మంగళగిరి(చైతన్యరథం): ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం నుంచి ప్రజావేదికలో పాల్గొనే మంత్రులు, నాయకుల షెడ్యూల్‌ను పార్టీ కార్యాలయం ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు పార్టీ శ్రేణులు, ప్రజలకు వారు అందుబా టులో ఉండి అర్జీలు స్వీకరిస్తారు. పాల్గొననున్న మంత్రులు, నాయకుల వివరాలు ఇలా ఉన్నాయి. 17వ తేదీ శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు, 18న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, 20న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఎం.ఎ.షరీఫ్, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, 21న మంత్రి కొలుసు పార్ధసారథి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, 22న హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, 23న మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, 24న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి సవిత, ఏపీ కురుబ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, 25న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అర్జీలు స్వీకరిస్తారు.