఫిర్యాదు చేశారు. అధికారులు విచారించి దయచేసి తమ భూమిని కబ్జా నుంచి విడిపించాలని కోరారు.
` మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలంలోని గిరిజన గ్రామాలకు నాగావళి బ్యారేజీ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు 2019లో ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేస్తే ఆ ఉత్తర్వులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి సాగు, తాగునీరు లేకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఆక్కడి ప్రజలు మండిపడ్డారు. దయచేసి మళ్లీ నిధులు మంజూరు చేసి నీరు అందేలా చూడాలని ఆ గ్రామాలకు చెందిన రైతులు వినతిపత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు.